Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Year Ender 2024: 2024లో భారత్ లో ఆన్ లైన్ లో ఎక్కువగా ఆర్డర్ చేసిన టాప్ 10 వెజ్ వంటకాలివే
2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నాం. ఈ ఏడాదంతా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకి ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడిచింది. దీంతో కొత్త ఏడాదిలో అయినా తమకు ప్రశాంతం దొరుకుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాది 2025ని స్వాగతించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు గడిచిన ఏడాదిలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకోడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు.
2024లో భారతదేశంలో ఆన్ లైన్ లో ఎక్కువగా ఆర్డర్ చేయబడిన వెజ్ ఫుడ్స్ ఏంటో తెలుసా?. 2024లో భారతీయలు ఆన్ లైన్ లో ఎక్కువగా ఆర్డర్ చేసిన టాప్ 10 వెజ్ ఫుడ్స్ లిస్ట్ ఇక్కడ చూడండి. ఇందులొ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినేవి కూడా కొన్ని ఉన్నాయి.

2024లో భారత్ లో ఆన్ లైన్ లో ఎక్కువగా ఆర్డర్ చేసిన టాప్ 10 వెజ్ వంటకాలు
మసాలా దోస
2024లో మనదేశంలో ఆన్ లైన్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసిన వెజ్ వంటకాల్లో మసాలా దోస నెం.1 స్థానంలో ఉంది. మసాలా దోస భారతదేశం అంతటా అమ్ముడవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉదయాన్నే,సాయంత్రం పూట ఎక్కువగా తినే ఫుడ్ ఇది. మైసూర్ మసాల దోసెకు తనదైన ప్రత్యేకత ఉంది. బంగాళాదుంప మసాలా వేసి నెయ్యితో పెనంపై కాల్చే మసాలా దోస లక్షలమంది ఫేవరెట్ ఫుడ్.
పన్నీర్ బటర్ మసాలా
పన్నీర్.. పాల ఉత్పత్తి. భారతదేశంలోని శాఖాహారులు దీనిని ఎక్కువగా ఆహారంలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పన్నీర్ బటర్ మసాలా. చపాతీ,పరోటా,రేైస్ అన్ని రకాల ఆహారాలకు ఇది సైడ్ గా ఉపయోగపడుతుంది.
దాల్ ఖిచ్డీ
పప్పుతో చేసిన దాల్ ఖిచ్డీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా పరిగణించబడుతుంది. అన్నం, ఇడ్లీ, దోస చపాతీ ఇలా దేనితోనైనా ఏ పూట అయినా తీసుకోవచ్చు.
పన్నీర్ బిర్యానీ
సాధారణంగా శాకాహారులు మటన్,చికెన్ మొదలైన వాటికి బదులుగా పన్నీర్ ని ఇష్టపడతారు. పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా, పన్నీర్ బిర్యానీ కూడా శాఖాహారులకు ప్రసిద్ధి. పనీర్ బిర్యానీ స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన నాల్గవ వంటకం.
మార్గరీటా పిజ్జా
ఐదవ స్థానంలో మార్గరీటా పిజ్జా ఉంది. పిజ్జా అసలు పుట్టింది ఇటలీలో అయినప్పటికీ భారతీయులు కూడా దీన్ని ఎక్కువగా తింటుంటారు. భారతీయులలో శాఖాహారులు ఎక్కువ మార్గెరిటా పిజ్జాను ఆర్డర్ చేశారు.
ఇవి కూడా
భారతదేశంలో 2024 లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వెజ్ ఫుడ్స్ లిస్ట్ లో ఇడ్లీ ఏడవ స్థానంలో ఉంది. ఆ తర్వాత మేదు వడ, పొంగల్ ఉన్నాయి.ఈ మూడు సౌతిండియాకి చెందిన ప్రధాన ఆహార పదార్థాలు కావడం గమనార్హం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇష్టపడే సమోసా టాప్ 10 లిస్ట్ లో పదవ స్థానంలో ఉంది.



Click it and Unblock the Notifications