Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..సాయంత్రం భారీ వర్షం పడే ఛాన్స్..ట్రాఫిక్ లో ఇరుక్కోకముందే ఇళ్లకు వెళ్లడం బెటర్!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు వర్షం ఉపశమనం కలిగించనుంది. ఇవాళ(ఏప్రిల్ 8)సాయంత్రం నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిసపింది. బలమైన ఈదురుగాలుు,మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షం పడిందంటే నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు తొందరగా ఇంటికి వెళ్లిపోవడం ఉత్తమం. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఇవాళ,రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్షోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లడబడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. కాగా,సోమవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్మల్ లో నమోదైంది.
ఇక, హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ని ఆదేశించారు.



Click it and Unblock the Notifications