Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
భోగి పళ్లు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకుంటాయి. మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగి అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఈ ఏడాది జనవరి 14న భోగి పండుగను జరుపుకుంటున్నాం.
ఇవాళ ఉదయాన్నే భోగి మంటల సందడి ఒకెత్తయితే సాయంత్రం వేళ ఇంట్లో జరిగే భోగి పళ్ల వేడుక మరో ఎత్తు. ఐదేళ్ల లోపు పిల్లలను అందంగా ముస్తాబు చేసి, వారి తలపై రేగి పండ్లను పోయడం మన అనాది సంప్రదాయం. అసలు ఈ పళ్లను ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

శ్రీమన్నారాయణుడి ప్రతిరూపం - రేగి పండు
భోగి రోజున పోసే పండ్లను భోగి పళ్లు అంటారు కానీ, వాస్తవానికి అవి రేగి పళ్లు. ఈ పండుకు పురాణాల్లో గొప్ప విశిష్టత ఉంది. రేగి పండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. బదరీ ఫలం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని మన పూర్వీకుల నమ్మకం.
ఈ పండు ఎర్రగా, గుండ్రంగా ఉండి సూర్యుడిని పోలి ఉంటుంది. భోగి పండుగ నాటికి సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు, శ్రీమన్నారాయణుడి రక్ష పిల్లలకు ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే వారి తలపై ఈ పండ్లను పోస్తారు.
దిష్టి నివారణకు అద్భుత ఔషధం
పిల్లలకు త్వరగా దిష్టి తగులుతుందని పెద్దలు చెబుతుంటారు. భోగి పళ్ల వేడుకలో రేగి పళ్లతో పాటు చిల్లర నాణేలు, పూల రేకులు, చెరుకు ముక్కలు, అక్షతలు కలుపుతారు.
రేగి పళ్లు తలపై పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి (Negative Energy) తొలగిపోతుందని నమ్మకం.
నాణేలు.లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకూడదని సంకేతం.
పూలు..పిల్లల జీవితం పూలలా సున్నితంగా, అందంగా వికసించాలని ఆశీర్వాదం.
ఇవన్నీ కలిపి తలపై పోసి, హారతి ఇవ్వడం ద్వారా పిల్లలకు ఉన్న సమస్త పీడలు, దిష్టి దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.
ఆరోగ్య రహస్యం
ఈ సంప్రదాయం వెనుక ఒక బలమైన ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది. భోగి పండుగ వచ్చేది చలికాలంలో. ఈ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు రావడం సహజం. రేగి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పిల్లల తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. రేగి పళ్లను తలపై పోసినప్పుడు అవి ఆ భాగాన్ని తాకడం వల్ల అక్కడి నాడులు ఉత్తేజితమవుతాయని తద్వారా పిల్లల జ్ఞానశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
సామాజిక బంధం
ఈ వేడుక కేవలం ఇంటికే పరిమితం కాదు. సాయంత్రం వేళ పేరంటం ఏర్పాటు చేసి, ఇరుగుపొరుగున ఉండే ముత్తైదువలను పిలుస్తారు. అందరూ కలిసి పిల్లలను ఆశీర్వదించడం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి.
పెద్దల ఆశీర్వాదం పిల్లలకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. కాబట్టి భోగి పళ్లు పోయడం అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది పిల్లల ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి పెద్దలు వేసే బలమైన పునాది.



Click it and Unblock the Notifications