Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?
నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశంలో పెట్టే నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం అంతా ఒక వైపైతే నార్త్ కొరియా మరో వైపు. ఆ దేశంలో హేర్ కటింగ్ ఎలా చేసుకోవాలనేదానిపైన కూడా నిబంధన పెట్టారంటే నార్త్‌కొరియా ఎంతటి నియంతృత్వ దేశమో మనము అర్థం చేసుకోవచ్చు. తాజాగా తీసుకొచ్చిన నిబంధన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నార్త్ కొరియాలో ఇప్పుడు ఆడవారు రెడ్ లిప్‌స్టిక్ వేసుకోవడానికి వీలు లేదు.
మనం సాటలైట్లను తయారు చేసి చంద్రమండలంపైకి వెళ్లగలుగుతున్నా, మార్స్ గ్రహంపైన కూడా జీవ ఉనికికి ఆ గ్రహంపై దిగి కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాగానీ పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోవడానికి కూడా స్వేచ్ఛలేని భూమిపై ఉన్నామనే విషయాన్ని మరువవద్దు. నార్త్ కొరియాలో ఇప్పుడు అలాంటి ఓ నిబంధన రావడం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. ఎన్నో ఏళ్ల నుండి నియంత పాలనలో ఉన్న ఆదేశం ఇప్పటికీ తన పద్ధతిని మార్చుకోవడం లేదు.

నార్త్ కొరియాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఉందన్న విషయం తెలిసిందే. అక్కడ పెట్టుబడిదారి విధానాలకు అవకాశం లేదు. అక్కడి ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందే. వేరే మార్గం లేదు. పెట్టుబడిదారులను దెబ్బకొట్టడానికి, పాశ్యాత్య సంస్కృతిని పారదోలాలనే ఉద్దేశ్యంతో నార్త్ కొరియాలోని కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెడ్ లిపస్ట్ మాత్రమే కాదు ఇలాంటి నిబంధనలు ఇంకా ఉన్నాయ్. కిమ్ జాంగ్‌కు కటింగ్‌ను పోలి కూడా కటింగ్ చేసుకోవద్దు. అది వారి అధినాయకుడిని అవమానించినట్టేనని అంటున్నారు.
నార్త్ కొరియాలో ఆశ్చర్యానికి గరిచేసే మరిన్ని విషయాలను తెలుసుకుందాం :
దాదాపు మనందరమూ స్క్విడ్ గేమ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూసే వుంటాము. ఈ నెట్‌ఫ్లిక్స్ నార్త్ కొరియాలో వుండదు. ఫారన్ సినిమాలనే కాదు, విదేశీ సంగీతాన్ని కూడా నార్త్ కొరియా విననివ్వదు, చూడనివ్వదు. ఈ నిబందనలను అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్నెషన్‌ల్ కాల్స్
నార్త్ కొరియా నుంచి ఇతర దేశాలకు చెందిన వారితో ఫోన్‌లో మాట్లాడియా వారికి కఠిన శిక్ష వుంటుంది. 2007లో ఓ పరిశ్రమ యజమాని ఈ నిబంధనలను అతిక్రమిస్తే అతన్ని నార్త్ కొరియా ఉరి తీసింది.
నార్త్ కొరియా అధ్యక్షుడిని గౌరవించని వారికి మరణశిక్షను విధిస్తారు. 2015లో కిమ్ జాంగ్ ముందు నార్త్ కొరియా రక్షణ మంత్రి నిద్రిస్తున్నందుకు వంద మంది ముందు మంత్రిని తుపాకితో కాల్చి చంపేశారు.
తరతరాలకు శిక్ష
నార్త్ కొరియాలో ఏదైనా క్రైమ్ చేస్తే..దానికి శిక్ష వారికి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు, ఇంట్లో తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా విధిస్తారు.
హేయిర్ కట్
ప్రభుత్వం నిర్ణయించిన సూచించిన హేయిర్ కట్‌ను మాత్రమే అక్కడి ప్రజలు చేయించుకోవాలి. లేదంటే ప్రభుత్వం నుంచి శిక్షను ఎదుర్కొనక తప్పదు.
దేశ రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఉండాలన్నా ఖచ్ఛితంగా ప్రభుత్వం అనుమతి కావాల్సిందే. పాఠశాలలో ఉండే బెంచీలకు, కుర్చీలకు పిల్లలే చెల్లించుకోవాలి. నార్త్ కొరియాలో బైబిల్‌ను నిషేధించారు. బైబిల్‌ను పాశ్చాత్య సంసృతిని పెంపొందిస్తుందని వారి నమ్మకం. అందువల్ల బైబిల్‌ను బ్యాన్ చేశారు. బైబిల్‌ను ప్రచారం చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయ్.



Click it and Unblock the Notifications