Latest Updates
-
శృంగారం అంటే కేవలం అది మాత్రమే కాదు.. బంధం బలపడాలంటే ఈ రహస్యాలు తెలియాల్సిందే! -
నూనె పీల్చకుండా కరకరలాడే హోటల్ స్టైల్ ఆలూ బోండా.. పక్కా కొలతలతో ఇలా చేయండి! -
ఇంట్లో కూరగాయలు లేవా? ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో అదిరిపోయే 3 కూరలు ఎలా చేయాలో చూడండి! -
కలియుగంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? శాస్త్రాలు చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు ఇవే! -
సొరకాయ వద్దనే పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేసే సొరకాయ పకోడీ.. తయారీ ఇలా! -
ఆరోగ్యకరమైన దాల్ కిచిడీ: కడుపుకు హాయినిచ్చే ఈ కంఫర్ట్ ఫుడ్ ఇలా చేస్తే రుచి అద్భుతం! -
జూన్ 2న ఈ రాశిలోకి గురు గ్రహం.. ఆ రోజున ఏ పరిహారాలు చేస్తే మంచిది.? -
వేడి పెనంపై నీళ్లు చల్లితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.? -
ఫ్రిజ్ లో పెట్టిన అన్నం తింటే డేంజరా? అసలు నిజం చెప్పిన క్యాన్సర్ డాక్టర్! -
చంద్రుడి సంచారం: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, డబ్బు, ప్రేమ దక్కుతాయి!
రుచిలో రారాజు.. కానీ విదేశాల్లో రిజెక్ట్! భారతీయ మామిడిని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు బ్యాన్ చేస్తున్నాయి?
ప్రపంచంలోనే అత్యధికంగా ఏడాదికి దాదాపు 28 మిలియన్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పండ్ల రారాజుగా పిలిచే మన మామిడికి జపాన్ భారీ షాక్ ఇచ్చింది. నాణ్యతా ప్రమాణాలు, ముఖ్యంగా చీడపీడల నియంత్రణ విధానాల్లో లోపాలు ఉన్నాయంటూ భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులను జపాన్ పూర్తిగా నిలిపివేసింది.భారత్ లోని వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) కేంద్రాల్లో జపాన్ క్వారంటైన్ అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో పలు లోపాలను గుర్తించారు. ఎగుమతికి ముందు పండ్లలో ఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) లాంటివి లేకుండా చూడాల్సిన క్రిమిసంహారక ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని వారు నిర్ధారించారు.

జపాన్ తన వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి చీడపీడల విషయంలో కఠినమైన జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుంది. దీని ప్రకారం, మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలున్న మామిడి సరుకులను ఇకపై అనుమతించబోమని జపాన్ స్పష్టం చేసింది. దీంతో ఆల్ఫోన్సో, కేసర్, లంగ్డా, బంగినపల్లి వంటి ప్రీమియం రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత జపాన్ మన మామిడిపై ఇలాంటి కఠిన ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. 2006లో ఇలాంటి నిషేధాన్నే ఎత్తివేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. జపాన్ నిర్ణయంతో ఇతర దేశాలు కూడా మన నాణ్యతా ప్రమాణాలపై భవిష్యత్తులో సందేహాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు భయపడుతున్నారు.
అయితే రుచిలో సాటిలేని మన మామిడి పండ్లను జపాన్, అమెరికా, యూరప్ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలు అప్పుడప్పుడు నిషేధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మధురమైన భారతీయ మామిడిని పలు అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు తిరస్కరిస్తున్నాయి? దీని వెనుక అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ, ఆరోగ్య, నాణ్యతాపరమైన కారణాలు ఉన్నాయి.
జపాన్ నిషేధానికి ప్రధాన కారణాలు
ఆహార భద్రత (Food Safety), నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠినంగా వ్యవహరించే దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. జపాన్ భారతీయ మామిడిపై గతంలో దీర్ఘకాలిక నిషేధం విధించడానికి ప్రధాన కారణం పండ్లకు ఆశించే కీటకాలు. ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లైస్(పండ్ల ఈగలు),మామిడి టెంక పురుగులు జపాన్ అధికారులను ఆందోళనకు గురిచేశాయి. ఈ కీటకాలు మామిడి పండు లోపల గుడ్లు పెడతాయి, ఇవి బయటకు ఏమాత్రం కనిపించవు. ఈ పండ్లను దిగుమతి చేసుకుంటే, ఆ కీటకాలు జపాన్ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న స్థానిక పంటలను సర్వనాశనం చేస్తాయని వారు భయపడ్డారు.
దీనికి పరిష్కారంగా, పండ్లను పంపే ముందు వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ అనబడే అత్యాధునిక విధానం ద్వారా 100% కీటకాలను నాశనం చేశామని నిరూపిస్తేనే జపాన్ తమ దేశంలోకి మామిడిని అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ సదుపాయాలు భారత్‌లో పెరిగాక మాత్రమే జపాన్ తమ నిషేధాన్ని సడలించింది.
ఇతర దేశాలు భారతీయ మామిడిని ఎందుకు తిరస్కరిస్తున్నాయి?
ఫైటోశానిటరీ ప్రమాణాలు
విదేశీ మార్కెట్లలో ఎగుమతి చేసే ఆహార పదార్థాలపై సూక్ష్మక్రిములు, ఫంగస్, బ్యాక్టీరియా, కీటకాలు లేకుండా చూసుకునే ప్రమాణాలను ఫైటోశానిటరీ అంటారు. 2014లో యూరోపియన్ యూనియన్ (EU) దిగుమతి చేసుకున్న భారతీయ మామిడి పండ్లలో అత్యంత ప్రమాదకరమైన ఫ్రూట్ ఫ్లైస్ ని గుర్తించి ఏకంగా మన పండ్లపై నిషేధం విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక కంటైనర్‌లో ఒక్క పండులో కీటకం కనిపించినా, ఆ కంటైనర్ మొత్తాన్ని తిరస్కరిస్తారు.
అధిక రసాయనాలు, పురుగుమందుల అవశేషాలు
అధిక దిగుబడి కోసం చాలా మంది రైతులు మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఈ మందుల అవశేషాలు పండ్ల పైన, లోపల ఉండిపోతాయి. అంతర్జాతీయ ల్యాబొరేటరీలలో పండ్లను పరీక్షించినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. దీనికి తోడు, పండ్లను రంగు కోసం, త్వరగా పండించడానికి మన దేశంలో కాల్షియం కార్బైడ్ వాడుతుంటారు. ఇది క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ రసాయన అవశేషాల వల్లే అమెరికా, యూరప్ దేశాలు మన పండ్లను తరచుగా పక్కన పెడుతున్నాయి.

శాస్త్రీయ ప్యాకింగ్, కోత విధానాలు లేకపోవడం
మామిడిని చెట్టు మీద నుంచి అశాస్త్రీయంగా కోయడం వల్ల పండ్ల చర్మం దెబ్బతింటుంది. కోసిన వెంటనే మురికి ఇళ్లలో ఉంచడం, కనీస ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోవడం వల్ల పండ్లు గమ్యస్థానం చేరేలోపే కుళ్ళిపోతున్నాయి. మెక్సికో, పెరూ, థాయ్ లాండ్ వంటి దేశాలు ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో ఎగుమతులు చేస్తూ మనకు తీవ్ర పోటీ ఇస్తున్నాయి.
ఎగుమతి ట్రీట్‌మెంట్ కేంద్రాల కొరత
అమెరికా వంటి దేశాలకు మామిడి పంపాలంటే కచ్చితంగా గామా ఇర్రేడియేషన్ చేయాలి. యూరప్ దేశాలకు VHT చేయాలి. మధ్యప్రాచ్య దేశాలకు హాట్ వాటర్ డిప్ చేయాలి. కానీ మన దేశంలో ఈ భారీ ప్రాసెసింగ్ యూనిట్లు మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ వంటి రాష్ట్రాల్లోని కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి.
ప్రభుత్వ చర్యలు
ఈ సవాళ్లను అధిగమించడానికి భారత ప్రభుత్వ ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (APEDA) కఠిన చర్యలు చేపట్టింది. మ్యాంగో నెట్ అనే అత్యాధునిక ట్రేసిబిలిటీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏ పండు ఏ పొలంలో పండింది, ఏ రసాయనాలు వాడారు అనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల నకిలీ లేదా రసాయన పండ్లను ఎగుమతి చేయకుండా ముందే అడ్డుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల క్రమంగా నిషేధాలు తొలగిపోయి భారతీయ మామిడి మళ్లీ ప్రపంచ దేశాలకు విజయవంతంగా ఎగుమతి అవుతోంది.



Click it and Unblock the Notifications