Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా?

ప్రపంచంలో అత్యంత బలమైన లేదా విలువైన కరెన్సీ ఏది? అని ఎవరినైనా అడిగితే, ఏమాత్రం ఆలోచించకుండా చాలామంది చెప్పే మొదటి సమాధానం అమెరికా డాలర్. అంతర్జాతీయ వాణిజ్యం మొదలుకొని, ప్రపంచ దేశాల ఆర్థిక లావాదేవీల వరకు డాలర్‌ దే ఆధిపత్యం.

గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్‌ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కానీ ఎక్సేంజ్ ఆధారంగా లెక్కలు వేస్తే మాత్రం డాలర్ మొదటి స్థానంలో లేదు. కనీసం టాప్ 5లో కూడా లేదు. భారత రూపాయితో పోల్చినప్పుడు ఎంతో బలమైనవిగా భావించే బ్రిటిష్ పౌండ్, యూరోల పరిస్థితి కూడా అంతే.

Which is the Most Expensive Currency in the World It s Not the US Dollar or Euro

మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీ ఏది?

సెప్టెంబర్ 2026 నాటి అంచనాలు, విదేశీ మారకపు రేట్ల ఆధారంగా టాప్-10 కరెన్సీల జాబితాలో అగ్రస్థానం దశాబ్దాలుగా గల్ఫ్ దేశానిదే. అమెరికా డాలర్‌తో సహా ప్రపంచంలోని అన్ని ప్రధాన కరెన్సీలను వెనక్కి నెట్టి కువైట్ దినార్ అత్యధిక యూనిట్ విలువ కలిగిన కరెన్సీగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఒక కువైట్ దినార్ విలువ సుమారు 3.23 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.311.

ఇక రెండవ స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది. దీని విలువ మన రూపాయల్లో సుమారు రూ. 255. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన, ఎక్కువ లావాదేవీలు జరిపే ప్రధాన కరెన్సీ బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ ఈ పోలికలో ఐదో స్థానానికి పరిమితమైంది.

తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే..తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే..

యూరప్‌ లో ఎంతో సురక్షితమైన కరెన్సీగా పేరున్న స్విట్జర్లాండ్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్ సుమారు రూ. 115.43 విలువతో ఏడో స్థానంలో ఉంది. యూరప్ యూనియన్ లోని అనేక దేశాలు ఉపయోగించే అధికారిక కరెన్సీ యూరో విలువ సుమారు రూ. 109.03 తో తొమ్మిదో స్థానంలో ఉంది.

10వ స్థానంలో అమెరికా డాలర్

ప్రపంచాన్ని శాసించే అమెరికా డాలర్ ఈ జాబితాలో 10వ స్థానానికి పరిమితమైంది. సెప్టెంబర్ 2026 చివరి నాటి మార్కెట్ రేట్ల ప్రకారం భారత రూపాయితో పోలిస్తే ఒక డాలర్ విలువ సుమారు రూ.95.91 వద్ద ట్రేడ్ అవుతోంది.

విలువ వేరు.. బలం వేరు

ఒక కరెన్సీకి ఒక యూనిట్ విలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన, ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుందని కాదు. అమెరికా డాలర్‌ తో పోలిస్తే కువైట్ దినార్ విలువ చాలా ఎక్కువ, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావం పరిమితం. ఒక కరెన్సీ బలం లేదా ప్రపంచ ప్రాముఖ్యత అనేది.. అది అంతర్జాతీయ వాణిజ్యం, ఫారెక్స్ లావాదేవీలు, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్‌ లలో ఎంత విస్తృతంగా ఉపయోగించబడుతోంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

Story first published: Tuesday, September 29, 2026, 22:56 [IST]
Desktop Bottom Promotion