'నాగార్జునతో రొమాన్సా? ఆయనతో అలాంటి సీన్లంటే ఫుల్ టెంప్టింగే'

By Rajesh Karampoori

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్‌ కింగ్.. రొమాన్స్‌కు మరో పేరు. ఆరు పదుల వయసులోనూ యంగ్‌ హీరోలకు సవాల్‌గా నిలుస్తూ, తన స్టైల్‌, ఫిట్‌నెస్‌, ఆకర్షణతో ఇప్పటికీ "మన్మథుడు"గా అభిమానుల గుండెల్లో రాజ్యమేలుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కెమెరా ముందే తన మాయాజాలం చూపిస్తున్న నాగార్జున, ప్రతి జనరేషన్‌ ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. యువ నటుల్లోనే కాదు, సీనియర్‌ నటీమణుల్లో నాగ్‌ చార్మ్‌ ఇప్పటికీ తగ్గలేదు. తాజాగా అలనాటి ఓ సీనియర్‌ హీరోయిన్‌ కూడా ఈ మన్మథుడితో రొమాన్స్‌ చేయడానికి సిద్ధమంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? నాగ్ అంటే ఎందుకంత పిచ్చి? అనే వివరాల్లోకెళ్తే...

నాగార్జున కేవలం రొమాంటిక్‌ హీరో మాత్రమే కాదు.. తన కెరీర్‌లో యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌ సినిమాలతోనూ వైవిధ్యాన్ని చూపించారు. అయినా ఆయన రొమాంటిక్‌ అటిట్యూడ్‌, చార్మింగ్‌ పర్సనాలిటీ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ప్రతి సినిమా తర్వాత కూడా ఆయన వయసు తగ్గినట్లే కనిపిస్తుండటంతో అభిమానులు "నాగ్‌కి యాంటీ ఏజింగ్‌ సీక్రెట్‌ ఏమిటి?"అంటూ ఆశ్చర్యపడుతున్నారు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసున్న కింగ్ నాగ్ తన 100 సినిమాతో ముందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


Actress Kasthuri Shankar Ready to Romance Nagarjuna Shares Teenage Crush Memories

ఇదిలాఉంటే.. తాజాగా నాగార్జునతో రొమాన్స్ చేయడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పిన నటి ఎవరో కాదు.. అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్‌.. ఆ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్‌ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ వర్ష హోస్టింగ్ గా వ్యవహరిస్తున్న "కిస్సిక్ టాక్స్" లో కస్తూరి శంకర్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ షోలో కస్తూరి తన సినిమా అనుభవాలు, కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ క్రమంలో హీరో నాగార్జునపై స్టేట్‌మెంట్‌ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

51 ఏళ్ల వయసులోనూ ఘాటు కోరిక.. ఆ హీరోతో అలా చేయాలని ఉందన్న కస్తూరి!

ఇంటర్వ్యూలో యాంకర్ వర్ష హీరోయిన్ కస్తూరిని "నాగార్జున గారంటే మీకు ఎందుకంత అభిమానం?"అని అడగగా, కస్తూరి తన టీనేజ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన మాటల్లో ఆ ప్రేమ, అభిమానమే కాదు - నాగ్‌ మ్యాజిక్‌ అర్థమవుతుంది. "నేను చదువుకునే రోజుల నుంచే నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే ఒకసారి ఆయనను కలిశాను. అప్పట్లో ఆయన వేసుకున్న షర్ట్‌ కలర్‌, లుక్‌ ఇవన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆయనతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నాను. ఆ టచ్‌ చేసిన చేయి రెండు రోజులు కడగకుండా అలానే తిరిగాను. నా ఫ్రెండ్స్‌, రిలేషన్స్‌ అందరికీ చూపించాను. 'ఇది నాగార్జున టచ్ చేసిన చేయి' అని! అప్పట్లో ఉన్న ఆ టీనేజ్ ఎక్సైట్మెంట్ ఇప్పటికీ అలాగే ఉంది," అని నవ్వుతూ కస్తూరి చెప్పారు.

దీపిక వివాదంపై స్పందించిన రష్మిక.. ఫ్యామిలీ లైఫ్ కూడా ముఖ్యమే అంటూ..

ఆమె మాటల్లో ఉన్న భావోద్వేగం విన్న యాంకర్ వర్ష కూడా ఆశ్చర్యపోయింది. అంతటితో వర్ష ఆగకుండా "ఇప్పుడు నాగార్జున గారిని చివరిసారి ఎప్పుడు కలిశారు?" అని అడగగా కస్తూరి నవ్వుతూ "చాలా రోజులు అయ్యాయి. చాలా గ్యాప్ వచ్చింది. ఓసారి వెళ్లి కలవాలి అనిపిస్తోంది. ఏదైనా సాకుతో వెళ్లి కలవాలి కదా..." అని ఫన్నీ కామెంట్ చేసింది. ఇక నాగార్జున ప్రస్తుతం మరింత క్రేజీగా మారిపోయారని, తన తరానికి మాత్రమే కాదు, ఈ తరం యువతకూ ఆయన హీరోగా కాకుండా 'క్రష్‌'గా మారిపోయారని కూడా కస్తూరి తెలిపారు. "మా జనరేషన్‌లో నాగార్జున అంటే అందరికీ హీరో, క్రష్‌. కానీ ఇప్పుడు ఆయన నటిస్తున్న నెగటివ్ రోల్స్‌, మిస్టీరియస్ క్యారెక్టర్స్ చూసి నేటి యూత్ కూడా ఆయనపై ఫిదా అవుతున్నారు. ఆయన ఏ వయసులోనైనా యంగ్‌గా కనిపిస్తారు. ఆ లుక్స్‌, చార్మ్‌ ఎప్పటికీ తగ్గవు," అంటూ కస్తూరి ప్రశంసలు కురిపించారు.

Bahubali 3: బాహుబలి 3పై బిగ్ అప్డేట్.. రాజమౌళి ఫ్లాన్ వేరే లెవెల్‌‌..!

అంతలోనే యాంకర్ వర్ష మరో ఆసక్తికరమైన ప్రశ్న వేసింది "ఇప్పుడు నాగార్జున గారితో ఒక సినిమాలో నటించే ఛాన్స్ వస్తే, ముఖ్యంగా రొమాంటిక్ సీన్ చేయమంటే చేస్తారా?" అడగగా.. వెంటనే కస్తూరి స్పందిస్తూ "మీరు ఇలా అడిగి నన్ను టెంప్ట్ చేయకండి. అలాంటి ఆఫర్ వస్తే వదులుకుంటారా? అది ఒక బెస్ట్ థింగ్‌. నాగార్జున చాలా ప్రొఫెషనల్‌, జెంటిల్మెన్‌. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌కైనా కంఫర్ట్. ఏదైనా చాలెంజింగ్ సీన్ చేయాలంటే ఆయన నుండి ఎంకరేజ్మెంట్ తప్పకుండా వస్తుంది. అలాంటి కింగ్ నాగార్జున గారితో నటించే అవకాశం వస్తే నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను," అని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అభిమానులు "కస్తూరి గారి అభిమానం నిజంగా హార్ట్ టచింగ్‌", "నాగ్‌ మ్యాజిక్‌ ఎప్పటికీ తగ్గదు", "అందుకే ఆయన కింగ్‌!" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Credit: Filmibeat

Desktop Bottom Promotion