Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
ఈ రాశి అమ్మాయిలను చూస్తే అబ్బాయిని పడిపోతారంతే!
అమ్మాయిలు అందంగా ఉండాలని, అందరిలోనూ చాలా ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వేలకు వేల తగిలేస్తూ.. అందంపై దృష్టి పెడతారు. బ్యూటీ పార్లర్లు, మేకప్ లు అంటూ నానా రచ్చ చేస్తుంటారు. అయినప్పటికీ కొందరు అందంగా కనిపించరు.
కానీ కొందరు అమ్మాయిలు ఏం చేయకపోయినా తెగ అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ప్రతీ ఒక్కరూ వీరిని చూసి ఫిదా అయిపోతుంటారు. అయితే ఇందుకు చాలానే కారణాలు ఉన్నప్పటికీ.. వారి రాశులు కూడా ఓ కారణమే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రాశి చక్రమంలోని వ్యక్తులపై ప్రేమ చూపే నలుగురు రాశి చక్ర మహిళలు ఉన్నారని తెలుస్తోంది. ఈ రాశి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారట. వీరిని ఎవరూ చూసిన ఇట్టే ప్రేమలో పడిపోతారు. మొదటి చూపులోనే ఇలాంటి అమ్మాయిలే భార్యలుగా రావాలని ఫీలైపోతుంటారు. కళలు కూడా కనేస్తుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో ఈ నాలుగు రాశుల స్త్రీలు మరింత ముందంజలో ఉన్నారు. అయితే ఆ నాలుగు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. వృషభ రాశి:
వృషభ రాశి వాళ్లకు జీవితంలో ప్రేమ లోపం ఉండదు. అందరూ వీరిని చూసి ఆకర్షితులవుతుంటారు. వారి జీవితాల్లో కూడా ప్రేమ వ్యవహారం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయినప్పటికీ.. వారు తమ బంధంలో చాలా నిజాయితీగా ఉంటారు. కానీ వీరిని తరచుగా వారి భాగస్వామి మోసం చేస్తూ ఉంటారు. వీరి వైవాహిక జీవితం అస్సలే బాగుండద.ు కానీ ఈ రాశి వారు సామాజిక జీవితంలో తగినంత విలువ, గౌరవ, మర్యాదలను కల్గి ఉంటారు.
2. కర్కాటక రాశి:
కర్కాటక రాసి వారు జీవితంలో ఎప్పుడూ ప్రేమను కోల్పోరు. కానీ వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఈ రాశి అమ్మాయిల దాంపత్య జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. వారి భర్తలు చాలా ప్రేమగా ఉంటారు. ఈ వ్యక్తులు తమ వైవాహిక సంబంధానికి నిజాయితీగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా భర్త పక్కనే ఉంటారు. వీరికున్న ఆకర్షణే తమ భర్తలను లా ఉండేలా చేస్తుంది మరి.
3. వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా ప్రేమను పొందినప్పటికీ.. జీవితంలో స్థిరత్వం లోపిస్తుంది. వీరు ఆకర్షణకు పెట్టింది పేరు. అయితే ఈ రాశి అమ్మాయిలకు ఈ రాశికి చెందిన అబ్బాయిలు భర్తలుగా వస్తేనే సర్దుబాటు చేసుకుంటారు. లేదంటే చాలా కష్టం.
4. మీన రాశి:
మీర రాశి వాళ్లను చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. చాలా మంది మీన రాశి వారితో ఉండేందుకు ఇష్ట పడతారు. ఈ రాశి వాళ్లు తమ జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. అయితే అందరి ప్రేమను పొందడంలోనూ మీన రాశి వాళ్లు ముందుంటారు.
ఈ నాలుగు రాశుల అమ్మాయిలను ఎలాంటి అబ్బాయి చూసినా ఇట్టే ప్రేమలో పడిపోతాడు. ప్రేమ కాకపోయినా అలాంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుండని అనుకుంటారు. అంత అందంగా లేకపోయినప్పిటికీ.. మొహం చాలా కళగా, ఆకర్షణీయంగా ఉంటుంది మరి. మీది ఇదే రాశి అయితే.. మీరే గమనించుకోండి. మిమ్మల్ని చూసి ఎంత మంది ఫ్లాట్ అయిపోతున్నారో. ఫ్లాట్ అయిన వారిని కాకుండా మీకు కూడా నచ్చిన వారినే పెళ్లి చేసుకొని హాయిగా గడపండి. పెళ్లిని నూరేళ్ల పంటల్లా మార్చుకున్నప్పుడే మీ జీవితమంతా హ్యాపీగా సాగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
