Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక ఇద్దరు మహిళలు..వీరి దెబ్బకు ప్యాంట్లు తడుపుకుంటున్న పాక్!
జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో ఏప్రిల్ నెలలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్,పీఓకే లోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో నిషేధిత జైషే మొహమ్మద్,లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఈ ఆపరేషన్ చేపట్టగా..దీనికి సంబంధించిన వివరాలను బధువారం ఉదయం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సంయుక్తంగా మీడియాకు వివరించారు. దీంతో వీరిద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ మీడియా బ్రీఫింగ్ కు నాయకత్వం వహించిన వీరిద్దరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యోమికా సింగ్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAS)చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎక్స్ పీరియన్స్డ్ హెలికాప్టర్ పైలట్, 2,500 గంటలకు పైగా విమాన అనుభవం కలిగి ఉన్నారు. వ్యోమికా..చెతక్, చీతా వంటి హెలికాప్టర్ లను జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా అత్యంత కష్టతరమైన భూభాగాలలో నడిపారు. ఆమె అనేక కీలకమైన రక్షణ కార్యకలాపాలలో పాల్గొన్నారు. 2020 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆమె ఒక ముఖ్యమైన రక్షణ బృందానికి నాయకత్వం వహించారు. ఈ కార్యకలాపాలు ఎత్తైన ప్రదేశాలలో, కష్టతరమైన వాతావరణంలో, వైమానిక సహాయం ప్రాణాలను రక్షించడానికి కీలకమైన మారుమూల ప్రాంతాలలో నిర్వహించబడ్డాయి. ఆమె పాఠశాల రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని కలలు కన్నారు.

6వ తరగతి సమయంలోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరారు. డిసెంబర్ 18, 2019న ఆమె IAF ఫ్లయింగ్ బ్రాంచ్‌లో హెలికాప్టర్ పైలట్‌గా శాశ్వత కమిషన్ పొందారు. 2021లో వ్యోమికా సింగ్.. 21,650 అడుగుల ఎత్తైన మౌంట్ మణిరాంగ్‌కు జరిగిన త్రివిధ దళాల మహిళా పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. ఈ ప్రయత్నాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ తో సహా సీనియర్ రక్షణ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ మీడియా బ్రీఫింగ్‌లో ఆమె పాల్గొనడం భారత రక్షణ దళాలలో మహిళల పెరుగుతున్న ప్రాముఖ్యతను, నాయకత్వ పాత్రలను ప్రతిబింబిస్తుంది.
సోఫియా ఖురేషి
గుజరాత్ రాష్ట్రానికి చెందిన సోఫియా ఖురేషి బయోకెమిస్ట్రీలో పోస్గ్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఈమెది సైనిక కుటుంబం. ఈమె తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు..ఈమె భరత మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి. 199లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సైన్యంలో చేరారు సోఫియా ఖురేషి. 2016లో ఒక మల్టీ సైనిక వ్యాయామంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో 18 దేశాలు పాల్గొనగా.. ఆమె ఒక్కరే మహిళా కమాండర్ గా నిలిచారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో (PKO) ఆరు సంవత్సరాలు పనిచేశారు, ఆమె కాల్పుల విరమణను పర్యవేక్షించడం, సంఘర్షణ ప్రాంతాల్లో మానవతా సహాయాన్ని అందించడంలో పాల్గొన్నారు. సోఫియాకు కౌంటర్ ఇన్సర్జెన్సీ జోన్‌లలో పనిచేసిన అనుభవం ఉంది. ఆపరేషన్ పరాక్రమ్ లో ఆమె చేసిన కృషికి గాను కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలలో కమ్యూనికేషన్‌ను నిర్వహించినందుకు కూడా ఆమె ప్రశంసలు పొందారు. ఆపరేషన్ సింధూర్ మీడియా బ్రీఫింగ్‌లో ఆమె పాల్గొనడం భారత సైన్యంలో మహిళల యొక్క ముఖ్యమైన పాత్రను తెలియజేస్తుంది.



Click it and Unblock the Notifications
