Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Yadadri Helicopter: యాదాద్రిలో కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంత కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు జరిగాయి. హైదరాబాద్ ఎయిర్‌లైన్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొత్త హెలికాప్టర్ కొన్నారు.
Yadadri Helicopter: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంత కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు జరిగాయి. హైదరాబాద్ ఎయిర్‌లైన్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొత్త హెలికాప్టర్ కొన్నారు. ఈ హెలికాప్టర్‌ను వాహన పూజ కోసం యాదాద్రికి తీసుకువచ్చారు. యాదాద్రి టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద నూతన హెలికాప్టర్‌కు ఆలయ అర్చకులు పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో కలిసి ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు హెలికాప్టర్ వద్ద కొబ్బరి కాయ కొట్టి వాహన పూజ చేశారు.

యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇది కొత్తేం కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు మొదటిసారిగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో వాహన పూజ నిర్వహించారు. అప్పట్లో ఆ హెలికాప్టర్‌కు స్వామి వారి పేరునే పెట్టారు.
ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొనుగోలు చేసిన హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్ ACH 135. దీని రేంజ్ 500 కిలోమీటర్లు. 20 వేల ఫీట్ల ఎత్తు వరకు వెళ్లగలదు. దీని ధర 5.7 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 47 కోట్లు. దీనికి పన్నులు అదనం.



Click it and Unblock the Notifications