Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Viral Videos : ఢిల్లీ మెట్రో రైలుపై మంటలు..! పబ్లిక్‌లో డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించిన వ్యాపారవేత్త..!
ఢిల్లీ మెట్రోలో సురక్షితంగా వెళ్తున్నామనుకుంటున్న ప్రయాణికులకు ఇప్పుడు ఓ భయం మొదలైంది. ఢిల్లీ మెట్రో రైల్‌లో మంటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన చొటుచేసుకుంది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
న్యూ ఢిల్లీలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్ ఆగివుంది. అక్కడి నుంచి వైశాలి వెళ్లడానికి సిద్ధంగా వుంది. కానీ అప్పుడే ఓ భయానక దృష్యం మెట్రోరైల్ ప్రయాణికుల్లో వణుకు పుట్టించింది. మెట్రో రైల్ పై భాగంలో రూఫ్‌టాప్‌లో మంటలు రావడం గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్స్‌లో బంధించారు. అక్కడేమి జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరిగ్గా సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ వెంటనే స్పందించింది. చెలరేగిన మంటలు ప్యాంటోగ్రాఫ్ పైన తగలడం వల్ల వచ్చిందని రైలు అధికారులు వివరించారు. అసలు మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమేంటో త్వరలో తెలుసుకుంటామని అన్నారు. దుర్ఘటన జరిగిన తరువాత రైలుకు సంబంధించిన ప్యాంటోగ్రాఫ్‌ను తొలగించి వేరే ప్యాంటోగ్రాఫ్‌ను అమర్చారు. తరువాత ఐదు నిమిషాలు ట్రయల్ చెక్ చేసుకొని రైలును స్టార్ట్ చేశారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ మెట్రో స్లేషన్లో హైఅలెర్ట్ ప్రకటించాల్సిన అవసరం వుందన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ మొత్తం ఒక ఫుడ్ కోర్టులా మారిందని ఒక యూజర్ విమర్శించారు. ఢిల్లీ మెట్రో రైళ్లో ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయ్.
ఇప్పుడే కాదు ఢిల్లీ మెట్రోలో గతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయ్. ఢిల్లీ మెట్రోలో మొత్తం 266 స్టేషన్లు వుండడం విశేషం. ఢిల్లీ మెట్రోలో రోజుకు 46 లక్షలకు పైమంది మెట్రో రైలును ఎక్కుతారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ 2002లో ప్రారంభం కావడం విశేషం. ఢిల్లీ మెట్రో రైల్ కింద మొత్తం 336 ట్రైన్లు వున్నాయి.
ఉత్తరప్రదేశలో ఓ ప్రముఖ వ్యాపారి వినోద్ మిష్రా అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తుపాకీతో డ్రైవర్‌ను బెరించిన దృష్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కారును డ్రైవర్ గుద్దడంతొ కోపం తట్టుకోలేక తుపాకీతో బ్రైవర్‌ను బెదిరించాడు. నడిరోడ్డుపై కాలర్ పట్టుకొని పిస్టాల్‌తోనే కొడుతుండడం చూడవచ్చు. ఈ దృష్యానికి సంబంధించిన వీడియోను ఒక జర్నలిస్ట్ పోస్ చేసి ముఖ్యమంత్రి, అధికారులు అందరూ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియోకు 2,30,000 ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా ఇలాంటి ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా జరిగినట్లు భావించవద్దా. వీడియో బాగా వైరల్ అవగానే విభూతికండ్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసుుల స్పందించారు. తుపాకీ తీసిన అతనిపై కేసు నమోదు చేశారు. అతని పై సెక్షన్ 323, సెక్షన్ 151 నమోదు చేశారు. ఈ దుర్ఘటనను రాజకీయాలను ఉపయోగించుకుందామనికొని యూపీ కాంగ్రెస్ ఈ వీడియోను రీషేర్ చేసింది.



Click it and Unblock the Notifications