Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Manmohan singh: మన్మోహన్ సింగ్ గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సంచలన నిజాలు!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. భారత దేశానికి రెండు ప్రధాన మంత్రిగా ఒకసారి ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆయన.. భారత దేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన ఆయన భారత దేశం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన మృతిపట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రతి ఒక్కరూ ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. అయితే ప్రధాన మంత్రిగానే కాకుండా ఎన్నో పదవులు చేపట్టిన ఆయన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి తెలియని ఆసక్తికర విషయాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పని చేశారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పని చేసి ఆర్ధిక మంత్రిగా అయ్యింది కేవలం ఇద్దరు మాత్రమే వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ కావడం విశేషం.

ఆర్ధిక మంత్రులుగా పని చేసి, ప్రధానులుగా అయ్యింది చరిత్రలో నలుగురు మాత్రమే ఉన్నారు. వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. మిగిలిన వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీ.వీ.సింగ్ కూడా ఉన్నారు.
మన దేశానికి ఇప్పటి వరకు నలుగురు దౌత్యవేత్తలు మాత్రమే ఆర్ధిక మంత్రులుగా నియమితులయ్యారు. వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.
మన్మోహన్ సింగ్ ప్రసంగాలు ఎప్పుడూ ఉర్దూలోనే రాసేవారు. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడినప్పటికీ, భాషలో ఆయనకున్న ప్రావిణ్యం కారణంగా ఆయన ప్రసంగాలను ఉర్దూలో ఉండేవి. ఉర్దూలోనే చదివేవారు.
మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఉన్న పాకిస్థాన్‌లో పుట్టారు. ఆయన 14 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. దీని కారణంగా మన్మోహన్ సింగ్, ఆయన కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలి వచ్చింది. ఇప్పటికీ మన్మోహన్ సింగ్‌కు పాకిస్థాన్‌లో ఇల్లు ఉందని చెప్పుకుంటారు.
మన్మోహన్ సింగ్ చిన్నతనంలో చదువుకోవడానికి కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది. చదువుకోవడానికి లైట్స్ లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేందుకు కొన్ని మైళ్ళ దూరం వరకు నడవాల్సి వచ్చేదట.
2004లో మన్మోహన్ సింగ్ భారత దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పటి వరకు భారత దేశానికి ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్ కావడం విశేషం. ఆయన ఒకరికే ఈ ఘనత దక్కింది.
మన్మోహన్ సింగ్ తన జీవితంలో ఎన్నో స్థానాల్లో విధులు నిర్వర్తించారు. లెక్చరర్ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారు. లెక్చరర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి, ఆర్ధిక మంత్రి, గవర్నర్, ప్రధాని ఇలా ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించారు.
మన్మోహన్ సింగ్‌కు అరుదైన ఘనతలు కూడా ఉన్నాయి. 1993లో ఆయన యూరోమని, ఆసియామనీ "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచారు. ఇది ఆయన సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications