Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Side Effects of Covidshield : కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డుకడుతోంది..?
కరోనా వ్యాక్సిన్‌తో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆ వ్యాక్సిన్‌ను తయారు చేసే ఆస్ట్రాజెన్కా సంస్థనే నేరుగా ఒప్పుకుంది. ప్రస్తుతం ఆస్ట్రాజెన్కా బ్రిటెన్‌తో వ్యాక్సిన్ నాణ్యతకు సంబంధించి కోర్టులో కేసును ఎదుర్కొంటుంది. కోర్టులో తమ వ్యాక్సిన్ వల్ల కొన్ని దుష్ఫ్రభావాలు ఉన్నట్లు అంగీకరించింది. త్రాంబాసిస్, త్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని కోవిడ్ షీల్డ్ తయారు చేసిన ఫార్మీ సంస్థ స్పష్టం చేసింది.
బ్రిటెన్‌లో తయారైనా కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లోని సీరమ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన విషయం తెలిసిందే.
కోవిడ్ షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్
టీటీఎస్ వ్యాధి
కోవిడ్ షీల్డ్ వల్ల కలిగే వ్యాధి త్రాంబోసిస్ త్రాంబోసైటొపీనియా సిండ్రోమ్ అంటే ఏంటి ?
ఈ టీటీఎస్ వ్యాధి, వ్యాక్సిన్ తీసుకున్న 2 నుంచి 42 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకితే రక్తం గడ్డకట్టడం, తెల్లరక్తకణాలు పడిపోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే ఈ వ్యాధి బారిన పడే అవకాశముందని ఆస్ట్రాజెన్కా పేర్కొంటుంది.

బ్రిటెన్‌లో మొదటి కేసు
మొదటి టీటీఎస్ కేసు 2021లో బ్రిటెన్‌లో నమోదైంది. జేమి స్కాట్ అనే వ్యక్తి ఏప్రిల్ 2021లో కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతని మెదడులో రక్తం గడ్డకట్టిందని త్వరలోనే మరణిస్తాడని వైద్యులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి బ్రిటెన్ కోర్టులో వ్యాక్సిన్‌కు సంబంధించిన వారిపై లాసూట్ వేసి అప్పటి నుంచి పోరాడుతున్నాడు.
2021 నుంచి కోవిడ్‌షీల్డ్ కేసు
గత మూడు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే తమ వ్యాక్సిన్ కేవలం చాలా అరుదుగా కొన్ని కేసుల్లో మాత్రమే రక్తగడ్డకట్టే పరిస్థితి రావచ్చని అదే టీటీఎస్ వ్యాధి అని స్పష్టం చేసింది. కానీ టీటీఎస్ వ్యాధి రావడానికి కోవిడ్‌షీల్డ్ వ్యాక్సినే ప్రధాన కారణం కాదని అంటోంది.
కోవిడ్ షీల్డ్ సురక్షితం కాదు
కరోనా తరువాత వ్యాక్సిన తీసుకున్నా సరే చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారు. ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. కొందరు రక్తం గడ్డకట్టడం వల్ల కూడా చనిపోయినట్లు అక్కడక్కడా వార్తలు బయటపడ్డాయ్. అయితే ఆస్ట్రాజెన్కా తాజా ప్రకటనతో కోవిడ్ షీల్డ్ అంత సురక్షితం కాదని స్పష్టమవుతోంది.



Click it and Unblock the Notifications