పెళ్లికి ముందే సహజీవనం చేస్తే తప్పేంటి? మ్యారేజ్‌కు అలాంటి అనుభవం ఉండాల్సిందే..

By Siva Kodati

భారతదేశంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ వ్యవస్థకు, పటిష్టమైన మానవ సంబంధాలకు పెళ్లి పునాది వంటిదని మన పూర్వీకులు తెలిపారు. వారి అడుగుజాడల్లోనే భారతీయులు నడుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేక.. పెళ్లయిన క్షణాల్లోనే విడాకులు తీసుకుంటున్న ఉదంతాలెన్నో. కానీ మనదేశంలో వివాహ వ్యవస్థ బలంగా ఉందంటే మన పెద్దలు వేసిన బలమైన పునాదే కారణం.

Andhra King Taluka First Review: ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ ఫస్ట్ రివ్యూ

పెరుగులున్న సహజీవనాలు
అందుకే ప్రపంచం మొత్తం భారతదేశ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తుంది. అయితే మనదేశంలోనూ కొన్ని పాశ్చాత్య పోకడలు చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. వీటిలో ఒకటి పెళ్లికి ముందే సహజీవనం. భారతీయ సమాజం ఎన్నటికీ దీనికి ఆమోదం తెలపదు.. కానీ ఉద్యోగాలు, చదువులు రకరకాల కారణాలతో యువతీ, యువకులు ఇంటికి దూరంగా ఉండటం, ప్రేమలో పడటం వంటి అంశాలతో పెళ్లికి ముందే ఎన్నో జంటలు కలిసే ఉంటున్నాయి. కానీ పెళ్లి చేసుకోకముందే ఎందరో విడిపోతున్నారు. తాజాగా పెళ్లికి ముందే సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుల్లితెర నటులు ప్రియాంక జైన్ - శివకుమార్. ఈ వివరాల్లోకి వెళితే..


Bigg Boss contestant Priyanka Jain and Shiva Kumar opens up about living together

వెండితెర నుంచి బుల్లితెరకు
ముంబైకి చెందిన ప్రియాంక జైన్ 2015లో తమిళ చిత్రం రంగి తరంగలో నటించారు. ఆ తర్వాత కన్నడంలో గోలిసోడాలో నటించిన ప్రియాంక.. 2018లో చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి తెలుగు చిత్రాల్లోనూ మెరిసింది. ఇంతలో టీవీ ఇండస్ట్రీ నుంచి ప్రియాంకకు అవకాశాలు రావడంతో 2017లో స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగంలో నటించింది. సీరియల్స్‌తో పాటు యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ ప్రియాంక అలరించింది. బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఫైనల్ వరకు చేరుకుంది.

నా కోడళ్ల వల్ల జీవితం మారిపోయింది.. శోభిత, జైనబ్‌లపై అమల కామెంట్స్

శివకుమార్‌తో ప్రేమలో పడ్డ ప్రియాంక
ఇక... శివకుమార్ అనే బుల్లితెర నటుడితో ప్రేమలో పడిన ప్రియాంక అతనితో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. మహా కుంభమేళాలో జంటగా పుణ్యస్నానాలు చేయడం, ఇటీవల వరలక్ష్మీ వ్రతాన్ని జంటగా చేసుకుని షాకిచ్చారు. కానీ పెళ్లి కాకుండానే దంపతుల మాదిరిగా ఇలాంటి పూజలు చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు, సాంప్రదాయవాదులు వీరిపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఐ డోంట్ కేర్ అంటూ తమకు నచ్చినదారిలో నడుస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటున్నారు ప్రియాంక జైన్- శివకుమార్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిని పెళ్లికి ముందే సహజీవనం గురించి యాంకర్ ప్రశ్నించగా.. దానికి వీరు తమదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు.

Bigg Boss 11 Week Elimination: బిగ్‌బాస్ నుంచి ఫైర్ బ్రాండ్ అవుట్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

పెళ్లికి ముందు కలిసుంటే తప్పేంటీ?
రిలేషన్‌లో ఉన్నవారు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఓకే చెప్పే వరకు ఆగాలి అని ప్రియాంక అన్నారు. కానీ అది ముందు ఉండేదేమో... పేరెంట్స్ ఈరోజు సంబంధం చూసి ఇంకో 2 నెలల్లో పెళ్లి చేసేవారు. కానీ ప్రస్తుతం ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నారు. అరెంజ్డ్ మ్యారేజ్‌లలో కూడా ఎంగేజ్‌మెంటో జరిగి ఒక ఐదు, ఆరు నెలలు ఆగి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి ముందు కలుసుకుని, మాట్లాడుకుని, అర్ధం చేసుకుంటున్నారు. చాలామంది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక కూడా పెళ్లి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అండర్‌ స్టాండిగ్ ఉండదు అని శివకుమార్ అన్నారు.

టెన్షన్‌ తగ్గడానికి ఆ వీడియోలు చూస్తా.. ఒపెన్‌‌గా చెప్పేసిన జబర్దస్త్‌ నటుడు..

పెద్దవారికి అందుకే భయం
దాంతో ఎంగేజ్‌మెంట్‌కి, మ్యారేజ్‌కి ఎక్కువ గ్యాప్ ఉంచడం లేదు. ఎక్కడ వీళ్లు మ్యారేజ్ చేసుకోకుండా విడిపోతారని వెంటనే పెళ్లి చేసేస్తున్నారు. మా బంధువుల్లోనే చాలామంది కూడా పెళ్లికి, ఎంగేజ్‌మెంట్‌కి ఎక్కువ గ్యాప్ ఉంచడం లేదు. ఫ్యామిలీలో ఇలాంటి భయాలు ఉన్నాయి అని ప్రియాంక జైన్ - శివకుమార్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వారి కామెంట్స్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Credit: Filmibeat

Desktop Bottom Promotion