Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఒంటికి సూదులు గుచ్చుతారు, కాగడాలతో కొట్టుకుంటారు, రంగు చల్లి మనువాడతారు.. భారత్‌లోని వింతైన పండుగలు
భారత్ లో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తుంటారు ప్రజలు. ప్రతి రాష్ట్రానికి పూర్తిగా భిన్నమైన సంస్కృతులు ఉంటాయిక్కడ. ఇందులో కొన్ని చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆచరిస్తున్న వింతైన కొన్ని పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భాగోరియా వేడుక, మధ్యప్రదేశ్:
దేశంలోని చాలా ప్రాంతాల్లో హోలీ జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు వివిధ రంగులు చల్లుకుంటారు. అయితే అలాంటి ఓ పండగను మధ్యప్రదేశ్ ప్రజలు కూడా జరుపుకుంటారు. అయితే ఇక్కడ రంగు చల్లడం వెనక చాలానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అదేంటి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రంగు చల్లితే దాదాపు సగం పెళ్లైపోయినట్లే. భాగోరియా వేడుకగా పిలిచే ఈ పండగను స్థానికులు వివాహ్ బజార్ అని కూడా పిలుచుకుంటారు. ఏటా హోలీకి వారం రోజుల ముందు భాగోరియా పండుగ జరుపుకుంటారు. ఈ వేడుకలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతారు. రంగు చల్లిన వారు ఓకే అనుకుంటే వివాహం అయిపోయినట్లే. మధ్యప్రదేశ్ లోని నిమార్, బజబువా, ధార్, బద్వానీ, అలిరాజ్ పూర్ ప్రాంతాల్లోని భిల్, భైలాల్ తెగలకు చెందిన గిరిజనులు ఈ వేడుక చేసుకుంటారు. ఆటపాటలు, గిరిజన నృత్యాలు, సంగీత వాయిద్యాలతో చాలా అట్టహాసంగా జరుగుతుంది ఈ వేడుక.

అగ్ని ఖేలి, కర్ణాటక:
కర్ణాటక కటీల్ ప్రాంతంలోని దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వేడుక జరుపుకుంటారు. ఇందులో పాల్గొనే వ్యక్తులు కేవలం ధోతీ మాత్రమే ధరిస్తారు. కర్రలకు నిప్పు వెలిగించి వాటిని ఒకరిపై ఒకరు విసురుకుంటారు. రావి పోసవానికే వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తారు. అత్తూరు, కోడెట్టూరు అనే రెండు గ్రామాలకు చెందిన వారు ఇందులో పాల్గొంటారు. స్నేహితులు, తెలిసిన వారే అయినా శత్రువుల్లా బరిలోకి దిగుతారు. మొత్తం 15 నిమిషాల పాటు సాగే ఈ వేడుకలో చాలా మంది మంటలు తగిలి తీవ్ర గాయాలు కూడా అవుతుంటాయి. ఆ గాయాలపై అమ్మవారి కుంకుమ చల్లుకుంటారు. ఏటా ఏప్రిల్ నెలలో 8 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.

తైపూసం, తమిళనాడు:
సినిమాల్లో, సోషల్ మీడియాల్లో ఈ పండగకు సంబంధించిన ఫోటోలు చాలా మంది చూసే ఉంటారు. ఒంటికి సూదులు, కత్తులు, శూలాలు, మేకులు గుచ్చుకుంటారు. చెంపలకు, నాలుకలకు సూదులు గుచ్చుకుంటారు. తలపైన కావడి మోస్తూ చెప్పులేకుండా ఊరేగింపుగా వెళ్తుంటారు. ఈ పండగను తమిళనాడుతో పాటు, తమిళులు ఎక్కువగా ఉన్న మలేషియా, సింగపూర్, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తారు. ఏటా తమిళ నెల థాయ్ లో పౌర్ణమి రోజున తైపూసం పండుగ చేసుకుంటారు. రాక్షసుడు శూరపద్మను ఓడించడానికి పార్వతీదేవి మురుగన్(సుబ్రహ్మణ్యస్వామికి) ఆయుధం ఇచ్చిన రోజు ఇది. ఈ పండగ వేళ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. శారీరక, మానసిక కష్టాలను భరించడం ద్వారా, భక్తులు తమను తాము శుద్ధి చేసుకుంటారని విశ్వాసం.

కర్నీమాత ఫెస్టివల్, రాజస్థాన్:
రాజస్థాన్ లోని బికనీర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేశ్కోనే అనే గ్రామం. ఇక్కడే ఉంటుంది కర్నీ మాత దేవాలయం. కర్నీ మాతను దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో వేలాది ఎలుకలు కనిపిస్తాయి. వాటిని దేవతాస్వరూపాలుగా చూస్తారు భక్తులు. నిత్యం పూజారులు వాటికి పాలు, ప్రసాదాలు అందిస్తుంటారు. ఈ ఎలుకలు కర్నీ మాత వారసులని, కర్నీ మాత తెగ వారని, సైనికులు అని రకరకాలుగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఎలుకలు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరిస్తారు. ఒకవేళ ఎవరి కాలి కిందైనా పడి ఎలుక చనిపోతే, దాని స్థానంలో వెండి ఎలుకను ఆలయానికి సమర్పించాలని చెబుతారు. చైత్రమాసంలో, ఆశ్వయుజమాసంలోనూ జరిగే నవరాత్రుల సమయంలో ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎలుకలకు నైవేద్యం అందిస్తుంటారు.

మాడే మాడే స్నాన, కర్ణాటక:
కర్ణాటక సుళ్యాలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం పాటిస్తారు. ఏటా తివూయం రోజు అనేక మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్ఠి వేడుక రోజు ఈ మాడే మాడే స్నాన ఆచారాన్ని పాటిస్తారు. మొదట కొందరు విస్తరాకుల్లో భోజనం చేస్తారు. వారి తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచేసి వాటిపై ప్రజలు పొర్లు దండాలు పెడుతుంటారు. ఇలా చేస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.



Click it and Unblock the Notifications