Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Viral Videos : కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన కానిస్టేబుల్..!
ఈ రోజు వైరల్ వీడియోలు ఆసక్తిని రేకెత్తించాయ్. ఒక మ్యాట్రిమోనియల్ సైట్ తన వెబ్సైట్‌పై కట్నాన్ని లెక్క చేసేందుకు కట్నం క్యాలిక్యులేటర్ ట్యాబ్‌ను పెట్టడం నెటిజన్లను ఆగ్రహానికి తెప్పించింది. కర్నాటక ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించడానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

శాదీ డాట్ కామ్ వెబ్సైట్ మనందరికీ తెలసిందే. ఈ వెబ్‌సైట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద కాంట్రవర్సీని సృష్టించింది. షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్ సీఈవో అనుపమ్ మిట్టల్ డౌరీ క్యాలుకులేటర్ (కట్నం క్యాలిక్యులేటర్)ను ప్రవేశపెట్టి సమాజంలో విష సంస్కృతిని మళ్లీ తీసుకొని వస్తున్నాడని విమర్శలు వచ్చాయి. ఇలా ప్రవేశపెడుతున్నట్లు ఆ సంస్థ సీఈవో అనుపం సోషల్ మీడియాలో షేర్ చేయగానే కుప్పలు తెప్పలుగా ఆయన్ని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఇందులో వున్న ట్విస్ట్ ఏంటంటే డౌరీ క్యాలిక్యులేటర్‌పైన క్లిక్ చేసి వివరాలు ఇచ్చినప్పుడు దేశంలో కట్నం వల్ల ఎంత మంది మహిళలు చనిపోయారో లెక్క వస్తుంది.
కోతి ప్రాణాల్ని రక్షించిన కానిస్టేబుల్
ప్రాణం ఏదైనా ప్రాణమే. జంతువుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఛటారి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఒక కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించాడు. ఎండలో కోతి డీహైడ్రేట్ అవడం వల్ల పడిపోయింది. దీన్ని గమనించిన 51 ఏళ్ల వికాస్ తోమార్ అనే కానిస్టేబుల్ దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. దీంతో కోతి ప్రాణాలు తిరిగి దక్కాయ్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్నాటక ఆర్టీసీ బస్సులో 37 ఏడేళ్ల మహిళ ప్రసవించింది. బస్సు కోజికోడ్ వద్ద ఉన్నప్పుడు విషయం తెలుసుకున్న బస్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై దగ్గరలో వున్న ఆసుపత్రికి ఆమెను తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించాడు. బస్సు త్రిస్సూర్‌లో ప్రవేశించినప్పుడే ఆమె బస్సులో ప్రసవించింది. తరువాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది.
నెటిజెన్లు ఎంత ఫైర్ అవుతున్నా.. పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా కొందరు ఆకతాయిలకు ఇంకా బుద్ధి రావడం లేదు. బిహార్‌లోని ఒక వ్యక్తి నడుస్తున్న బైక్‌పైనే నడిరోడ్డులో డేంజరెస్ స్టంట్‌ను చేశాడు. బిహార్‌లోని సమస్తిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను చూసిన పోలీసులు వెంటనే అతనిపై కఠిన యాక్షన్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, పాపులారిటీ, ఫాలోవర్ల కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నట్లు బయటపడింది. బైక్ హై స్పీడ్లో బస్సు పక్కనుండే వెళ్తుండ్డం చాలా ప్రమాదకరంగా వుంది. కొంచెం అటూ ఇటూ అయినా బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే కాదు అతని చుట్టుపక్కల వున్న వాళ్లకు కూడా తీవ్ర ప్రమాదం పొంచి వుందని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.
తమిళనాడు కోయంబత్తూరు ఇళ్లల్లోకి పులులు వస్తున్నాయ్. కోయంబత్తూర్‌లోని ఒక ఇంట్లోకి చిరుత పులి వచ్చి ఆ ఇంటి గోడపైన వున్న కోడిపై దాడి చేసింది. ఈ సంఘటన మొత్తం ఆ ఇంటి సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.



Click it and Unblock the Notifications