Latest Updates
-
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!
నగ్నంగా దుక్కిదున్నుతారు, అర్ధనగ్నంగా నేలపై పడుకుంటారు.. వర్షాలు కురవడానికి ఒక్కో చోట ఒక్కో ఆచారం
వర్షాకాలం వస్తుందంటే చాలు అన్నదాతలతో పాటు ప్రజలు తెగ సంతోష పడిపోతుంటారు. కానీ వానా కాలం వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోతే తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఎలాగైనా వర్షం పడేలా చేయాలంటూ.. అనేక రకాలు పూజలు చేస్తుంటారు.
భారత దేశంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వింత వింత ఆచారాలతో వరుణ దేవుడి కరుణ పొందేందుకు ట్రై చేస్తుంటారు ప్రజలు. అసలు మన దగ్గర ఎలాంటి వింత ఆచారాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కప్పలకు పెళ్లిళ్లు చేయడం:
అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఒక ప్రసిద్ధ ఆచారం. వరుణ దేవుడి కరుణ తమ ప్రాంతంపై పడేలా చేయాలంటే.. ఆడ, మగ కప్పలకు వివాహం జరిపించాలని వీరు నమ్ముతారు. అందులో భాగంగానే కరువు ఏర్పడినప్పుడు రెండు కప్పలను తీసుకొచ్చి వాటికి వివాహం జరిపిస్తారు. ఆపై ఊరంతా ఊరేగిస్తూ.. అందరూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. ఆ తర్వాత ఆ కప్పలను ఓ చెరువులో లేదా కుంటలో వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నమ్ముతారు. అస్సాంలో ఏప్రిల్ 15వ తేదీన కమ్మ వివాహాలు జరిపించేందుకు ఒక సెలవు దినాన్ని కూడా ఇస్తారు. కర్ణాటకలో అయితే గాడిదలు, దేవుళ్లను దర్శించుకుంటారు చాలా మంది.

2. వరుణ యజ్ఞం:
హిందూ పురాణాలలో నీటి ప్రభువు వరుణుడు. అయితే ఈయనను ప్రసన్న చేసుకుంటే కచ్చితంగా వానలు పడతాయని అంతా నమ్ముతారు. ఈక్రమంలోనే పూజారులు వరుణ యజ్ఞం లేదా వరుణ భగవానుడి ప్రసన్నం కోసం నీటిలో మునిగి, భగవంతుని నామాన్ని వెయ్యి సార్లు జపిస్తారు. ఇలా ఓ భక్తుడు స్వామి వారిని పిలుస్తుంటే.. కచ్చితంగా వచ్చి కరుణిస్తాడని ప్రాశస్తి. అందుకే ఇలా వరుణ యజ్ఞం చేస్తుంటారు. అనేక ప్రాంతాల్లో డ్రమ్ముల నిండా నీటిని నింపి ఉంచగా.. పూజారులు అందులో మునిగి స్వామి వారి జపం చేస్తుంటారు.

3. బురద చల్లి పడుకొని ఆకాశం వైపు చూస్తూ:
ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ సమీపంలోని నారీ బారిలో ఓ వింత ఆచారం ఉంది. వరుణ దేవుడు కరుణించేందుకు.. చిన్నపిల్లలను బురదలో ఉంచుతారు. దాదాపు నగ్నంగా ఒళ్లంతా బురద రాసుకొని.. ఆకాశం వైపు చూస్తూ.. అంటే వీపు కింద ఉంచి పడుకుంటారు. ఆకాశం వైపు చూస్తూ.. దేవుళ్లను కరుణించమని, వర్షం కురిపించమని కోరడం సర్వ సాధారణం.

4. గ్రామాలకు బహిష్కరణ, వనాల్లోనే జీవనం:
తెలంగాణలోని కొన్ని గ్రామాల నివాసితులు ఓ రోజంతా వనవాసం చేస్తారు. అంటే గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని విడిచి పెట్టి అడవిలో రోజంతా గడుపుతారు. అక్కడే వంటలు చేసుకొని తిని.. సాయంత్రం వరకు ఆటపాటలు సాగిస్తారు. ఇలా చేయడం వల్ల వరుణ దేవుడు సంతోషించి వర్షం కురిపిస్తాడని ప్రజల విశ్వాసం.

5. శివారాధన - కర్రలు చేతబట్టి వెల్లకిలా పడుకోవడం:
జార్థండ్ లో వర్షం కురిసేందుకు పురుషులు తమ కుడి చేతిలో చెక్క కర్రను పట్టుకుని శివాలయం వెలుపల భాగంలో.. వెల్లకిలా పడుకొని ఉంటారు. గ్రామంలోని పురుషులంతా ఇలా చేస్తే వర్షం కురుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.

6. పొలాలను నగ్నంగా దున్నడం:
వర్షాలు కురవక కరవు కాటకాల్లో మునిగిపోతే.. ఉత్తర ప్రదేశ్ లోని మహిళలు ఈ వింత ఆచారాన్ని ఫాలో అవుతారు. గ్రామంలోని మహిళలంతా తమ పొలాల వద్దకు అర్థరాత్రి వెళ్లి నగ్నంగా మారి పొలం దున్నుతారు. దేవతలు స్త్రీలను ఆరాధిస్తారని.. ఇలా చేస్తే కచ్చితంగా వర్షం కురిపిస్తారని అక్కడి ప్రజల నమ్మకం.

7. అబ్బాయిలకు పెళ్లిళ్లు:
కర్ణాటక మాండ్య జిల్లాలోని గంగేనహళ్లి గ్రామంలో కుర్రాళ్లకు పెళ్లి చేస్తారు. ఒక అబ్బాయిని పెళ్లి కుమారుడిలా, మరో అబ్బాయిని పెళ్లి కూతురిలా తయారు చేసి గ్రామస్థులు అంతా కలిసి పెళ్లి చేస్తారు. ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేస్తారు. వర్షం కురవాలని ప్రార్ధిస్తూ ఇలా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేస్తారు.
ఇలా దేశ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. ఎవరు ఏం చేసినా వర్షం కురిసి అన్నదాతలు ఆనందంగా గడపడమే లక్ష్యం. ప్రజలందరూ పస్తులుండకుండా ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే వరుణ దేవుడి కరుణ కచ్చితంగా కావాల్సిందే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications