Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
పెరిగిన ప్రమాదాలు..బాబా వంగా హెచ్చరికలు నిజమేనా?
భవిష్యత్తులో జరగబోయే సంఘటల గురించిన విషయానికొస్తే రెండు పేర్లు ప్రధానంగా వినబడతాయి. అందులో ఒకరు కాలజ్ణానం చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, మరొకరు బాబా వంగా. బ్రహ్మంగారు చెప్పినట్లు కొన్ని జరిగాయి,జరుగుతున్నాయి. ఇదే సమయంలో బల్గేరియా దేశాకి చెందిన బాబా వంగా అనే మహిళ చెప్పిన ఎన్నో జోస్యాలు నిజమయ్యాయని ప్రచారం ఉంది. చిన్న వయస్సులో ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన బాబా వంగా తర్వాత తన దివ్యదృష్టితో భవిష్యత్తుని చూడగల్గేదని చెబుతారు,ఆమె చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. అమెరికాపై 9/11 దాడి, బ్రెగ్జిట్, ప్రిన్సెస్ డయానా మరణం వంటివి ఆమె ముందే ఊహించారని బలంగా నమ్ముతారు.
ఇప్పుడు ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక జోస్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే జూలై 2025లో జరగబోయే ఒక పెను విపత్తు. విమాన ప్రమాదాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్స్ వణికిస్తున్నాయి. పంచభూతాలు పగబట్టాయా అన్న రేంజ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి. జులై నెలకు సంబంధించి బాబా వంగా ఏం జరగబోతోందో చెప్పిన విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఏమిటా జోస్యం?
జూలై 2025లో వాతావరణం, వ్యాధులు , ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన విషయాలు చెప్పిన బాబా వంగా ఇవి సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. వాతావరణంలో తీవ్రమైన మార్పులు, అపూర్వమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఆమె హెచ్చరించినట్లు చెబుతారు. ఈ మార్పు కారణంగా భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటివి మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆమె చెప్పినట్లు ఒక వాదన ఉంది. ఈ జోస్యం వినడానికి కేవలం ఒక ఊహలా అనిపించినప్పటికీ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆందోళన కలగక మానదు.
ఇటీవలి సంఘటనలతో సంబంధం ఏమిటి?
గత ఏడాది కాలంగా మనం చూస్తున్న ప్రకృతి వైపరీత్యాలు అసాధారణమైనవి.
అకాల వర్షాలు, వరదలు: దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాన్ని ముంచెత్తిన అకాల వర్షాలు, బ్రెజిల్ లో వేలాది మందిని నిరాశ్రయులను చేసిన భయంకరమైన వరదలు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సరళి ఎంతగా మారిపోయిందో చూపిస్తున్నాయి.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు: భారతదేశం, యూరప్, అమెరికా వంటి దేశాలలో నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అడవుల్లో కార్చిచ్చులు మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.\
భూకంపాలు: టర్కీ, జపాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో సంభవించిన భారీ భూకంపాలు భూమి అంతర్భాగంలో కదలికలు పెరుగుతున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
యాక్సిడెంట్స్: రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే బాబా వంగ చెప్పినట్లే జరుగుతోందా? లేక ఇవన్నీ కేవలం వాతావరణ మార్పుల తీవ్రమైన పరిణామాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంఘటనల తీవ్రత మాత్రం ప్రజలలో భయాన్ని రేకెత్తిస్తోంది.

ఇవాళ తిరుపతిలో ప్రమాదం
ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్ లో ఇవాళ(జులై 14,2025)మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజస్తాన్ లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్ ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్ కు ఇవాళ ఉదయం రెండు గంటలు ఆలస్యంగా 11: 50 కి చేరుకుంది. ప్యాసింజర్లను దించి రైల్వే యార్డులోకి వెళ్తున్న టైంలో ఇంజిన్ వెనుక ఉన్న బోగీలో సడెన్ గా మంటలు చెలరేగాయి, అదే టైంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ జనరేటర్ బోగీలోకి కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చేలాగా హిసార్ ఎక్స్ ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో ఓ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆదివారం జరిగిందిదే
చెన్నై హార్బరు నుంచి వాలాజా రోడ్ సైడింగ్ కు డీజిల్ లోడుతో ఆదివారం(జులై 13,2025) తెల్లవారుజామున వెళ్తున్న గూడ్సు రైలులోని కొన్ని వ్యాగన్లు తిరువళ్లూరు రైల్వే స్టేషను దాటి వెళ్తుండగా మంటల్లో చిక్కుకున్నాయి. కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయని, మూడో వ్యాగనులో మంటలు రావడాన్ని గమనించిన లోకో పైలట్ అత్యవసర బ్రేక్‌లు ప్రయోగించారని, సంఘటన గురించి తెలుసుకున్న తిరువళ్లూరు స్టేషను మాస్టరు ముందు జాగ్రత్త చర్యగా ఓవర్‌హెడ్ నుంచి వచ్చే విద్యుత్తు సరఫరాను నిలిపేయడంతో రైలును ఆపే సమయానికి మంటలు 19వ వ్యాగను వరకు వ్యాపించాయి. ఈ కారణంగా ఆ మార్గంగా పయనించే పలు రైళ్లను రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు.



Click it and Unblock the Notifications