Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
అనంత్ రాధికా అంబానీల గిఫ్టులు తెలిస్తే షాక్ కావాల్సిందే.. నీతా అంబానీ రాధికకు ఇచ్చిన నెక్లెస్ ధర..!!!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్ లోనే అత్యంత సంపద కలిగిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహము జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రాధికా మర్చంట్ ను దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుల సమక్షంలో పెళ్లాడారు అనంత్ అంబానీ. ఇక జూలై 13న ఆశీర్వాద్ వేడుక నిర్వహించగా జూలై 14న పెళ్లి ముగింపు కార్యక్రమం జరిగింది. క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. ఇంతవరకు అంబానీ పెళ్లి గురించి చర్చించుకుంటూ ఉంటే బాలీవుడ్ స్టార్స్ కి అంబానీలకు మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇండియాలోని టాప్ బాలీవుడ్ దిగ్గజాలు అనంత్ అంబానీకి ఇచ్చిన బహుమతులు ఏంటో తెలుసుకుందాం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అంబానీ పెళ్లి వేడుక జరిగిన ప్రతీ రోజూ ఆయన హాజరయ్యారు. కుటుంబ వ్యక్తిగా ఆయన ఆ వేడుకలో మనకు కనిపించారు. ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడైనఅంబానీ కుటుంబానికి ఏది ఇచ్చినా తక్కువనే అనుకోవచ్చు. అయినా కూడా షారుక్ ఖాన్ 5 కోట్ల విలువ చేసే ఒక స్పోర్ట్స్ కారును అనంత్ రాధికా దంపతులకు బహుమతిగా ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.
అనంత్ అంబానీకి దుబాయ్ అంటే చాలా ఇష్టం. అందువల్ల చిన్న కొడుకుకోసం దుబాయ్‌లోని జుమారాలో అత్యంత లక్జరీ స్థలంలో ఒక విల్లాను కొన్నాడు. 2022లోనే ఈ విల్లాను కొన్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి మెరుగులు దిద్దదుతూ మరమ్మత్తులు చేయిస్తున్నారట. 3వేల స్వ్కేర్ ఫీట్లో ఈ విల్లు వుంటుంది. ఇక్కడ అన్ని వసతులు ఉంటాయ్. పెళ్లైన తరువాత కొన్ని నెలల వరకు దుబాయ్‌కు షిఫ్ట్ అయి ఈ విల్లాలో వుంటారని తెలుస్తోంది.
అనంత్ అంబానీ అంటే అక్క ఈషా అంబానీకి చాలా ఇష్టం. అనంత్ కోసం ఈశా అంబానీ ఒక లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర సుమారు 4.5 కోట్లు వుంటుందని అంచనా. 2023ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఇషా అంబానీ తన ఆడపడుచు రాధికా మర్చెంట్‌కు ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ నెక్లెస్ ఖరీదు దాదాపు 8 కోట్ల రూపాయల పైగానే ఉంటుందని అంటున్నారు.
కైరా అద్వానీ, ఇషా అంబానీ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కైరా అద్వానీ, అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా హాజరు అవుతూ ఉంటుంది ఈ అంబానీ జంటకు కైరా అద్వానీ వెలకట్టలేని గిప్ట్ బహుమతిగా ఇచ్చింది. లక్ష్మీదేవి గణపతి బంగారు విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ గిఫ్ట్ చూసి రాధికా అనంత్ చాలా సంతోషించారు.
ఇక అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు పెళ్లివేడుకకు హాజరైంది. అలియా భట్ కూతురు రహాతో అనంత్ ఆడుకుంటున్న ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అలియా, రన్బీర్ కపూర్ అనంత్ రాధికాకు ఎంతో విలువైన గిఫ్ట్ ఇచ్చారు. రాధికా మర్చెంట్‌కు గుస్సీ బ్రాండ్ కు చెందిన ఒక స్పెషల్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్టుగా ఇచ్చింది. ఈ బ్యాగ్‌పై డైమండ్స్ అలంకరించి ఉంటాయ్. దీని విలువ కోటి రూపాయలు ఉంటుంది. రన్బీర్ 50 లక్షల విలువ చేసే షూస్‌ను అనంత్ కు ప్రెజెంట్ చేశాడు.
సల్మాన్ ఖాన్ అనంత్ అంబానీకి కోటి రూపాయల విలువ చేసే కస్టమైజ్ వాచ్‌ను, అలాగే ఖరీదైన డైమెండ్లను రాధికాకు బహుమతిగా ఇచ్చారని టాక్ నడుస్తోంది. అంబానీ వారుసడికి కోటి రూపాయల వాచ్ ఏమి సరిపోతుందని నెటిజెన్లు సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ సెరిమొనీలోనే అనంత్ అంబానీ 14 కోట్ల రూపాయల వాచ్‌ను ధరించాడు. అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లంటే చాలా ఇష్టం. అందుకే సల్మాన్ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
తల్లి నీతా అంబానీ తన ముద్దుల కొడుకు అనంత్ కు కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్‌ను ఇచ్చారు. తల్లి నీతా అంబానీ కోడలు రాధికా అంబానీకి అరుదైన డెమండ్లతో చేసిన నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని విలువ 580 కోట్ల దాకా వుంటుందని అంటున్నారు. ప్రపంచంలో వున్న విలువైన డైమండ్స్‌ను సేకరించి ఈ నెక్లెస్ తయారు చేశారు. ఎంతో మంది సెలబ్రెటీలు ఈ డైమండ్స్ కొనడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు.
అయితే జియో కస్టమర్లు కూడా అనంత్ అంబానీ పెళ్లికి పరోక్షంగా బహుమతులు ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జియో రేట్లు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











