Latest Updates
-
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి
ఒంటికి సూదులు గుచ్చుతారు, శూలాలతో పొడుస్తారు.. వింటేనే ఒళ్లుగగుర్పొడిచే ఈ పండగలు భారత్‌లోనివే
భారత్ లో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు.. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు.. ఎన్నో ఎన్నెన్నో ఆచారాలు, వ్యవహారాలు. ఒక్కో మతం, ఒక్కో కులం, ఒక్కో తెగకు చెందిన వారు.. వారి వారి సాంప్రదాయాలు పాటిస్తుంటారు. మన ప్రాంతాల్లో తరచూ చూసేవి, వినేవి మనకు కొత్తగా అనిపించకపోవచ్చు కానీ.. కొన్ని రాష్ట్రాల్లో పాటించే ఆచారాలు మనకు వింతగా అనిపించవచ్చు. అందులో కొన్ని విచిత్రంగా అనిపిస్తే, మరికొన్ని మాత్రం గగుర్పాటుకు గురి చేస్తాయి.
అలాంటి ఒళ్లుగగుర్పొడిచే కొన్ని పండగ సాంప్రదాయాల్లో ఒంటికి తూట్లు పొడుస్తారు. ఒంటి నిండా సూదులు గుచ్చుతారు, శూలాలు గుచ్చి వాటికి నిమ్మకాయలు వేలాడదీస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఒంటికి సూదులు గుచ్చి వేలాడదీస్తారు. ఇలాంటి కొన్ని పండగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడన్ తూకం:
గరుడను తూకం అనేది తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పాటించే ప్రసిధ్ధ ఆచారం. ఈ ఆచారంలో భాగంగా పదునైన సూదులు, హుక్కులు గుచ్చుతారు. మలయాళ నెల మీనం (మార్చి-ఏప్రిల్) లో మీనా భరణి పండగ సందర్భంగా ఈ ఆచారం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కొన్ని ఆలయాల్లో కొట్టాయంలోని వడయార్ లోని ఎలంకావు దేవి ఆలయం కూడా ఉంది. పల్లిక్కల్కవు భగవతి ఆలయం, కొట్టాయం. అలప్పుజలోని పజవేడు దేవాలయం, ఎర్నాకులంలోని అరయిన్‌కవు దేవి ఆలయంలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు.
దారిక అనే రాక్షసిని వధించిన తర్వాత కూడా కాళీ మాత శాంతి చెందదు. ఈ సమయంలో దాహంతో, కోపాగ్నితో రగిలిపోతున్న కాళీ మాతను శాంతింపజేయడానికి విష్ణువు దాహం తీర్చడానికి గరుడిని కాళి వద్దకు పంపుతాడు. రక్తం చిందిస్తూ వెళ్లి గరుడు కాళీ మాత నోటిలో తన రక్తాన్ని చిందిస్తాడు. దాంతో కాళీ మాత శాంతిస్తుంది. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.
వేలాడే వ్యక్తి శరీరానికి మొదట హుక్కులు గుచ్చుతారు. వాటికి తాళ్లు కట్టి కొద్దిగా ఎత్తులో ఉన్న కర్రకు వేలాడదీస్తారు. ఆ వ్యక్తి గద్దలా వేలాడుతూ కాళీ మాత ఆలయం చుట్టూ తిప్పుతారు. హుక్కులు గుచ్చిన శరీరం నుంచి రక్తం ఒక్కో బొట్టు కారుతుంది. ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

చరక్ ఫెస్టివల్:
ఏటా ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఈ పండగను నిర్వహిస్తారు. 13వ తేదీ గత సంవత్సర ముగింపును, 14వ తేదీన మరుసటి బెంగాలీ సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ చరక్ పూజలను.. బత్రీ చరక్, నీల్ పూజ, గజన్ పూజ అని కూడా పిలుస్తుంటారు. చైత్ర మాసంలో సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. చరక్ పూజలను ఎక్కువగా వ్యవసాయ సమూహాలు, రైతులు.. శివుడు, శక్తి దేవతలను కీర్తిస్తూ వారి పేర్లను స్తుతిస్తూ ఒక నెలపాటు ఉపవాసాన్ని పాటిస్తారు. ఇలా చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని, అదృష్టాన్ని తీసుకువస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ పూజలో భాగంగా భక్తులు తమ శరీరానికి హుక్కులు, సూదులు గుచ్చుకుంటారు. ఒంటికి గుచ్చిన హుక్కులకు తాడు కడతారు. అలా కట్టిన తర్వాత పొడవాసి స్తంభం చుట్టూ తిరుగుతారు. ఇందులో కూడా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి చక్ చరక్, రెండోది చిల చరక్. ఇలా హుక్కులకు వేలాడితే మంచి జరుగుతుందని, సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

తైపూసం:
సినిమాల్లో, సోషల్ మీడియాల్లో ఈ పండగకు సంబంధించిన ఫోటోలు చాలా మంది చూసే ఉంటారు. ఒంటికి సూదులు, కత్తులు, శూలాలు, మేకులు గుచ్చుకుంటారు. చెంపలకు, నాలుకలకు సూదులు గుచ్చుకుంటారు. తలపైన కావడి మోస్తూ చెప్పులేకుండా ఊరేగింపుగా వెళ్తుంటారు. ఈ పండగను తమిళనాడుతో పాటు, తమిళులు ఎక్కువగా ఉన్న మలేషియా, సింగపూర్, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తారు. ఏటా తమిళ నెల థాయ్ లో పౌర్ణమి రోజున తైపూసం పండుగ చేసుకుంటారు. రాక్షసుడు శూరపద్మను ఓడించడానికి పార్వతీదేవి మురుగన్(సుబ్రహ్మణ్యస్వామికి) ఆయుధం ఇచ్చిన రోజు ఇది. ఈ పండగ వేళ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. శారీరక, మానసిక కష్టాలను భరించడం ద్వారా, భక్తులు తమను తాము శుద్ధి చేసుకుంటారని విశ్వాసం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications