బంగారంపై అనేక రహస్యాలను ప్రపంచానికి తెలియకుండా దాచిన చైనా.. ధరలు భారీగా పెరగడం ఖాయం అంటున్న ఆర్థిక నిపుణులు

By Borra Hazarathaiah

డ్రాగన్ కంట్రీ చైనా నిశ్శబ్దంగా US డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా బంగారం నిల్వలను భారీగా పెంచుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. చైనా ప్రకటించిన అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ బంగారం రహస్యంగా కొనుగోలు చేస్తోందని సమాచారం. ఈ రహస్య డిమాండ్ ప్రపంచ బులియన్ ధరలను రికార్డు స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది బహిరంగంగా ప్రకటించిన కొనుగోళ్లు చాలా తక్కువ. ఆగస్టులో 1.9 టన్నులు, జూలైలో 1.9 టన్నులు, జూన్‌లో 2.2 టన్నులు మాత్రమే అని పేర్కొంది. అయితే మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ఈ గణాంకాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అంచనా. ట్రేడ్ డేటాను విశ్లేషించిన సొసైటీ జనరల్ అంచనా ప్రకారం..చైనా ఈ సంవత్సరం 250 టన్నుల వరకూ Gold కొనుగోలు చేసి ఉండవచ్చు. ఇది మొత్తం ప్రపంచ కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లలో మూడో వంతుకంటే ఎక్కువ.


China gold purchases secretive gold buying China gold reserves gold price rally global gold markets record gold prices gold bull run Beijing gold strategy hidden gold accumulation China central bank gold safe-haven assets global market impact currency market shifts gold demand surge unreported gold buying China economic strategy geopolitical tensions bullion markets gold investments commodity rally

చైనా ఎంత Gold కొనుగోలు చేస్తోంది అన్నది ఖచ్చితంగా తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని. చమురులా ఉపగ్రహ చిత్రాలతో ట్రాక్ చేయలేమని విశ్లేషకుడు జెఫ్ క్యూరీ తెలిపారు. అందువల్ల ఇటీవల తయారు చేసిన 400-ఔన్స్ బార్‌లకు సీరియల్ నంబర్లతో వచ్చే ఆర్డర్‌లు, దిగుమతి డేటా వంటి పరోక్ష ఆధారాల ద్వారా మాత్రమే డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. జపాన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ డైరెక్టర్ బ్రూస్ ఇకెమిజు అంచనా ప్రకారం.. చైనా నిజమైన బంగారం రిజర్వులు 5,000 టన్నుల వరకు ఉండవచ్చని అంచనా.. ఇది అధికారిక గణాంకాల కంటే రెండింతలు.

డాలర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనా.. టన్నుల కొద్ది బంగారం దాచిపెట్టుకుని మరీ..

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఇటీవల భారీగా Gold కొనుగోలు చేస్తుండగా, ధరలు ట్రాయ్ ఔన్స్‌కు 4,300 డాలర్లు దాటి రికార్డు స్థాయికి చేరాయి. అయినప్పటికీ IMFకి నివేదించబడే కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం 90 శాతం నివేదించబడగా ఇప్పుడు కేవలం 33 శాతం మాత్రమే బహిరంగంగా ప్రకటిస్తున్నారు.అమెరికాతో రాజకీయ ఉద్రిక్తతలకు గురికాకుండా ఉండటానికి కొన్ని దేశాలు తమ బంగారం కొనుగోళ్లను రహస్యంగా ఉంచాలని చూస్తున్నాయి. బంగారం US డాలర్‌కు యాంటిగా ఉంటుందన్న భావన కారణంగా ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది.

విజయవాడ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

చైనాలో SAFE (స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్), CIC (సావరిన్ వెల్త్ ఫండ్), అలాగే సైన్యం కూడా బంగారం కొనుగోళ్లు చేస్తాయి. వీరు తమ హోల్డింగ్‌లను సకాలంలో ప్రకటించాల్సిన అవసరం లేదు. UK నుండి చైనాకు ఎగుమతయ్యే బంగారం కూడా చైనా అధికారిక కొనుగోళ్లకు ఒక సూచిక. ఈ లెక్కల ప్రకారం ఈ ఏడాది చైనా దాదాపు 250 టన్నులు దిగుమతి చేసుకుని ఉండవచ్చని బులియన్ నిపుణులు భావిస్తున్నారు.

దిగుమతులు, దేశీయ ఉత్పత్తి, రిటైల్ కొనుగోళ్లు, బ్యాంకుల నిల్వల్లోని మార్పులను లెక్కించి, అధికారిక కొనుగోళ్లు అంచనా వేయడం జరుగుతోంది. ప్లీనం రీసెర్చ్ అంచనా ప్రకారం..చైనా 2022లో 1,382 టన్నులు, 2023లో 1,351 టన్నుల బంగారం అధికారికంగా కానీ ప్రకటించకుండా కాని కొనుగోలు చేసి ఉండవచ్చు.. ఇది ప్రకటించిన స్థాయి కంటే 6 రెట్లు ఎక్కువ.చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారు కూడా కావడం వల్ల, తన దేశీయ ఉత్పత్తినే రిజర్వులుగా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, కంబోడియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ బంగారాన్ని చైనాలో నిల్వ చేయడానికి అంగీకరిస్తున్నాయి.

ఏదేమైనా.. క్లుప్తంగా చెప్పుకోవాలంటే బంగారం మార్కెట్‌లో చైనా కొనుగోళ్ల అసలు స్థాయి పూర్తిగా తెలియడం అసాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సీక్రెట్, క్లిష్ట గణాంకాలు, బహుళ ఏజెన్సీల భాగస్వామ్యం.. ఇవన్నీ చైనా బులియన్ మార్కెట్‌ను ప్రపంచానికి అర్థం కాని సమస్యగా మారుస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Desktop Bottom Promotion