Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా? ఆదివారం ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి
సనాతన ధర్మం ప్రకారం, ప్రతి రోజూ ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనదే. వారంలోని ప్రతి రోజూ ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలాగే ఆదివారం సూర్యుడి రోజుగా పరిగణిస్తారు. నవగ్రహాలకు సూర్యుడు అధిపతి. సూర్య భగవానుడు జాతకంలో ఉచ్ఛ స్థితిలో ఉంటే ఆ రాశుల వారు సమాజంలో గౌరవం, కీర్తిని పొందుతారు. అలాగే సమాజంలో మంచి స్థితిలో ఉంటారు.
ఆదివారం రోజు సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు, సవాళ్లతో సతమతం అవుతున్నవారు, ఆర్థిక సమస్యలతో చేతిలో రూపాయి కూడా మిగలక ఇబ్బంది పడేవారు, కుటుంబ కలహాలతో బాధపడే వారు, మనశ్శాంతి కరవైన వారు ఆదివారం రోజు సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.

సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటే..
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాల్లో సూర్యుడిని అధిపతిగా, రాజుగా పరిగణిస్తారు. మొత్తం సౌర కుటుంబంలో ఎప్పుడూ తిరోమనం చెందని, ఎప్పుడూ సరళమైన మార్గంలో ఉండే ఏకైక గ్రహం సూర్యుడు. మొత్తం 12 రాశి చక్రాల్లో సూర్యుడు సింహరాశిని పాలిస్తాడు. అలాగే సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అలాగే తులారాశిలో బలహీనమవుతాడు. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఆశించిన ఫలితాలను అందుకుంటాడు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. జీవితంలో చాలా ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉంటాడు.
సూర్యుడు బలహీన స్థితిలో ఉంటే..
జాతకంలో సూర్యుడు బలహీన స్థానంలో ఉంటే.. అలాంటి వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కష్టపడి పని చేసినప్పటికీ మంచి ఫలితాలను అందుకోలేరు. సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. గుండె సంబందిత వ్యాధుల వల్ల కూడా ఇబ్బంది పడతారు.
నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడిని ఆదివారం రోజు పూజించడం వల్ల అన్ని సమస్యలు, సవాళ్లు, దోషాలు తొలగిపోయి జీవితంలో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఆదివారం రోజు సూర్యుడిని ఎలా పూజించాలో, ఎలా పూజిస్తే.. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆదిత్య హృదయమ్ స్తోత్రాన్ని పఠించాలని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ స్త్రోత్రం సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనది. దీనిని పారాయణం చేసే వ్యక్తులకు సూర్యుని ఆశీస్సులు లభిస్తాయి. ఆనందం, శాంతి లభిస్తాయి.
- ఎంత కష్టపడ్డ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతుంటే, నిత్యం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఆదివారం రోజు రాగి పాత్రను లేదా గోధుమలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.
- ఆదివారం రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు వద్ద నాలుగు ముఖాలు కలిగిన దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే ఆమె అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
- ఆదివారం రోజు స్నానం నీటిలో ఎర్రటి పూలు వేసుకుని స్నానం చేయాలి. ఎర్రచందనం, యాలకులు, కుంకుమపువ్వు వంటివి వేసుకుని స్నానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి.
- శనివారం రాత్రి పడుకునే ముందు తలపై ఆవు పాల సీసా పెట్టుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత ఈ పాలను కూడా పూజించి తర్వాత సేవించాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
- అలాగే ఆదివారం రోజు చీమలకు పంచదార పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications