Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
World Earth Day 2025: వరల్డ్ ఎర్త్ డే ఎందుకు జరుపుకుంటారు? ఈరోజున ఏం చేయాలి?
వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటారు. భూమి సంరక్షణకు, భూమిని భావి తరాలకు సురక్షితంగా అందించడమే ఈ వరల్డ్ ఎర్త్ డే లక్ష్యం. ఈ వరల్డ్ ఎర్త్ డే రోజున పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవాళికి అవగాహనను కల్పించడమే. భూమిని ఎలా సంరక్షించాలి, భావి తరాలకు కాలుష్యం లేకుండా భూమిని ఎలా అప్పగించాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ స్టోరీలో అసలు ఎర్త్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని అవసరం ఎంత వరకు ఉంటుంది అనేది తెలుసుకుందాం.
ఎర్త్ డే అవసరం ఎందుకు?
భూమి మనకు నీరు, ఆహారం, గాలి, జీవనావశ్యక వనరులు అందించే అమ్మలాంటిది. కానీ మనిషి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రకృతిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాడు. అందులో భాగంగానే వృక్షావరణ నాశనం, ప్లాస్టిక్ వినియోగం, వాయు కాలుష్యం, నీటి మలినత వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎర్త్ డే మానవాళికి ఒక జాగృతిగా నిలుస్తుంది.

వరల్డ్ ఎర్త్ డే 2025 - థీమ్ ఏమిటి?
EARTHDAY.ORG ప్రతీ ఏడాది ఒక ముఖ్య థీమ్‌ను ప్రకటిస్తుంది.
2025 కోసం థీమ్: "Planet vs. Plastics" (భూమి Vs ప్లాస్టిక్).
ఈ థీమ్ ద్వారా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తున్నారు. దీని లక్ష్యం ఏంటంటే 2040 నాటికి గ్లోబల్ ప్లాస్టిక్ ఉత్పత్తిని కనీసం 60% తగ్గించటమే.
ఎర్త్ డే చరిత్ర ఏంటంటే..
ఎర్త్ డే చరిత్ర తెలుసుకోవాలంటే.. ఈ రోజు ఆవిర్భవించిన 1970కి వెనక్కు వెళ్లాలి. అమెరికా సెనేటర్ గేలోర్డ్ నెల్సన్ మరియు యువ పర్యావరణ కార్యకర్త డెనిస్ హేస్ కలిసి మొదటిసారి ఈ ఆలోచనను ప్రజల్లోకి తీసుకొచ్చారు. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో మార్పు తెచ్చేందుకు 1970 ఏప్రిల్ 22న మొదటి ఎర్త్ డే జరిగింది. దాదాపు 20 మిలియన్ల మంది అమెరికన్లు భాగస్వాములయ్యారు. ఇప్పటికీ ఇది ప్రజలతో ముడిపడి ఉన్న అత్యంత పెద్ద పర్యావరణ ఉద్యమంగా కొనసాగుతోంది. 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా ఈ ఉద్యమం విస్తరించింది.
ఎర్త్ డే రోజున మనం చేయాల్సిన పని ఏమిటి?
ఇది ఒక్క రోజు వేడుక కాదు - జీవనశైలిలో మార్పు ప్రారంభించాల్సిన రోజు.
సులభంగా ప్రారంభించగల కొన్ని చర్యలు:
ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి - ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ బ్యాగులు వాడండి.
చెట్లు నాటండి - ఒక్క చెట్టు వేయడం కూడా భవిష్యత్తుకు గొప్ప పెట్టుబడిగా మారుతుంది.
విద్యుత్ వినియోగాన్ని తగ్గించండి - అవసరం లేనిప్పుడు లైట్లు, పరికరాలు ఆఫ్ చేయండి.
నీటి వృథా తగ్గించండి - ఇంట్లో నీటి లీకేజీలను సరి చూసుకోండి.
వేగంగా క్షీణిస్తున్న జీవవైవిధ్యాన్ని పరిరక్షించండి - వన్యప్రాణులు, పక్షుల నివాస ప్రదేశాలను కాపాడండి.
గణాంకాలు మీకు తెలుసా?
ప్రతి ఏడాది సుమారు 18 మిలియన్ ఎకరాల అటవీ భూములు నాశనమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌లో 90% పైగా రీసైకిల్ చేయడం జరగదు.
సముద్రాల్లోని మత్స్య జీవులు రోజుకోసారి మానవుల పడేసిన ప్లాస్టిక్‌ను తినాల్సి వస్తోంది.
మన భూమి.. మన బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ప్రభుత్వాలు లేదా సంస్థలు చేయాల్సిన పని కాదు. ప్రతి ఒక్కరి జీవనశైలిలో చిన్న మార్పులతో భూమికి పెద్ద మార్పులు తేవచ్చు.
ఈ ఎర్త్ డే 2025 నాడు, మీ కుటుంబంతో కలిసి ఒక చెట్టు నాటండి, ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొనండి, లేదా ఇంట్లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను పాటించండి.
ప్రపంచాన్ని మార్చాలంటే, మన నుండి ప్రారంభం కావాలి!
"భూమిని ప్రేమించండి - మన తర్వాతి తరం కూడా ఇక్కడే జీవించే విధంగా భూమిని అందించండి"



Click it and Unblock the Notifications