Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Sita Navami 2024 : సీతానవమి తేది, పూజా విధానం.. జానకీ నవమి ప్రాముఖ్యత
హిందువుల్లో శ్రీరామనవమి చాలా పెద్ద పండగ. శ్రీరాముడి జన్మదినంగా, శ్రీసీతారాముడి కళ్యాణ దినంగా, రాముడి పట్టాభిషేకం జరిగిన దినంగా శ్రీరామనవమికి ప్రాధాన్యత ఉన్నది. శ్రీరాముడి జన్మదినం ఉన్నట్టే సీతాదేవి జన్మదినం కూడా ఉంది. దాన్నే మనం సీతానవమిగా జరుపుకుంటాం. వైశాఖ మాసం శుక్ల పక్షంలో సీతా నవమిని జరుపుకుంటాం. అదే రోజు సీతమ్మ జన్మదినంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కూడా అదే రోజు సీత జన్మించిందని అంటారు.
సీతా నవమిని జానకీ నవమి అని కూడా అంటారు. సీతా నవమిని ఎలా జరుపుకుంటారు. సీతమ్మను పూజించడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందుతారు. సీతా నవమి ఏ తేదీన వస్తుంది. సీతా నవమికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మదిన కథ గురించి వివరిస్తారు. ఈ సంవత్సరం సీతానవమిని మే 16న జరుపుకోనున్నాము. జానకీ నవమి 16 మే ఉదయం 6 గంటల 22 నిమిశాల నుంచి 17 మే 8 గంటల 48 నిమిశాల వరకు సాగుతుంది
సీతా నవమి ప్రాముఖ్యత
సీతా నవమికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రముఖ్యత ఉన్నది. శ్రీరామనవమికి ఎంత ప్రముఖ్యత ఉన్నదో సీతానవమికి కూడా అదే ప్రాముఖ్యత ఉన్నాది. ఈ రోజు జానకీరాముడు గుళ్లో, వీధుల్లో ప్రత్యేక పూజలను అందుకుంటారు. ఇలా పూజచేసిన వారికి భూమిని దానం చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. వివాహ జీవితం సంతోషంగా కొనసాగడానికి, శాంతంగా కొనసాగడానికి కూడా సీతానవమి పూజా మంచి అవకాశంగా భావించవచ్చు. కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని ఆ జానకీ మాతను పూజిస్తే తప్పక ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
రామాయణంలో రాముడి జన్మ గురించి ఉన్నట్లే సీతాదేవి జన్మ గురించి కూడా వుంది. సీతమ్మ మిథిలాలో జన్మించింది. పుట్టక ముందు అక్కడ తీవ్రమైన కరువు రావడం వల్ల ప్రజలు పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలిసిన ఓ యోగి, కరువు నుంచి ఎలాగైనా మిథిలాను రక్షించాలని యాగం చేస్తాడు. యాగం తరువాత మిథిలా రాజుకు నాగలితో పొలం దున్నమని చెబుతాడు. యోగి చెప్పనట్లుగా నాగలి తీసి దున్నడం ప్రారంభించగానే రాజుకు చెందిన నాగలి భూమిలో ఇరుక్కుపోతుంది. నాగలిని భూమిలోంచి తీయగానే అక్కడ బంగారు మూటలో ఓ అందమైన పసిపాపను చస్తారు. ఆ పాపను రాజు తన చేతిలోకి ఎత్తుకోగానే అక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటివరకున్న కరువు మొత్తం పోయినట్టు అయింది.
మిథిలారాజు ఆ పాపకు సీత అని నామకరణం చేశాడు. ఇక ఆ పాపను తన కూతురిగా భావించి జాగ్రత్తగా పెంచాడు. ఇదే కథను జానకీనవమి రోజున అంతటా వినిపిస్తారు. కానీ శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినంత ఎక్కువగా సీతానవమి ఉత్సవాలు జరగవు. దీనికి గల కారణాలు పండితులకు తెలియాలి. రామాయణంలో సీతా దవి అనేక కష్టాలు పడింది. కష్టాలు పడిన స్త్రీకి ప్రతీకగా సీతమ్మను చూపిస్తారు. అలాగే అనంతమైన ఓర్పు కలిగిన మాతగా కూడా సీతమ్మను ఉదహరిస్తారు. సీతాదేవికి ఇద్దరు పుత్రులు. వారే లవుడు, కుషుడు.



Click it and Unblock the Notifications