Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
రామోజీరావు గురించి ఎవ్వరికీ తెలియని ఈ విషయాలు మీకు తెలుసా..?
ఈనాడు వ్యవస్థాపకులు, పారిశ్రామిక వేత్త రామోజీరావు మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈనాడుతో తన కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగూ ఎదుగుతూ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఆయన గురించి సీనియన పాత్రికేయులు, మేధావులు, రాజకీయ నాయకులు ఎందరో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
రామోజీరావు గురించి ఆసక్తికరమైన విషయాలు
రామోజీరావు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని అంటున్నారు. రామోజీ రావు ఏ సినిమా తీసినా అందులో సామాజిక స్పృహ, సామాజిక సందేశం ఖచ్ఛితంగా వుంటుంది. వ్యాపారంలో కూడా సామాజిక బాధ్యతను చూసేవారని మేధావులు చెబుతున్నారు.

రామోజీరావు నోటి నుంచి అనవసర పదం కానీ వాక్యం కానీ వచ్చేది కాదని అంటున్నారు. ఏది మాట్లాడినా కారణంతో వుంటుందని అంటున్నారు. అనవసరమాటలు, జోకులు ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదు.
తెలుగు భాషపైన ఆయనకు మక్కువ ఎక్కువగా వుండేది. తెలుగు పత్రికలో ఆంగ్ల పదం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విషయంలో క్రమశిక్షణతో నడుచుకోవడం కేవలం రామోజీరావుకే సాధ్యం.
మహాభారతాన్ని హాలీవుడ్‌లో రామోజీ ఫిలింసిటీలో షూట్ చేయించాలని అనుకున్నారు. గంటన్నర సినిమాలో మొత్తం 18 పర్వాలు వచ్చే విధంగా హాలీవుడ్ స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేయించారు.

తన ఉషాకిరణ్ బ్యానర్‌లో ఇప్పటి వరకు 95 సినిమాలు చేసారు, వంద సినిమాలు తీయాలనుకున్నారని చెబుతుంటారు. కుటుంబ కథా చిత్రాలు ఈ రోజుల్లో రావడం లేదు కాబట్టి మంచి కథ వుంటే సినిమా తీద్దామని రాయోజీరావు చివరి దశలో అనుకున్నారు.
రామోజీరావు స్థాపించిన ఈనాడు ఆగస్టు 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ వేడుకను ఒక పెద్ద పండగలా చేయాలని రామోజీరావు భావించారు. కానీ అది కలగానే మిగిలిపోయింది.
నూతన దర్శకులను, నూతన నటులను ఎంతో మందిని రామోజీరావు పరిచయం చేసి ప్రోత్సహించారు. దర్శకుడు తేజ, నటుడు ఉదయ్‌కిరణ్‌ను చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. హీరో తరుణ్‌ని కూడా నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేశారు. రీమాసేన్, రిచా, శ్రెయ, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రామోజీరావు పరిచయం చేశారు.
రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఓం స్పిరిచువల్ సిటీ అనే ఆధ్యాత్మిక నగరాన్ని కూడా రామోజీరావు నిర్మించాలనుకున్నారు. ఈ ఆధ్యాత్మిక నగరంలో 108 ప్రముఖ దేవాలయాల నమూనాలను నిర్మించాలని ఆయన కోరిక.
రామోజీరావు మొదట్లో చిట్‌ఫండ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తరువాత అన్నదాత అనే రైతు మ్యాగజైన్‌ను 1969లో ప్రారంభించారు.
1984లో శ్రీవారి ప్రేమలేఖ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళ్ భాషల్లో రామోజీ రావు సినిమాలను నిర్మించారు.
తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సీఎం జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం చూసి చాలా సంతోషించారని. తన చివరి దశలో ఇది అత్యంత సంతోషకరమైన విషయమని సన్నిహితులు చెబుతున్నారు.
సీనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, రాష్ట్రంలో ఆ పార్టీ విజయానికి రామోజీరావుకు చెందిన ఈనాడు పత్రిక కీలక పాత్ర పోషించిందని అంటున్నారు.
మీడియాలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో ఆయనకు పద్మవిభూషన్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహూకరించారు.



Click it and Unblock the Notifications