Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Pink Moon 2023: పింక్ మూన్ అంటే ఏంటి? ఎప్పుడు చూడవచ్చే తెలుసా?
సాధారణంగా చంద్రుడు తెల్లగా మిలమిల మెరిసిపోతుంటాడు. రాత్రి వేళ తెల్లని వెన్నెల వెలుతురు చాలా మందికి బాగా నచ్చుతుంది. అయితే అదే చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా. పూర్తి పింక్ కలర్ లో కనిపించి అలరిస్తే చూడాలని చాలా మందికి ఉంటుంది.
అసలు పింక్ మూన్ అంటే ఏంటి.. నిజంగానే చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడా.. భారత్ లో ఉండే వాళ్లు ఈ పింక్ మూన్ ను చూడవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ పింక్ మూన్ అంటే ఏంటి?
సూపర్ మూన్ అంటే భూమికి దగ్గరగా కక్షలోకి వచ్చినప్పుడు కనిపించే అద్భుతమైన చంద్రుడు. ఈ సమయంలో చంద్రుడు చాలా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సమయంలో భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం కాస్తంత తగ్గుతుంది. అలా సాధారణంగా కనిపించే చంద్రుడు మరింత భారీగా, అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
తూర్పు, ఉత్తర అమెరికాల్లో ఫ్లక్స్ సుబులాట అనే గులాబీ రంగు పూలు పూస్తాయి. ఈ పూల పేరు మీదుగానే సూపర్ మూన్ కు సూపర్ పింక్ మూన్ అనే పేరు వచ్చింది.
ఏప్రిల్ పౌర్ణమిని పెసాచ్, పాస్చల్, పాస్ ఓవర్ మూన్, స్ప్రౌటింగ్ గ్రాస్ మూన్, ఎగ్ మూన్, ఫిష్ మూన్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
పింక్ మూన్ అనగానే చంద్రుడు పూర్తిగా గులాబీ రంగులో కనిపిస్తాడని అనుకుంటే పొరబడినట్లే. మాస్ పింక్ అని పిలువబడే వైల్డ్ ఫ్లవర్ యొక్క వసంతకాలం ప్రారంభంలో వికసించే ఈ పూల నుండి పింక్ మూన్ అనే పేరు వచ్చింది.
సూపర్ పింక్ మూన్.. తేదీ, సమయం:
ఏప్రిల్ లో వచ్చే ఈ సూపర్ పింక్ మూన్‌ను వివిధ దేశాల్లో ఉన్న వాళ్లు వారి వారి టైమ్ జోన్లను బట్టి వేర్వేరు సమయాల్లో చూసే అవకాశం ఉంది. తూర్పు హరిజోన్ వారికి పింక్ మూన్ ను బాగా చూసే అవకాశం ఉంది.
భారత కాలమానం ప్రకారం సూపర్ పింక్ మూన్ ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం 10.04 గంటలకు కనిపిస్తుంది. అయితే ఉదయపు ఎండలో చంద్రుడిని చూడటం కష్టం కాబట్టి భారత్ లో ఉండే వారికి పింక్ మూన్ చూసే అవకాశం ఉదయం వేళ ఉండనట్లే.
అయితే పౌర్ణమికి ముందు ఒక రోజు, తర్వాత ఒక రోజు చంద్రుడు పూర్తిస్థాయిలో కనిపిస్తాడు కాబట్టి పింక్ మూన్ ను ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications
