Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
జనవరి 2 నుండి 11 వరకు వైకుంఠ ద్వార శ్రీవారి దర్శనం, టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..
జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 10 రోజులకు పెంచింది. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 10 రోజులకు పెంచింది. గతంలో కేవలం 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించగా ఇప్పడు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుండి స్వామి వారిని దర్శనం చేసుకునే సౌలభ్యం కల్పించింది.

గతంలో 2 రోజులు మాత్రమే ఉండటంతో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామి వారిని దర్శించుకోగలిగారు. ఇప్పుడు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనుండటంతో దాదాపు 8 లక్షల మంది స్వామి వారిని దర్శించుకునే వీలు ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
జనవరి 2 నుండి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పండగ రోజుల్లో దర్శనానికి ముందుగా బుక్ చేసిన టైమ్ స్లాట్ ఆధారంగా టికెట్లు ఉన్న భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.

రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజుల కోటా పూర్తయ్యే వరకు ఆఫ్‌లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు.
భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, 2, 3 సత్రాలు, శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1వ తేదీ నుండి టోకెన్లు జారీ చేయనున్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇస్తామని టీటీడీ తెలిపింది.

వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?:
1. https://tirupatibalaji.ap.gov.in/ లింక్‌లోకి వెళ్లాలి.
2. మొబైల్ నంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి. తర్వాత OTP జనరేట్ చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చిన OTPని అక్కడ నమోదు చేసి లాగిన్ క్లిక్ చేయాలి.
3. సూచనలు జాగ్రత్తగా చదవాలి. ఎంచుకున్న లొకేషన్ ఆధారంగా ఒక్కో బుకింగ్‌కు అనుమతించబడే వ్యక్తుల సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు తిరుపతి స్థానానికి కనీసం ఇద్దరు, గరిష్ఠంగా నలుగురు భక్తులు అనుమతించబడతారు. అనుమతించిన వ్యక్తుల కంటే ఎక్కువ దర్శన టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే తిరుమలలో అదనపు గదులు తీసుకోవాల్సి ఉంటుంది. యాత్రికులు వసతిని బుక్ చేసుకోవచ్చు. కనీసం ఒక రోజు ముందుగా గరిష్ఠంగా 120 రోజులు ముందుగా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
4. భక్తుల స్వస్థలాన్ని పేర్కొనాలి.
5. టికెట్లు ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉన్నాయో తనిఖీ చేసి ఆయా తేదీల్లో ఇష్టమైన తేదీని ఎంచుకోవాలి.
6. క్యాలెండర్‌లో టీటీడీ దర్శనం కోసం ఇష్టమైన తేదీలను ఎంచుకోవచ్చు. స్లాట్‌లు అందుబాటులో ఉంటే ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది. వేగంగా నిండుతూ ఉంటే పసుపు రంగులో చూపిస్తుంది. ఎరుపు రంగు కనిపిస్తే ఆ తేదీల్లో కోటా అయిపోయిందని అర్థం.
7. అందుబాటులో ఉన్న రూములు, వాటి ధర చూపిస్తుంది. ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చు.
8. ఏ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారో అక్కడ సమయం ఎంచుకోవాలి.
9. ఎంత మంది స్వామివారిని దర్శించుకుంటున్నారో వారి పేర్లు, వయస్సు, లింగం, ఫోటో ఐడీ ప్రూఫ్, ఐడీ కార్డు నంబర్, అడ్రస్ ఎంటర్ చేయాలి.



Click it and Unblock the Notifications