Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
పోలీసులంటే..చాలామందిలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినోళ్లే లంచాలు అంటూ పీక్కుతింటారని,డబ్బున్నోడినైతే కుర్చీలో కూర్చోబెట్టి..డబ్బులేనోడిని అయితే లాఠీలతో కుళ్లబొడుస్తుంటారని పబ్లిక్ లో ఒక టాక్ ఉంది. అదే సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటలు కష్టపడుతుంటారని కూడా పోలీసులపై మంచి అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.
ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలు అనేకం చూశాం. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ మహిళ పట్ల రైల్వే పోలీస్ ప్రవర్తించిన తీరుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ బయట ఉన్న టీ షాపు దగ్గర.. ఆర్ఫీఎఫ్(రైల్వే ప్రొటక్షన్ పోర్స్)సిబ్బంది ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి జుట్టు పట్టుకొని స్టేషన్ వైపు బలవంతంగా ఈడ్చుకెళ్లాడు. ఏదో చిన్న విషయం మీద ఆ మహిళకు, ఆ పోలీస్ మధ్య మాటల యద్ధం జరిగినట్లుంది. దీంతో ఆగ్రహించిన పోలీస్..మహిళకు గుణపాఠం చెప్పాలన్నట్లు ఆమెను చెంపదెబ్బలు కొట్టి, తర్వాత జుట్టు పట్టి ఈడ్చుకెళ్లాడు.

అయితే ఇదే సమయంలో తన భార్యను వడిచిపెట్టాలని ఆమె భర్త వేడుకుంటున్నా ఆ పోలీస్ కనికరించకుండా దౌర్జన్యం ప్రదర్శించాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతావారంతా చోద్యం చూస్తూ,ఫోన్లలో వీడియో తీసే పనిలో బిజీగా ఉండిపాయారు.
అయితే ఆ మహిళపై ఎందుకు దాడి చేశాడన్న దానికి పూర్తి కారణం ఇంకా తెలియరాలేదు. కానీ ఏదైనా సరే పోలీస్ అనే తన అధికారాన్ని ఉపయోగించి ఒక సామాన్య మహిళపై ఇంత దారుణ చర్యకు దిగడం ఏంటని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఈ వీడియోకు స్పందన రావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే దీనిపై స్పందించి విచారణకు ఆదేశించింది. వాస్తవాలను ధృవీకరించుకొని, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
స్పందించిన తెలంగాణ డీజీపీ
మహిళపై దాడికి పాల్సడిన ఆ పోలీస్ ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోం గార్డ్ గా గుర్తించారు. ఈ హోంగార్డు రైల్వే పోలీస్ దళంలో డిప్యుటేషన్ పై ఉన్నాడని, అతడిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, కేసు నమోదు చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని శనివారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ ఘటనను హేయమైనదిగా ఆయన అభివర్ణిచారు. ఇది పోలీస్ ట్రైనింగ్, సూచనలు పూర్తిగా అవమానించడమేనని ఆయన తెలిపారు.పోలీసులు డిపార్ట్ మెంట్ లో ఏ ర్యాంకు ఆఫీసర్ అయినా కానీ, ఎలాంటి కారణం చేత రెచ్చగొట్టబడినా కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని తాను సైబరాబాద్ సీపీని ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు.



Click it and Unblock the Notifications
