Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
శృంగారం పడకగదికే ఎందుకు పరిమితం చేయకూడదు?ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై కంగనా రనౌత్ ఆగ్రహం!
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పారిస్ ఒలింపిక్ క్రీడల తొలి ఫ్లోటింగ్ ఓపెనింగ్ వేడుక సెయిన్ నది ఒడ్డున రంరంగ వైభవంగా, అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు దాదాపు ఐదు లక్షల మంది ప్రేక్షకులు, క్రీడాభిమానులు హాజరయ్యారు. కాగా ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుక ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక్కడి భయంకరమైన ప్రవర్తన కారణంగా చాలా మంది క్రీడాభిమానులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ క్వీన్, ఎంపీ కంగనా రనౌత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఒలింపిక్ క్రీడాపోటీల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శించారు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో విపరీతమైన లైంగిక చర్యలు రెచ్చగొట్టేలా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. చిన్నారులను సైతం ఇందుకు వినియోగించుకోవడంపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రాగ్ క్వీన్స్ ది లాస్ట్ సప్పర్‌ను పునరావృతం చేశారంటూ క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీస్తోందని కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి.
పారిస్ ఒలింపిక్స్ నిర్వహకుల తీరుపై నటి కంగనా రనౌత్ విమర్శించారు.
ది లాస్ట్ సప్పర్ యొక్క హైపర్ సెక్సువలైజ్డ్, దైవదూషణ ప్రదర్శనలో మైనర్ ను చేర్చినందుకు పారిస్ ఒలింపిక్స్ పై విమర్శలు చేస్తున్నారు. డ్రాగ్ క్వీన్ ప్రదర్శనలో ఒక చిన్న పిల్లవాడు స్పష్టంగా పాల్గొంటాడు. నీలిరంగులో నగ్నంగా ఉన్న వ్యక్తిని జీసస్‌గా చూపించి క్రైస్తవ సమాజాన్ని కూడా అవమానించారని చాలా మంది ఆరోపిస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌ను వామపక్షాలు పూర్తిగా హైజాక్ చేశాయని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడుతున్నారు.
కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కలకలం
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల నుండి మరొక ఫోటోను పంచుకుంటూ ఈ ఈవెంట్ స్వలింగ సంపర్కంపై ఆధారపడి ఉందని నటి కంగనా రనౌత్ వివరించారు. ఆ పోస్ట్‌లో రనౌత్ ఇలా వివరించింది, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ప్రతిదీ స్వలింగ సంపర్కం గురించి హైలెట్ చేసినట్లు ఉందని ఆమె ఆరోపించారు. స్వలింగ సంపర్కానికి నేను వ్యతిరేకం కాదు కానీ, ఈ ఒలింపిక్స్‌కి సెక్స్‌కి సంబంధం ఏమిటి?, క్రీడలు, ఒలింపిక్స్ పోటీలలో లింగవివక్షను ఎందుకు తీసుకువస్తారు? శృంగారం పడకగదికే ఎందుకు పరిమితం కాకూడదు ? అంటూ బాలీవుడ్ నటి అనేక ప్రశ్నలతో పారిస్ ఒలింపిక్స్ నిర్వహకుల తీరుపై విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలో కూడా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఒలింపిక్స్ ఈవెంట్‌పై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. లాస్ట్ సప్పర్‌ని డ్రాగ్ క్వీన్స్‌తో చిత్రీకరించడంలో పిల్లలను ఉపయోగించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రైస్తవ సమాజాన్ని అవమానించడమేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో క్రైస్తవ సమాజానికి గౌరవం లేదని కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించారు.



Click it and Unblock the Notifications