Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Benefits of Laughing : నవ్వితే ఇన్ని లాభాలా.. నవ్వకపోతే మీరే నష్టపోతారు..
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అనే పాట మనం వింటూనే ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలి. శ్రీ కృష్ణ పరమాత్ముడు అన్ని సమయాల్లో ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. చివరికి మహాభారత యుద్ధంలోనే ఆయన చిరునవ్వుతోనే అర్జునుడికి గీతోపదేశం చేస్తారు. నవ్వడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదలై మనల్ని ఉత్సాహపరుస్తుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు. ఎందకంటే ఈ నెలలో 5వ తేదీన మనం ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి. ఈ సందర్భంగా మనం నవ్వు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
గ్లోబర్ లాఫ్టర్ యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన మధన్ కటారియానే ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకోవడానికి కారణమయ్యారు.
నవ్వడం వల్ల శరీరంలో వత్తిడిని కలిగించే అడ్రినలిన్, కార్టిసాల్ లెవెల్స్‌ను తగ్గించి ఆరోగ్యకరమైన ఎండార్ఫిన్ల స్థాయిని పెంచుతుంది. శరీరంలో ఏదైనా నొప్పి ఉన్నా కొంచం ఉపశమనం కలుగుతుంది.

నవ్వితే మానసికంగా బలంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మెదడును యాక్టివ్ చేస్తుంది. వత్తిడిని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి కూడా చాలా దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె పోటు రాకుండా నివారించే సామర్ధ్యం కూడా ఈ నవ్వుకు ఉంది.
ఆయుశ్శును కూడా పెంచే సామర్ధ్యం నవ్వుకు ఉంది. నార్వేలో జరిపిన పరిశోధనల ప్రకారం. ఎక్కువగా జోకులు పండించే వారు ఎక్కువ కాలం జీవించినట్లు కనుగ్గొన్నారు. క్యాన్సర్ ముప్పు నుంచి కూడా కొంత వరకు బయటపడినట్లు రిపోర్టులు వచ్చాయ్.
కడుపు చెక్కలయ్యేలా కడుపు నిండా నవ్వితే శరీరం 1 గంట పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్కసారి నవ్వితే అప్పటివరకున్న నిరాశ, బలహీనత మాయమైపోతుంది.
రోగనిరోధక శక్తిని కూడా పెంచే శక్తి నవ్వుకు ఉంది. యాంటి బాడీలను పెంచి స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది. దీంతో వ్యాధులు దరిచేరకుండా ఉంటాయ్.
మానవ సంబంధాలను కూడా నవ్వు మెరుగుపరుస్తుంది. ఇతరులను ఆకర్శించే శక్తి కూడా నవ్వుకు ఉంది. గొడవలు, వివాదాలను కూడా పక్కకు నెట్టేస్తుంది.
ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నవ్వితే సుమారుగా 40 క్యాలరీలు బర్న్ అవుతున్నట్లు పరోశోధనలు చెబుతున్నాయ్. నవ్వడానికి ఏ కారణం లేకున్నా నవ్వితే మాత్రం చాలా లాభాలున్నాయ్.
డిప్రెషన్‌ను కూడా తగ్గించే శక్తి నవ్వుకు ఉంది. 2015లో జరిపిన పరిశొోధనలో దీనిని కనుగ్గొన్నారు. డిప్రెషన్ తరువాత నవ్విన వాళ్లు దాని నుంచి బయటకు వచ్చి సంతోషంగా ఉన్నట్లు రిపోర్టు బయటపడింది. ఈ విషయంలో నవ్వుకు మించిన మందు లేదంటున్నారు.
ఇలా నవ్వడానికి ప్రయత్నించండి
ముందుగా ఒ చిరునవ్వు నవ్వండి. దానికి ఎలాంటి కరణం అవసరం లేదు. నవ్వడం వల్లే కాదు, చిరునవ్వుతో కూడా చాలా లాభాలున్నాయ్.
మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవండి. నెగటివ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి ఓ చిరునవ్వును ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉండండి.
నవ్వు వినిపిస్తే అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోండి. మీరు నవ్వడానికి ప్రయత్నించండి.
మీ మాటల్లో హ్యూమర్ ఉండే విధంగా చూసుకోండి. సాధారణంగా మాట్లాడకుండా నవ్వు తెప్పించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి.
కష్టసమయాల్లో, ప్రతికూల సమయాల్లో కూడా నవ్వడానికి ప్రయత్నించండి. అది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
నవ్వాలంటే కామెడీ సినిమాలు చూడండి, పిల్లలతో సరదాగా గడపండి, చిలిపి పనులు చేయడానికి ప్రయత్నించిండి అప్పుడు మీకు ఖచ్ఛితంగా నవ్వు వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
