Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. కన్నుమూసిన తల్లి సువర్ణలత
విలక్షణ నటనతో యావత్ భారతదేశాన్ని మెప్పించిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జీవితంలో ఇప్పుడు అమ్మ లేని లోటు ఏర్పడింది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నివాసంలోనే కన్నుమూశారని, ఆదివారం సాయంత్రమే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రకాష్ రాజ్ ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక మహోన్నత నటుడిగా కీర్తించబడుతున్నారంటే.. దాని వెనుక ఆయన తల్లి సువర్ణలత చేసిన ఎన్నో నిశ్శబ్ద త్యాగాలు, పడిన శ్రమ దాగి ఉన్నాయి. ప్రకాష్ రాజ్ బాల్యం పూలపాన్పులా సాగలేదు. తండ్రి మద్యపానానికి బానిస కావడం వల్ల కుటుంబ బాధ్యతలన్నీ సువర్ణలత గారే తన భుజాలపై వేసుకున్నారు.
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భావోద్వేగపరమైన ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం కుంగిపోకుండా ఒంటరి పోరాటం చేసి కుటుంబాన్ని నిలబెట్టారు. ఈ విషయాలను గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రకాష్ రాజ్ కన్నీటి పర్యంతమవుతూ పంచుకున్నారు. ఒక మనిషిగా, గొప్ప కళాకారుడిగా తాను ఎదగడంలో తన తల్లి స్ఫూర్తి చెరగని ముద్ర వేసిందని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.
సువర్ణలత గారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ లోకం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్ లో స్పందిస్తూ.. ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్‌రాజ్ గారి మాతృమూర్తి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి నేను తీవ్రంగా విచారించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ప్రకాష్ రాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు.
కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన ప్రకాష్ రాజ్..వ్యక్తిగత జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. 2004లో తన ఐదేళ్ల కుమారుడు సిధును కోల్పోవడం ఆయన జీవితంలో తీరని విషాదం. ఆ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగించారు. వ్యక్తిగత బాధలను తన వృత్తికి అడ్డురానివ్వని ప్రకాష్ రాజ్ ను.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన తల్లి మరణం మరోసారి తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.



Click it and Unblock the Notifications
