Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
జీతం పెరిగి ఆదాయం రెట్టింపు కావాలంటే.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి
ధనం మూలం ఇదమ్ జగత్.. ఏ పనికైనా డబ్బు కావాల్సిందే. సంతోషానికి, బాధకు కూడా డబ్బే కారణం. డబ్బుతో సంతోషం కొనలేం, డబ్బుతో ప్రేమను కొనలేం.. అనే మాటలను వదిలేయండి. బ్రతకడానికి, సౌకర్యవంతంగా జీవించడానికి, జీవితంలో ఓ లోటూ ఉండకూడదంటే డబ్బు కావాల్సిందే. చాలా మంది చాలీ చాలనీ ఆదాయంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలవదు. ఒకటో తేదీకి చేతుల్లో డబ్బులుంటాయి.. ఐదు పది రోజులయ్యకా బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే వెయ్యికి మించిన బ్యాంకు అకౌంట్లు ఎన్నో.

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఆదాయం రెట్టింపు కావాలని, చేతిలో డబ్బులు నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలీచాలనీ జీతానికి పని చేసే వాళ్లు ఎంతో మంది. చిన్న స్థాయి నుంచి కెరీర్ ను ప్రారంభించే వాళ్లే అధికం. అలాంటి వాళ్లు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగుల తమ తమ రంగాల్లో పైకి ఎదగడానికి ప్రమోషన్లు పొందడానికి ఈ చిట్కాలు తప్పకుండా ఉపయోగపడతాయి.
ఈ మధ్యకాలంలో ఉద్యోగాలకు ఏమాత్రం భద్రత లేదు. పెద్ద పెద్ద సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు కూడా క్షణాల్లో ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ఎంప్లాయిస్ కు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తూనే ఉన్నాయి. ఉద్యోగంలో భద్రంగా ఉండాలన్నా, స్థిరమైన ఆదాయం రావాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా కొన్ని వాస్తు చిట్కాలు పని చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ వాస్తు చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కెరీర్ పరంగా వృద్ధి సాధించడానికి పక్షు పక్ష్యాదులకు ఆహారం, నీరు అందించాలి. ఆకాశంలో విహరించే పక్షుల్లో దేవతలు నివసిస్తారని అంటారు. అందుకే పక్షులకు ఆహారం, నీరు అందిస్తే దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అలాగే వీధి కుక్కలకు ఆహారం అందించడంలో, రోడ్లపై తిరిగే ఆవులకు ఆహారం ఇవ్వడం మంచిది. దీని వల్ల ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది.
2. ఇంట్లో పెద్దలను దేవతలతో పోలుస్తారు. అందుకే ఏదైనా శుభకార్యమైనా, పండగైనా దేవతలను మొక్కడంతో పాటు ఇంట్లోని తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరించాలన్నది హిందువుల సాంప్రదాయం. తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
3. పని చేసే ప్రాంతంలో పచ్చని చెట్లు ఉంచుకోవాలి. డెస్క్ పై పని చేసే వారు చిన్న పాటి మొక్క ఉన్న కుండీని పెట్టుకోవాలి. మొక్కలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అలాగే మంచి మూడ్ ను కూడా అందిస్తాయి. అలాగే ఈ మొక్కకు ముళ్లు ఉండకూడదు. దాంతో పాటు డెస్క్ పై పెంచుకునే మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి.
4. వాస్తు ప్రకారం మనం కూర్చునే దిశ కూడా పని తీరుపై, ఉద్యోగంలో వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం డెస్క్ పని చేసే వారు. తూర్పు లేదా పడమర దిశలవైపు ముఖం చేసి కూర్చోవడం మంచిది. దక్షిణ వైపు, ఉత్తరం వైపు ముఖం చేస్తూ కూర్చోవడం మంచిది కాదు.
5. పని చేసే డెస్క్ కింద, టేబుల్ కింద డస్ట్ బిన్ ఉంచుకోవద్దు. వాస్తు ప్రకారం ఇలా ఉంచుకోవడం మంచిది కాదు. డస్ట్ బిన్ ఇలా ఉంచుకోవడం వల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి. టేబుల్ పక్కన, డెస్క్ పక్కన డస్ట్ బిన్ ఉంచుకోవాలి. అలా కుదరకపోతే.. టేబుల్ కింద ఉన్న డస్ట్ బిన్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల కొంతలో కొంత ప్రతికూలత తగ్గుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications