Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2025లో ప్రపంచం అంతం అవడం ఖాయం.. కావాలంటే ఇదిగో ప్రూఫ్.. సంచలన విషయాలు చెప్పిన బాబా వంగ
'త్వరలో యుగాంతం' ఈ మాట ఇప్పటి నుంచి వింటున్నది కాదు. 2012లో డిసెంబర్ 31న ప్రపంచం అంతమైపోతుందని ఓ పుకారు పుట్టింది. అప్పటి నుంచి ఈ పుకారు కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పుకారు కాస్త నిజమవ్వబోతోందని ప్రముఖ బాబా వంగా చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు భవిష్యత్తుకు సంబంధించి ఆమె ఎన్నో విషయాలను తాజాగా పంచుకున్నారు. అవేంటో కింద ఇచ్చాము చదవండి
అసలు ఎవరీ బాబా వంగా:
బాబా వంగ అసలు పేరు.. వాంజెలియా పాండేవా గుష్టెరోవా. ఆమె 9/11 ఉగ్రదాడులు, 2022లో యూకేలో సంభవించిన వరదలను ముందుగానే పసిగట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. దీంతో పలు ఉపత్తులను, ముందుగానే పసిగట్టడంతో ఆమె మాటలకు, ఊహాగానాలకు బలం చేకూరాయి.

బాబా వంగా భవిష్యత్తు గురించి ఏం చెప్పారంటే?
2025లో ఐరోపా ఖండంలో ఒక సంఘర్షణ పుట్టుకొస్తుందని, ఆ సంఘర్షణ కారణంగా వేలాది మంది మరణిస్తారు తెలిపారు. అక్కడి నుంచే ప్రపంచం అంతానికి అసలైన బీజం పడుతుందని, అదే యుగాంతానికి కారణమయ్యే అవకాశముందని తెలిపింది.
2028లో భూమి మీద ఉన్న వనరులు ముగిసే సమయం ఆసన్నమైందని గ్రహించిన మానవులు శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారని, అయితే ఆ గ్రహంపై వాతావరణం అనుకూలించకపోవడంతో అది జరగదని పేర్కొన్నారు.
2033.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంవత్సరమని, ఈ సంవత్సరం.. ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లోని మంచు గడ్డలు కరిగి.. సముద్రంలో పడతాయని, తద్వారా సముద్రపు మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశముందన్నారు.
2076లో కమ్యూనిజం తిరిగి వస్తుందని వంగా బాబా అంచనా వేశారు. అయితే ఈసారి కేవలం సోవియట్ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఇది విస్తరిస్తుందని అన్నారు.
2130 నాటికి మనం గ్రహాంతర వాసులతో పరిచయం పెంచుకోబోతున్నామని, ఇది మానవ మనుగడను మరొక స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.
2170 సంవత్సరం నాటికి భూమిపైనా వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, తద్వారా భూగ్రహం మొత్తం కరువు తాండవిస్తుంది అన్నారు.
3005 సంవత్సరంలో మానవులకు, గ్రహాంతర వాసులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని, వారితో యుద్ధానికి మానవులు అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పారు
3797వ సంవత్సరం నాటికి భూగ్రహం మీద మానవులు ఉండరని, వారు వేరే గ్రహానికి వెళ్తారని చెప్పారు. భూమి మీద వాతావరణం నాశనం అవడంతో పాటు.. కరువు తాండవిస్తుండడంతో వారు వేరే గ్రహానికి వెళ్ళాక తప్పదన్నారు.
5079వ సంవత్సరంలో ఈ యుగం ముగుస్తుందని, ఆ సంవత్సరంతో ప్రపంచం మొత్తం అంతం అవుతుందని, మానవ మనుగడే ఈ విశ్వంలో ఉందని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications