Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
హిందూ పెళ్లి విందులో ముస్లిం యువకుడు వికృతం..ఉమ్మేస్తూ రోటీల తయారీ..వీడియో చూడండి
శుభకార్యం జరుగుతున్న పెళ్లి వేడుకలో అందరూ ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో సందడి, రుచికరమైన భోజనాలతో ఆ వాతావరణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఆ భోజనాన్ని తయారు చేసే వ్యక్తి మన నమ్మకాన్ని వమ్ము చేస్తే? తినే ఆహారంపైనే ఉమ్మివేస్తే? ఊహించడానికే అసహ్యంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి దారుణమైన ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి విందు కోసం రోటీలు తయారు చేస్తున్న ఓ యువకుడు..వాటిపై ఉమ్మివేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలోని పహాసు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. అతిథుల కోసం వేడివేడిగా తందూరీ రోటీలు రెడీ అవుతున్నాయి. ఆ పనుల్లో నిమగ్నమైన మొహమ్మద్ డానిష్ అనే ముస్లిం యువకుడు రోటీ పిండిని చేతిలోకి తీసుకుని, దానిపై ఉమ్మివేసి ఆ తర్వాత దానిని తందూర్ లో (వంట పొయ్యిలో) కాలుస్తున్నాడు.
క్షణాల్లోనే వైరల్
ఎవరూ గమనించడం లేదనుకుని మొహమ్మద్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని సీక్రెట్ గా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
ఆ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే చేతులతో ఇంతటి నీచమైన పని చేస్తారా? అంటూ మండిపడ్డారు. పవిత్రమైన పెళ్లి వేడుకలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
నెటిజన్ల ఆగ్రహంతో రంగంలోకి పోలీసులు
సోషల్ మీడియాలో పెల్లుబికిన ఆగ్రహంతో పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) డాక్టర్ తేజ్‌వీర్ సింగ్ స్పందించి వివరాలు తెలిపారు
వీడియో ఆధారంగా నవంబర్ 2వ తేదీన పహాసు పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం డానిష్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
సోసల్ మీడియా శక్తి
ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పుగా మాత్రమే కాకుండా సామాజికంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. శుభకార్యాలకు వంటవాళ్లను పిలిపించుకుని, వారిని నమ్మి వంట బాధ్యతలు అప్పగిస్తాం. కానీ, ఇలాంటి వ్యక్తుల వల్ల ఆ నమ్మకమే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది కేవలం నైతిక తప్పిదం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమే.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆహార భద్రత విషయంలో నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాలని ప్రజలు కోరుతున్నారు.



Click it and Unblock the Notifications