Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
నోరులేని మూగజీవిపై ఒక మహిళ చూపించిన కర్కశత్వం నెటిజన్లను కలచివేస్తోంది. నేపాల్ లోని బజాంగ్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి, తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. విశ్వాసానికి మారుపేరైన కుక్కని అత్యంత నిర్దాక్షిణ్యంగా నదిలోకి విసిరేసిన ఈ ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది.
అసలేం జరిగిందంటే..
నేపాల్ దేశంలోని బజాంగ్ జిల్లాలోని జయపృథ్వీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాంకోట్ వంతెనపై ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ బతికున్న కుక్కను ఎంతో క్రూరంగా వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న సెటీ నదిలోకి విసిరేసింది.

ఈ సమయంలో ఆమెతో ఉన్నవారు దాన్ని అడ్డుకునే కనీస ప్రయత్నం చేయకపోగా, చేతిలో ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడం సమాజం వెళుతున్న తీరుకు అద్దం పడుతోంది. ఈ వీడియోను స్థానికుడు నబిన్ పాండే బుధవారం తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఘటన సెప్టెంబర్ 2న జరిగింది. తన వ్యక్తిగత పనుల వల్ల వీడియోను ఆలస్యంగా అప్ లోడ్ చేసినట్లు పాండే తెలిపారు.

కళ్లెదుటే ఘోరం.. కానీ ఆపలేకపోయా!
తాను స్వయంగా పశువైద్య శాస్త్రం చదివానని, చిన్నప్పటి నుంచి కుక్కలను పెంచుతున్నానని నబిన్ పాండే తెలిపారు. ఆ మహిళ కుక్కను నదిలోకి విసిరేయబోతుండగా నేను అడ్డుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నా మాట వినలేదు. ఆ కుక్క ఎవరినో కరిచిందని, అందుకే ఇలా చేస్తున్నానని ఆమె చెప్పింది. కానీ ఆ కుక్క ప్రవర్తన చాలా ప్రశాంతంగా ఉంది. నాకున్న అనుభవంతో చెబుతున్నాను.. ఆ కుక్క ఎవరినీ కరిచేలా లేదు. దీని వెనుక వేరే ఏదో కారణం ఉండి ఉంటుంది అని పాండే తన ఆవేదన వ్యక్తం చేశారు.
వంతెన పైనుంచి పడిన ఆ శునకం, నదిలోని నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిందని, అది బతికి ఉందో లేదో తెలియదని ఆయన ఆవేదన చెందారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బజాంగ్ జిల్లా పోలీసు కార్యాలయ సమాచార అధికారి దీపక్ బిస్తా స్పందించారు. పోలీసు బృందం వెంటనే దర్యాప్తు ప్రారంభించి, వంతెన పరిసర ప్రాంతాలను పరిశీలించిందని తెలిపారు.
అయితే కుక్క ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. వీడియో ఆధారంగా ఆ క్రూరమైన చర్యకు పాల్పడిన మహిళను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications
