Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Rachin Ravindra:కిక్రెట్ లో రాటు తేలిన రచిన్ రవీంద్రకి అనంతపురంతో ఉన్నసంబంధం ఏంటి?
Rachin Ravindra: భారతదేశంతో పాటు దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లోని యువకులు ఎక్కువగా క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతుంటారు. గల్లీ క్రికెట్ టీమ్ లో చోటు సంపాధించి క్రికెట్ బాగా ఆడి అందరి దగ్గర పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. అయితే జాతీయ జట్టులో స్థానం సంపాధించడానికి యువకులు ఎంత శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వన్డే ప్రపంచ కప్ లో వన్డే మ్యాచ్ ఆడిన ఓ యువకుడు ఒక్కరోజులోనే ఆదేశంలో హీరో అయిపోయాడు.
న్యూజిలాండ్ జట్టులో వన్డే ప్రపంచ కప్ ఆడిన రచిన్ రవీంద్ర పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే రచిన్ రవీంద్ర ఎవరు ?, ఆతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అయితే న్యూజిలాండ్ జట్టులో మొదటిసారి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్న రచిన్ రవీంద్రకు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ నీళ్లు బాగా ఒంటబట్టినట్లు ఉన్నాయి.

2023 వన్డే ప్రపంచ కప్ లో ఆడి సెంచరీతో సత్తాచాటుకున్న రచిన్ రవీంద్ర గురించి మన తెలుగోళ్లు చాలా తెలుసుకోవాలి. రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగిపెద్ద వాళ్లు అయ్యారు. రచిన్ రవీంద్ర తండ్రి క్రిష్ణమూర్తిది బెంగళూరు నగరం. క్రిష్ణమూర్తి వివాహం చేసుకున్న తరువాత ఆయన భార్యతో కలిసి 1990లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.
రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ లోనే పుట్టాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటానికి ఎక్కువ ఆసక్తి చూపించిన రచిన్ రవీంద్ర ఆటలో మెలుకవలు నేర్చుకున్నాడు. రచిన్ రవీంద్ర తండ్రి క్రిష్ణమూర్తి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ అనే క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఇదే క్రికెట్ క్లబ్ తరపున ఆక్కడి ఆటగాళ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలోని అనంతపురం వస్తున్న రచిన్ రవీంద్ర అక్కడే క్రికెట్ టోర్నీలు ఆడేవాడు.
ప్రతి ఏడాది అనంతపురం వస్తున్న రచిన్ రవీంద్ర అనంతపురంలోనే రూరల్ డెవలప్ మెంట్ (ఆర్డీటీ) క్రికెట్ మ్యాచ్ లు అడేవాడు. క్రికెట్ లో అన్ని మెలుకవలు అనంతపురంలో నేర్చుకున్న రచిన్ రవీంద్ర ఇదే అనంతపురంలో క్రికెట్ ఆడటంతో రాటుతేలిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్ లు మాత్రమే ఆడిన రచిన్ రవీంద్రకు న్యూజిలాండ్ జట్టు తరపున 2023 వన్డే ప్రపంచ కప్ ఆడటానికి అవకాశం వచ్చింది.
న్యూజీలాండ్ జట్టులో స్థానం సంపాధించిన రచిన్ రవీంద్ర 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆడటానికి అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. అయితే ఏమాత్రం తడబాటులేకుండా న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ కావడంతో వన్ డౌన్ బ్యాన్స్ మెన్ గా రచిన్ రవీంద్రకు అవకాశం వచ్చింది. కవీస్ మరో ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి చెలరేగిపోయిన రచిన్ రవీంద్ర వన్డే ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లోనే సెంచురీ చేసి అందరిని ఆకట్టుకున్నాడు.
ఓపెనర్ డెవాన్ కాన్వేతో పాటు రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసి ఒక్క వికెట్ కోల్పోయి 36. 2 ఓవర్లలోనే లక్షం సాధించి విజయకేతం ఎగరవేశారు. న్యూజిలాండ్ లో రాత్రికి రాత్రే హీరో అయిపోయిన రచిన్ రవీంద్ర భారతీయుడు కావడంతో ఇక్కడ ఆయన పేరు హాట్ టాపిక్ అయ్యింది. అనేక సందర్బాల్లో తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అని రచిన్ రవీంద్ర చెప్పిన విషయం తెలిసిందే. మొత్తం మీద రచిన్ రవీంద్రకు అనంతపురంకు అవినాభావ సంబంధం ఉన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.



Click it and Unblock the Notifications
