Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇలాంటి కలలు మీ ఫ్యూచర్ ఏంటో చెప్పేస్తాయి! మీకూ వస్తున్నాయా..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి కలలు ఏవి, ఎలాంటి కలలు వస్తే మంచి జరుగుతుంది లేదంటే చెడు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అందరూ కలలు కంటారు. కొందరు పగటిపూట కలలు కంటారు, మరికొందరు రాత్రి పూట నిద్రలో కలలు కంటారు. నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలకు చాలా అర్థాలు ఉంటాయి. మన భవిష్యత్తును అంచనా వేసే విధంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొంత మంది కలల ప్రపంచాన్ని మనస్సు యొక్క ఆలోచనగా భావిస్తారు. రోజంతా మనం చేసే పనుల వల్ల కూడా కలలు వస్తుంటాయి. అలాగే మనం ఆలోచించే తీరు వల్ల కలల్లో మార్పులు ఉంటాయి. ఒక పనిలో నిమగ్నం అయినప్పుడు దానికి సంబంధించిన కలలే వస్తుంటాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి కలలు ఏవి, ఎలాంటి కలలు వస్తే మంచి జరుగుతుంది లేదంటే చెడు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రోక్తంగా, జ్యోతిష్యపరంగా కలలు ఎలా వస్తాయంటే..:
మనస్తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి చాలా సార్లు రోజులో ఆలోచించి, అర్థం చేసుకున్న విషయాలకు సంబంధించిన అంశాలనే కలల రూపంలో చూస్తాడు. కొన్ని సార్లు మనస్సులో అణచివేయబడిన విషయాలు కలలుగా కనిపిస్తాయి. మరోవైపు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి కలకు దాని స్వంత ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అది మీ భవిష్యత్తును సూచిస్తుంది. అలాగే బ్రహ్మముహూర్తంలో కల వస్తే తప్పకుండా నెరవేరుతుందనే విశ్వాసం చాలా మందిలో ఉంటుంది.

కలలో భగవంతుని దర్శనం:
చాలా సార్లు ఎవరైనా కలలో దేవతలను చూసినట్లయితే అలాంటి కలలను శుభప్రదంగా భావించాలి. అలాంటి కలలు సానుకూల అర్థాన్ని కలిగి ఉంటాయి. కలలో దేవుళ్లు కనిపిస్తే మీ జాతకంలో మంచి సమయం త్వరలో ప్రారంభం అవుతుందని అర్థం.

కలలో ఏనుగు, ఆవు, నెమలి, చిలుక కనిపిస్తే..
కలలో ఆవు, నెమలి, చిలుక, ఏనుగు కనిపిస్తే జీవితంలో ఆనందకరమైన సమయంలో ఆసన్నమైందని అర్థం. ఇక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని భావించాలి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు కలలు ఇవి కనిపిస్తే ఆ సమస్యలు త్వరలోనే తొలగిపోయి ఇబ్బందులు తీరతాయని అర్థం. మీకు ఏనుగు, ఆవు, నెమలి, చిలుక కనిపిస్తే రానున్న ఫ్యూచర్ బాగుంటుందని భావించాలి.

కలలో దేవాలయం, మతపరమైన స్థలం కనిపిస్తే..
నిద్రిస్తున్నప్పుడు కలలో దేవాలయం లేదా మతపరమైన స్థలాన్ని చూడటం శుభ సంకేతం. అలాంటి కల వస్తే ఆ వ్యక్తి మతపరమైన కార్యక్రమంలో పాలుపంచుకుంటారని అనుకోవాలి. ఒక వ్యక్తి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి రానున్న రోజుల్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని అర్థం. లేదా ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు చేసుకుంటారని అనుకోవాలి.

కలలో మండుతున్న దీపాన్ని చూడటం..
కలలో మండుతున్న దీపం కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణించాలి. కలలో మండుతున్న దీపాన్ని చూడటం మీ వయస్సును పెంచుతుందని మరియు మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుందని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం మీపై ఎల్లవేళలా ఉంటాయని ఈ కల అర్థం.



Click it and Unblock the Notifications