Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
శకుంతల ఎవరు? శాకుంతలం సినిమాలో సమంత నటిస్తున్న పాత్ర ఏంటి?
శాకుంతలం సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా రూపొదించారు. శకుంతల ఎవరు, ఆమెకు దుష్యంతునికి మధ్య సంబంధం ఎలా మొదలైంది, భారత దేశాన్ని పాలించిన భరతుడికి శకుంతల మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా భారీ వీఎఫ్‌ఎక్స్‌తో వస్తోంది శాకుంతలం సినిమా. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో శకుంతల పుట్టుక నుండి దుష్యంతుడితో ప్రేమాయణం, తర్వాత ఆయన శకుంతలను మర్చిపోవడం అన్నీ చూపించారు.

(image: instagram/samantharuthprabhuoffl)
శాకుంతలం సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా రూపొదించారు. మహాభారతంలో శకుంతల గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు శకుంతల ఎవరు, ఆమెకు దుష్యంతునికి మధ్య సంబంధం ఎలా మొదలైంది, భారత దేశాన్ని పాలించిన భరతుడికి శకుంతల మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శకుంతల ఎవరు?
(image: instagram/samantharuthprabhuoffl)
విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు మేనకను విశ్వామిత్రుడి వద్దకు పంపుతాడు. మేనక విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేస్తుంది. మేనకతో ప్రేమ పడ్డ విశ్వామిత్రుడు ఆమెతో పాపకు జన్మనిస్తుంది. తర్వాత విశ్వామిత్రుడు తపస్సు కోసం మేనకను, కన్న కూతురిని వదిలేసి వెళ్లిపోతాడు. మేనక తన కూతురిని కణ్వా ఆశ్రమం వద్ద వదిలేస్తుంది.
ఆ పసిపాపకు పక్షులు రక్షణ ఇస్తాయి. పక్షుల రక్షణలో ఉన్న ఆ పసిపాపను చూసిన కణ్వా మహాముని ఆ శిశువును చేరదీసి పక్షుల రక్షణలో ఉంది కాబట్టి శకుంతల అనే పేరు పెడతాడు.

వివాహం:
చంద్రవంశానికి చెందిన రాజు దుష్యంతుడు ఒక రోజు వేట కోసం అడవికి వెళ్తాడు. ఆ అడవిలో అందమైన కణ్వా ఆశ్రమాన్ని చూసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు కణ్వా మహాముని ఆశ్రమంలో ఉండడు. రాజు దుష్యంతుడిని శకుంతల ఆహ్వానిస్తుంది. ఇది కణ్వా ఆశ్రమం అని చెబుతుంది. శకుంతల అందానికి దుష్యంతుడు మైమరిచిపోతాడు. శకుంతలతో ప్రేమలో పడతాడు. ఆ విషయాన్ని శకుంతల చెప్పి వివాహం చేసుకుందామని ప్రతిపాదన పెడతాడు.
దానికి తామిద్దరికి పుట్టిన కుమారుడినే రాజును చేస్తానని మాట ఇస్తే వివాహం చేసుకుందామని శకుంతల అనడంతో దానికి దుష్యంతులు సరేనని గాంధర్వ పద్ధతిలో శకుంతలను వివాహం చేసుకుంటాడు.
తర్వాత కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చి వారి వివాహం గురించి తెలుసుకుని మంచే జరిగిందని చెబుతాడు. వివాహం తర్వాత శకుంతల- దుష్యంతులు ఇష్టభోగాలు అనుభవిస్తారు. తర్వాత దుష్యంతుడు రాజ్యానికి వెళ్లి త్వరలో తిరిగి వస్తానని, చదురంగ బలాలతో వచ్చి రాజ్యానికి వైభవంగా తీసుకువెళ్తానని శకుంతలకు చెప్పి వెళ్తాడు.

శకుంతల మీద శాపం:
కాలం గడుస్తున్నా దుష్యంతుడు శకుంతల వద్దకు తిరిగి రాడు. శకుంతల మాత్రం దుష్యంతుడి ఆలోచనలతోనే కాలం వెల్లదీస్తుంది. ఎప్పట్లాగే ఒకరోజు శకుంతల దుష్యంతుడి ఆలోచనలో నిమగ్నమైన ఉన్న సమయంలో ఆ ఆశ్రమానికి దుర్వాస మహర్షి భిక్షాటనకు వస్తాడు.
భిక్షాటనకు వచ్చిన దుర్వాస మహర్షిని శకుంతల పట్టించుకోదు. కోపోద్రిక్తుడైన దుర్వాస మహర్షి శకుంతలను శపిస్తాడు. ఎవరి గురించి అయితే అంతగా ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి పూర్తిగా మర్చిపోతాడని శపిస్తాడు.
శకుంతల దుర్వాస మహర్షిని వేడుకుంటుంది. తన పరిస్థితిని వివరిస్తుంది. అప్పుడు ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించిన దుర్వాస మహర్షి తన ఇచ్చిన శాపానికి విరుగుడు చెబుతాడు. దుష్యంతుడు ఇచ్చిన ఏదైనా వస్తువును చూపిస్తే అప్పుడు అంతా గుర్తుకు వస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు.
హస్తినాపురానికి శకుంతల:
శకుంతల గర్భం దాల్చిన విషయం గుర్తిస్తుంది. దుష్యంతుడి దగ్గరకు తానే వెళ్దామని హస్తినాపురానికి దుష్యుంతుడి ఇచ్చిన ఉంగరం తీసుకువెళ్తుంది. ఆ ఉంగరం దారిలో నదిలో పడిపోతుంది. హస్తినాపురానికి వెళ్లిన శకుంతలను దుష్యంతుడు గుర్తుపట్టడు. శకుంతలను అనరాని మాటలు అంటాడు. దుష్యంతుడి మాటలకు నొచ్చుకున్న శకుంతల అక్కడి నుండి తిరిగి అడవికి వెళ్తుంది.
అక్కడే భరతుడికి జన్మనిస్తుంది. ఆ పిల్లాడు గొప్ప పోరాట యోధుడు. చిన్నప్పటి నుండే ఎంతో చలాకీగా ఉంటాడు. భయం అనేది లేకుండా పెరుగుతాడు. అడవి మృగాలతో ఆడుకుంటాడు.

దుష్యంతుడికి గతం గుర్తుకురావడం:
దుష్యంతుడికి గతం గుర్తుకురావడం, శకుంతలను, కుమారుడు భరతుడిని కలుసుకోవడం పురాణాల్లో మూడు రకాలుగా వర్ణించారు. అవేంటంటే..
1.
నదిలో పోగొట్టుకున్న ఉంగరం ఒక మత్స్యకారుడికి దొరుకుతుంది. ఆ ఉంగరాన్ని ఆ వ్యక్తి రాజు వద్దకు తీసుకువెళ్తాడు. ఆ ఉంగరాన్ని దుష్యంతుడు చూడటంతో గతం గుర్తుకువస్తుంది. శకుంతలను కలుసుకోవడానికి అడవికి వెళ్తాడు.
అక్కడ మొదట భరతుడిని చూస్తాడు దుష్యంతుడు. ఆ పిల్లాడు ధైర్యసాహసాలు చూసి అబ్బురపడిన దుష్యంతుడు నీ పేరు ఏంటని అడగ్గా.. భరతుడు, రాజు దుష్యంతుడి కుమారుడిని అని సమాధానం ఇస్తాడు. అలా దుష్యంతుడు భరతుడి ద్వారా శకుంతలను కలుసుకుంటారు.
2.
సభలో శకుంతలకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని మేనక.. శకుంతలను తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్తుంది. అక్కడే శకుంతల భరతుడికి జన్మనిస్తుంది. తర్వాత దుష్యంతుడు దేవతలతో మద్దతుతో రాక్షసులపై పోరాడి గెలుస్తాడు. ఆ తర్వాత మేనక దుష్యంతుడికి తను మర్చిపోయిన జ్ఞాపకాలను తిరిగి ఇస్తుంది. తర్వాత శకుంతలను, కుమారుడు భరతుడిని దుష్యంతుడికి అప్పగిస్తుంది మేనక.
3.
కుమారుడు భరతుడితో పాటు హస్తినాపురానికి వచ్చిన శకుంతలను దుష్యంతుడు కావాలనే గుర్తుపట్టనట్లుగా నటిస్తాడు. కావాలనే శకుంతలను అవమానిస్తాడు. అప్పుడు కోపగించుకున్న శకుంతల ఎంతో మనోవేదనతో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడి నుండి వెళ్లిపోవడానికి ఉపక్రమిస్తుంది. శకుంతల అక్కడి నుండి వెళ్లిపోతున్న సమయంలో దుష్యంతుడికి, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకాశవాణి వినిపిస్తుంది. శకుంతలను తన భార్యగా ఒప్పుకోవాలని చెబుతుంది. దాంతో దుష్యంతుడు శకుంతలను భార్యగా స్వీకరిస్తాడు.
తాను కావాలనే అలా నటించాలని, శకుంతల తనకు గుర్తుందని, కానీ ఎవరో స్త్రీని అలా తన భార్యగా అంగీకరిస్తే రాజ్య ప్రజలకు అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతోనే అలా నటించాలని చెబుతాడు దుష్యంతుడు. తర్వాత శకుంతలను భార్యగా స్వీకరిస్తాడు.
తర్వాతి కాలంలో భరతుడు రాజు అవుతాడు. తన రాజ్యపాలన ఎన్నో మన్ననలు అందుకుంది. భరతుడి పేరు మీదుగానే ఈ దేశానికి భారత దేశం అనే పేరు వచ్చింది.



Click it and Unblock the Notifications
