Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Messi And Red Ribbon: మెస్సీ కాలికి రెడ్ రిబ్బన్.. దాని వెనక ఉన్న కథెంటో తెలుసా?
రెడ్ రిబ్బన్ అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెడుతుందని మెస్సీ బలంగా విశ్వసిస్తాడు. అయితే ఈ రిబ్బన్ మెస్సీ చేతికి ఎలా వచ్చిందనేది ఓ ఆసక్తికరమైన కథ. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2022లో కప్పు గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు లియోనల్ మెస్సీ. ఫ్రాన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో మెస్సీ తనదైన ఆట తీరుతో అర్జెంటీనా జట్టును విజయతీరాలకు చేర్చాడు. కప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్ల సంబరాలు అంతా ఇంతా కాదు. ఈ సంబరాల్లోనే ఓ విషయం అందరికీ తెలిసింది. అదే మెస్సీ ఎడమ కాలికి రెడ్ కలర్ రిబ్బన్ ధరించడం. ఇది మెస్సీకి లక్కీ రిబ్బన్. ఈ రెడ్ రిబ్బన్ అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెడుతుందని మెస్సీ బలంగా విశ్వసిస్తాడు. అయితే ఈ రిబ్బన్ మెస్సీ చేతికి ఎలా వచ్చిందనేది ఓ ఆసక్తికరమైన కథ. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతా ఆ జర్నలిస్టే చేశాడు:
అది 2018.. రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్ జరుగుతోంది. ఈ పోటీల్లో గ్రూప్ దశలో అర్జెంటీనా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుంది. తర్వాత రాబోయే మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒక్క ఓటమి ఎదురైనా అది అర్జెంటీనాను ఇంటికి పంపిస్తుంది. రాబోయే మ్యాచ్ నైజీరియా లాంటి మంచి జట్టుతో కావడంతో అర్జెంటీనా అభిమానుల్లో కలవరం. ఆ సమయంలో అర్జెంటీనా జర్నలిస్ట్ రమ పంటారొట్టో.. మెస్సీని కలిసి ఇంటర్వ్యూ చేశాడు.
అప్పుడే మెస్సీకి జర్నలిస్టు రమ పంటారొట్టో ఓ రిబ్బన్ ఇచ్చాడు. అది తన అమ్మ ఇచ్చిందని చెప్పాడు. ఆమెకు కొడుకుకంటే మెస్సీనే ఎక్కువ ఇష్టమని, ఆమె ఇచ్చిన ఎరుపు రిబ్బన్‌ను అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. కావాలంటే మీకూ ఇస్తానని జర్నలిస్టు రమ అన్నాడు. రెడ్ రిబ్బన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మెస్సీకి అందించాడు జర్నలిస్టు రమ పంటారొట్టో.

మెస్సీ కాలికి రెడ్ రిబ్బన్:
ఆ తర్వాత అర్జెంటీనా రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌లో నైజీరియాతో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాను 2-1 తేడాతో మెస్సీనే గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మరోసారి మెస్సీని కలిసిన జర్నలిస్టు రమ పంటారొట్టో, తన అమ్మ ఇచ్చిన రెడ్ రిబ్బన్ కట్టుకున్నారా అని అడిగాడు. అప్పుడు మెస్సీ తన కాలికి ఉన్న రెడ్ కలర్ రిబ్బన్‌ను ఆ జర్నలిస్టుకు చూపించాడు. నమ్మలేకపోతున్నా. దీన్ని నిజంగా ధరించారా అంటూ మెస్సీని ఆ జర్నలిస్టు అడిగాడు. అమ్మా.. చూడు మెస్సీ ఈ రిబ్బన్ ధరించాడు అంటూ ఆ జర్నలిస్టు ఆనందంతో పొంగిపోయాడు.
ఆ తర్వాత చాలా సార్లు మెస్సీ రెడ్ రిబ్బన్ ధరించి కనిపించాడు. కేవలం మైదానంలోనే కాకుండా మామూలు సమయంలోనూ మెస్సీ రెడ్ రిబ్బన్‌తో కనిపించాడు. ఆ రెడ్ రిబ్బన్ తనకు అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టిందని నమ్ముతున్నాడు మెస్సీ. అలాగే ఫిలిప్ కౌటిన్హో, లాటరో మార్టినెజ్, రోడ్రిగో ది పాల్, పాలో డైబలా సహా ఇతర ఆటగాళ్లకూ మెస్సీ ఈ రిబ్బన్ లాంటిది బహుమతిగా ఇచ్చాడు.
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో షూటౌట్ సమయంలో.. గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కూడా రెడ్ రిబ్బన్‌ను ధరించి కనిపించాడు. కప్ అందుకున్న తర్వాత అర్జెంటీనా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అందరూ కప్‌ను పట్టుకుని ముద్దాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలోనూ మెస్సీ ఎడమ కాలికి రెడ్ రిబ్బన్ కనిపించింది. దీంతో రెడ్ రిబ్బన్ కాస్త వైరల్‌గా మారింది.



Click it and Unblock the Notifications