తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే..

అన్నిసార్లు మనమంటే గిట్టనోళ్లు లేదా మన శత్రువుల ద్వారానే మనకి హాని జరగదు.మన అనుకున్న వాళ్ల నుంచే చాలా సందర్భాల్లో ఇబ్బందులు లేదా హాని జరుగుతుంది. మనం ఎక్కవగా నమ్మినోళ్లు నట్టేట ముంచుతారు. ఒక యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం తన కన్న తండ్రినే చంపేసి..మహానటి యాక్టింగ్ చేసింది. దీంతో ఆమెపై ఎవ్వరికీ అనుమానం రాలేదు.

అయితే 3 ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది. అసలు ఆ యువతి ఎవరు, తండ్రిని ఎలా చంపింది, 3 ఏళ్ల తర్వాత విషయం ఎలా బయటపడిందనే కీలక విషయాలను ఇక్కడ చూడండి.

The Ultimate Betrayal Daughter Poisons Father for Govt Job and Boyfriend

అసలేం జరిగిందంటే..

అది ఏప్రిల్ 25, 2023.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ కి చెందిన 45 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ జయంత్ బల్లావర్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. వెంటనే ఆయన కూతురు ఆర్య సడెన్ గా నాన్న ఇదిగో మిల్క్ షేక్ తాగు ఎండకి వెళ్తున్నావు చల్లగా ఉంటదని చెప్పింది. నా కూతురుకి నేనంటే ఎంత ప్రేమో అని నమ్మిన జయంత్ కి అదే ఆఖరి రోజని తెలియదు.

మిల్క్ షేక్ తాగి జయంత్ చంద్రాపూర్ లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకి వెళ్లాడు. అయితే కొద్దిసేపటికే ఇబ్బందిగా ఫీల్ అవుతూ కుప్పకూలిపోయాడు. డాక్టర్లు, పోలీసులు ఆయనది సహజ మరణం అని అనుకున్నారు. ఎవరి మీద అనుమానం లేదంటూ పోలీసులు కేసు క్లోజ్ చేశారు.

290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం?290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం?

జయంత్ చనిపోయాక కారణ్య మరణం కింద ఆయన కూతురు ఆర్యకి పోలీస్ ఉద్యోగం లభించింది. ఆ తర్వాత ఆశిష్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతా తాను అనుకున్నట్లే జరుగుతుందని భావించిన ఆర్యకి భర్త రూపంలో బిగ్ షాక్ తగిలింది. పెళ్లి అయిన మూడేళ్లకి ఆర్య-ఆశిష్ మధ్య విభేదాలు వచ్చాయి.

భర్త కోపంతో బయటపడ్డ నిజం

దీంతో కోపంతో ఆశిష్ ఈ ఏడాది మార్చి నెలలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి..జయంత్ మరణానికి ఆయన కూతురు ఆర్యనే కారణమని రికార్డింగ్స్, వీడియో ఫ్రూఫ్ లను పోలీసులకు ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులకు ఆర్య, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

బాయ్ ఫ్రెండ్ ఆశిష్ తో ఆర్య రిలేషన్ షిప్ ని తండ్రి జయంత్ వ్యతిరేకించాడని, అదే సమయంలో ఆమెకు పోలీస్ అవ్వాలనే కోరిక ఉండేదని..ఈ కారణంతోనే కష్టపడి చదవడం మానేసి తండ్రిని చంపితే కారుణ్య నియామకం కింద ఈజీగా తండ్రి ఉద్యోగం తనకు వస్తుంది, బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవచ్చని ఆర్య భావించింది. దీంతో వెంటనే తన కజిన్ దగ్గర నుంచి రూ. 5వేలకు విషం కొని దాన్ని మిల్క్ షేకులో కలిపి తండ్రికి ఇచ్చి చంపినట్లు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

Desktop Bottom Promotion