Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భారత్ లో తొలి విమానం ఏ నగరంలో,ఎంత వేగంతో ప్రయాణించిందో తెలుసా!
ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అనేక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. వేలాది విమానాలు ప్రతిరోజూ మన గగనతలంలో దూసుకుపోతూ భారత విమానయాన పరిశ్రమ శక్తిని చాటుతున్నాయి. గంటల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా విమానంలో యాణించగలుగుతున్నాం. అయితే వందేళ్లకు పైగా క్రితం విమానాన్ని ఒక అద్భుతంగా భావించే రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటి విమానం ఎగిరినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉండి ఉంటుందో ఊహించగలరా? ఆ చారిత్రాత్మక ఘట్టం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
ఆ చారిత్రాత్మక రోజు
ఆ రోజు ఫిబ్రవరి 18, 1911. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నగరం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారతదేశంలో మొట్టమొదటి విమానం హంబర్ బైప్లేన్ గాలిలోకి లేచింది. ఈ విమానం అలహాబాద్ నుండి నైని వరకు కేవలం 6 మైళ్ల (9.6 కి.మీ) దూరాన్ని 13 నిమిషాల్లో పూర్తి చేసింది. దాని వేగం ఎంత నెమ్మదిగా ఉండేదంటే వేగంగా పరుగెత్తే వ్యక్తి కూడా దానిని ఓడించగలడని ప్రజలు సరదాగా అనుకునేవారు. గంటకు 40-45 మైళ్ల వేగంతో ఇది అప్పటి బస్సుల కన్నా నెమ్మదిగా ప్రయాణించేది.

ప్రపంచ రికార్డు
తక్కువ వేగంతో ప్రయాణించినా, ఈ విమానం ఒక గొప్ప లక్ష్యంతో ఎగిరింది. అది ప్రయాణికులను చేరవేయడానికి కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవను ప్రారంభించడానికి ఎగిరింది. ఫ్రెంచ్ పైలట్ హెన్రీ బెకెట్ నడిపిన ఈ విమానం 6,500 ఉత్తరాలతో నిండిన సంచిని మోసుకెళ్లింది. అలహాబాద్ పోలో గ్రౌండ్ నుండి గాలిలోకి లేచిన ఈ విమానం నైని జంక్షన్‌లో సురక్షితంగా దిగి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది భారత విమానయాన చరిత్రకే కాకుండా ప్రపంచ తపాలా సేవలకు కూడా ఒక మైలురాయిగా నిలిచింది.
విమానం వెనుక కథ
1911లో అలహాబాద్‌లో జరుగుతున్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, పవిత్ర కుంభమేళా కోసం బ్రిటిష్, కలోనియల్ ఎయిర్ కంపెనీ ఈ విమానాన్ని ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి పంపింది. ఈ విమానాన్ని సముద్ర మార్గంలో, 100కు పైగా పెట్టెలలో దాని భాగాలను పంపారు. బ్రిటిష్ ఇంజనీర్లు అలహాబాద్‌లో రోజుల తరబడి శ్రమించి ఆ భాగాలను తిరిగి ఒక విమానంగా మార్చారు. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇక విమానం ఎగిరే రోజున దాదాపు లక్ష మంది ప్రజలు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడానికి గుమిగూడారు.
50 హార్స్ పవర్ ఇంజిన్ తో నడిచే ఈ చిన్న విమానం భారత విమానయాన రంగంలో ఒక మహా ప్రస్థానానికి నాంది పలికింది. ఆ హంబర్ బైప్లేన్ చిన్న విమానమే కావచ్చు, దాని ప్రయాణం చిన్నదే కావచ్చు, కానీ అది భారత విమానయాన చరిత్రలో వేసిన తొలి అడుగు.



Click it and Unblock the Notifications