Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
Year Ender 2024: మనోళ్లు పెద్ద ఆటగాళ్లే..బిర్యానీతో పోటీ పడ్డ కండోమ్స్
కొత్త ఏడాది 2025లోకి అడుగుపెట్టడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ పార్టీ చేసుకుందామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఒక్కసారి 2024లోకి తొంగిచూస్తే ఈ ఏడాదంతా ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ మార్పులు,చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు 2024లో చోటు చేసుకున్నాయి.
ఒక్కముక్కలో చెప్పాలంటే ఎటు చూసిన రక్తపాతం,హింసనే ఉంది ఈ ఏడాదంతా. దేశాల మధ్య యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతర్యుద్ధాలు ఈ ఏడాది ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే మనదేశంలో మాత్రం ఇలాంటి యుద్ధాలు లేకుండా ప్రశాంత వాతావరణమే ఉంది. అయితే ఏడాది ముగింపు సమయంలో చాలామందికి ఇయర్ రివైండ్ చేసుకునే అలవాటు ఉంటుంది. అంటే ఈ ఏడాది అంతా ఎలా గడిచింది అని నెమరువేసుకోవడం అన్నమాట. మనదేశంలో 2024లో ఏం జరిగిందనే వివరాలకు సంబంధించిన అనేక రిపోర్ట్స్ ని గూగుల్ కూడా రిలీజ్ చేస్తుంది.

ఆన్ లైన్ లోనే అంతా
2024లో యూత్ కూడా రెచ్చిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఆన్‌లైన్ లో కండోమ్స్ అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. తినే ఫుడ్ దగ్గర నుంచి ధరించే బట్టల వరకు అన్నీ ఆన్ లైన్ లోనే అమ్మేస్తున్నారు. ప్రజలకు కూడా షాపులకు వెళ్లి కొనే టైం లేక ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. 10 రూపాయిల వస్తువు దగ్గర నుంచి లక్షల్లో విలువ చేసే వస్తువు వరకూ ప్రతిది కూడా ఆన్ లైన్ లో దొరుకుతుండటంతో అందరూ దీనిపై వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఆర్డర్ చేసిన వస్తువు నచ్చకపోతే రిటర్న్ చేసే అవకాశం కూడా ఉండటంతో ఆన్‌లైన్ షాపింగ్‌కే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ స్విగ్గీ తమ ఆన్ లైన్ షాపింగ్ వివరాలను బయటపెట్టింది.
భారీగా కండోమ్ ల కొనుగోలు
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 2024 పేరిట విడుదల చేసిన రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగర వాసులు గడచిన సంవత్సరంలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్లను ఆర్డర్ చేసుకున్నారు. కండోమ్స్ తర్వాత ఉల్లిపాయి,అరటి పండు , చిప్స్ ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ తెలిపింది. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంలో స్విగ్గీలో రూ. 31 కోట్లు కేవలం ఐస్ క్రీమ్ తినడానికి ఖర్చు చేయగా, 15 కోట్ల రూపాయలు మహిళలు బ్యూటీ ప్రొడక్ట్స్ కు ఖర్చు చేసినట్లు స్విగ్గీ తన రిపోర్ట్ లో చెప్పింది.
దేశవ్యాప్తంగా స్విగ్గి ప్రతి 140 ఆర్డర్ లలో 1 సెక్స్ వెల్‌నెస్ ప్రోడక్ట్ ఉందని..2024లో స్విగ్గీలో కండోమ్‌లపై అత్యధికంగా ఖర్చు చేసింది బెంగళూరు ప్రజలేనని రిపోర్ట్ లో తెలిపింది.



Click it and Unblock the Notifications