Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
వాహ్ తాజ్ యాడ్ ఫేమస్..తబలా మాస్ట్రో జకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రముఖ తబలా వాయిద్య కారుడు జకీర్ హుస్సేన్(zakir hussain) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ ని(73) ఆరోగ్యం విషమించడంతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఓ హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. వారం రోజులుగా హాస్పిటల్ లోని ఐసీయూలో ట్రీమెంట్ పొందుతున్న జకీర్ హుస్సేన్ ఆదివారం ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కుటుంబసభ్యులు కన్ఫర్మ్ చేశారు.
ఫేమస్ యాడ్ లో
ఒకప్పుడు టీవీలో ఎక్కువగా వచ్చే తాజ్ టీ యాడ్(Taj Tea add) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ యాడ్ కి ఒకతను తబలా వాయిస్తూ ప్రాణం పోసినట్టుగా అనిపించిన అనుభూతులు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండి ఉంటాయి. ఆ ప్రముఖ తబలా విద్వాంసులే జాకీర్ హుస్సేన్. ఆ యాడ్ తో దేశ వ్యాప్తంగా తను మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన మృదువైన తబలా వాయిద్యం, అపూర్వమైన సంగీత మేళాన్ని సంగీతప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరు.

ప్రముఖ తబలా వాయిద్యా కారుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడే జకీర్ హుస్సేన్. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన జకీర్ హుస్సేన్..తబలా వాయిద్యంలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, జాజ్ ఫ్యూజన్‌లలో నైపుణ్యం కలిగిన జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. తబలా మ్యాస్ట్రోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అవార్డులు
అనేక అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసి తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత జీవితం గడిపిన జాకీర్ హుస్సేన్..పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1988లో పద్మ శ్రీ, 2002లో పద్మ భూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. సంగీత నాటక్ అకాడమీ అవార్డుతోపాటు రెండు సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఫ్యామిలీ
కథక్ నృత్యకారణి, తన మేనేజర్ అంటోనియా మిన్నెకొలాను పెళ్లి చేసుకున్న జకీర్ హుస్సేన్ కి.. అనిషా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. యూసీఎల్ఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిషా ఒక సినిమా నిర్మాతగా ఉన్నారు. మాన్ హట్టన్ లోని ఇసాబెల్లా నృత్యవిద్య అభ్యసించారు.



Click it and Unblock the Notifications