Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
రూ.20కే మంగళసూత్రం..ఆ ప్రేమకు చలించిపోయిన గోల్డ్ షాప్ ఓనర్..వైరల్ వీడియో
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గేదే లే అన్నట్లుగా గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఒక ఉంగరం కొనాలన్నా సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో పెరిగిన బంగారం ధరల గురించి తెలియక గోల్డ్ షాప్ కి వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యకు మంగళసూత్రం కొనాలని వెళ్లిన తాతకు ఊహించని విధంగా ఎదురైన అనుభవం ఏంటో ఇక్కడ చూడండి.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని అంబోరా గ్రామానికి చెందిన నివృత్తి షిండే(93),శాంతాభాయ్ భార్యాభర్తలు. అయితే ఎక్కడికి వెళ్లినా భార్యాభర్తలు కలిసే వెళ్తారు. వీరికి ధైవ భక్తి ఎక్కువగా ఉంది. వచ్చే నెలలో ఆషాఢ ఏకాదశి పండుగ ఉండటంతో కాలినడకన ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన సోలాపూర్ జిల్లాల్లోని పండార్ పూర్ కి కాలినడకన వెళ్లడం మొదలుపెట్టారు. అయితే ఛత్రపతి సంభాజీనగర్ కి(గతంలో ఔరంగాబాద్)చేరుకోగానే ఈ దంపతులు వెళ్తున్న దారిలో ఓ గోల్డ్ షాపులోకి వెళ్లారు. అయితే వీరు ఏదైనా ఛారిటీ కోసం వచ్చారో లేదా సహాయం కోసం వచ్చారేమో అని షాపులో వాళ్లు అనుకున్నారు. అయితే తాను ఎందుకు వచ్చాను అనేది తాత చెప్పగానే అక్కడ పనిచేసేటోళ్లు చాలా ఎమోషనల్ అయ్యారు.

ధోతీ,కుర్తా,నెత్తిమీద క్యాప్ ధరించి ఉన్న తాత అమాయకపు చూపులు షాపులో పనిచేసేటోళ్ల హృదయాలను పిండేశాయి. తన భార్య శాంతాభాయ్ కోసం ఓ మంగళసూత్రం కొనడానికి షాపుకి వచ్చాను అని తాత షాపులో వాళ్లతో చెప్పాడు. షాపు ఓనర్ కూడా అక్కడే ఉండటంతో ఆయన ఇదంతా గమనిస్తున్నాడు. ఈ సమయంలో తాత తన జేబులో నుంచి రూ.1120 తీసి మంగళసూత్రం కావాలని అడిగాడు. అయితే ఇది గమనించిన షాపు ఓనర్ చలించిపోయాడు. ఆ పెద్దాయన దగ్గర నుంచి కేవలం రూ.20 తీసుకొని మంగళసూత్రాన్ని ఇచ్చాడు. ఇదంతా షాపులో ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోకి 2 కోట్లకు పైగా వ్యూస్,లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఈ వయస్సులో కూడా తన భార్య కోసం మంగళసూత్రం కొనాలనుకున్న తాత గ్రేట్..ఆ షాపు ఓనర్ కి వాళ్ల ఆశీర్వాదం ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..నో డైమండ్స్, నో ఫ్యాన్సీ గిఫ్ట్స్..ఓన్లీ లైఫ్ టైమ్ కమిట్ మెంట్ అంటూ ఆ వృద్ధ దంపతులను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. జ్యూవెలరీ షాపు ఓనర్ చాలా దయగలిగిన వ్యక్తి అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



Click it and Unblock the Notifications