‘ఆ హీరో నన్ను లొంగదీసుకోవాలని అలా ట్రాప్.. నా శవంతోనే కోరిక తీర్చుకోమన్నా’

By Siva Kodati

సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలిగిపోవాలని.. తరాలు తనను గుర్తుపెట్టుకోవాలని ఎన్నో ఆశలతో వచ్చే అమ్మాయిలను క్యాస్టింగ్ కౌచ్ బలి తీసుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనని కొందరు ఇండస్ట్రీ జనాలు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే కాదు.. స్టార్ హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు తప్పడం లేదు. గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తెరవెనుక దారుణాలు వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక్క మలయాళంలోనే కాదు.. భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమలలోనూ క్యాస్టింగ్ కౌచ్‌కి బలైన నటీమణులు ఎందరో.

బిగ్‌బాస్ ఒక రంకు షో... నాగార్జునవి అలాంటి యవ్వారాలే.. టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌‌పై హీరోయిన్ల వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు ప్రతినిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూలో కళ్లకు కట్టినట్లు చెబుతూనే ఉన్నారు. తమ కెరీర్‌లో తాము ఇలా వేధింపులకు గురయ్యామని, ఇలా తప్పించుకున్నామని, కమిట్‌మెంట్ ఇవ్వనందుకు తమను ఎలా తొక్కేశారో చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ నటి నర్విని దేరి.. కోలీవుడ్ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..


Actress Narvini Dery serious allegations against Ajmal Ameer

అజ్మల్ దుర్మార్గుడు
కాగా.. కొద్దిరోజుల క్రితం తమిళ నటుడు అజ్మల్ అమీర్ ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన నట జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నారని అజ్మల్ ఖండించారు. ఈ వివాదం సద్దుమణుగుతున్న దశలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ నటి, సింగర్ నర్విని దేరి సదరు హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్మల్ అమీర్ దుర్మార్గుడని, ఏడేళ్ల క్రితం చెన్నైలోని ఓ షాపింగ్ మాల్‌లో అతనిని తొలిసారిగా కలిశాను.. అజ్మల్ ఓ నటుడని కూడా నాకు ఫ్రెండ్ చెబితేనే తెలిసింది. తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ కోసం వెతుకుతున్నానని.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాక్ట్ చేయమని అజ్మల్ చెప్పడంతో ఒకరికొకరం ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నామని ఓ రోజున ఆడిషన్‌కి రమ్మని వాట్సాప్‌లో అజ్మల్ మెసేజ్ పెట్టాడని నర్విని తెలిపారు

పీకల్లోతు అప్పుల్లో రాజమౌళి... షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ప్రభాస్

నా చేయి పట్టుకుని లాగాడు
ఆ తెల్లారి తాను ఫారిన్ వెళ్లాల్సి వుంది, దాంతో రాలేనని చెప్పగా.. త్వరగా అయ్యేలా చూస్తానని అజ్మల్ చెప్పాడు. ఎప్పుడైనా ఆడిషన్ ఉందని తెలిస్తే నా వెంట ఎవరో ఒకరు తోడుగా వస్తారు. అయితే ఆ రోజున అజ్మల్ దగ్గరికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. మీరు ఒక్కరే ఉన్నారు.. అందరూ వచ్చిన తర్వాతే వస్తానంటే అజ్మల్ ఒప్పుకోకుండా రూమ్‌లో వెయిట్ చేయమని బలవంతం చేశాడు. నేను భయంతోనే రూమ్‌లో అడుగుపెట్టా.. ఎందుకైనా మంచిదని నేను కనుక 20 నిమిషాల్లోపు మెసేజ్ చేయకపోతే వెంటనే ఫోన్ చేయమని నా ఫ్రెండ్‌కి మెసేజ్ పెట్టాను. భయంతో వాష్‌రూమ్‌కి వెళ్లి బయటికి వచ్చేసరికి అజ్మల్ నా చేయి పట్టుకోవడంతో వెంటనే అతనిని పక్కకి నెట్టేశానని నర్విని చెప్పింది.

'శారీరక సుఖాలు తప్పుకాదు... వాళ్ల కోరికల్ని భరించాల్సిందే’

ఎంతోమంది అమ్మాయిలను వేధించాడు
నేను అందగాడిని.. నా వెనుక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా అంటూ పొగరుగా చెప్పాడు. నేను దాని కోసం రాలేదని చెబుతుండగా బలవంతంగా నన్ను హగ్ చేసుకోవాలని చూశాడు. నన్ను తాకాలంటే నన్ను చంపాకేనని తేల్చేశా. ఇంతలో అజ్మల్‌కి వేరే ఫోన్ రావడంతో ఈ గ్యాప్‌లో నేను క్యాబ్ బుక్ చేసుకున్నా.. నాతో పాటు వచ్చిన వారు కిందే ఉన్నారు, నేను రాకపోతే వాళ్లే పైకి వచ్చేస్తారని అజ్మల్‌ని బెదిరించా. ఇంతలో రూమ్ బాయ్ బెల్ కొట్టడంతో అజ్మల్ తలుపు తీయగా ఇదే అదనుగా అతని నుంచి బయటపడ్డానని తన అనుభవాన్ని నర్విని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కూడా కలుద్దామని అజ్మల్ పదే పదే ఫోన్లు చేసేవాడని, మెసేజ్‌లు పెట్టేవాడని స్క్రీన్ షాట్లను ఆమె మీడియాకు చూపించారు. తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలను అజ్మల్ ఇలాగే వేధించాడని చెప్పడంతో ప్రస్తుతం నర్విని వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై అజ్మల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Credit: Filmibeat

Desktop Bottom Promotion