Divvala Madhuri: దివ్వెల మాధురి ఎలిమినేషన్.. దిమ్మతిరిగే రెమ్యూనరేషన్‌‌ అందుకున్న ఫైర్‌బ్రాండ్‌..

By Rajesh Karampoori

Divvela Madhuri Remuneration: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) మరోసారి ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి ప్రవేశించి, తన దూకుడు ప్రవర్తనతో అందరి దృష్టినీ ఆకర్షించింది దివ్వెల మాధురి (Divvela Madhuri). అయితే.. ఈ ఫైర్ బ్రాండ్ ఊహించని విధంగా ఎలిమినేట్ అవడం షాక్ కలిగించింది. ఆమె గేమ్ స్టైల్, తనుజాతో ఏర్పడిన బాండింగ్, చివరికి ఆమె ఎలిమినేషన్ వెనుక ఉన్న వ్యూహమేంటీ? ఇంతకీ మాధురి అందుకున్న రెమ్యూనరేషన్ అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ 9 హౌస్‌లోకి అడుగుపెట్టిన రోజు నుంచే దివ్వెల మాధురి "నేను గేమ్ ఆడడానికి వచ్చాను. బాండింగ్స్ కోసం కాదు" అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆమె మాటల తీరు, ఆత్మవిశ్వాసం, గేమ్‌లోని అగ్రెసివ్ అటిట్యూడ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో హౌస్‌మేట్స్ ఆమెను "ఫైర్‌బ్రాండ్" అని పిలవడం మొదలుపెట్టారు. ఎవరితోనైనా నేరుగా మాట్లాడడం, అభిప్రాయం చెప్పడంలో వెనుకాడకపోవడం మాధురి ప్రత్యేకతగా నిలిచింది.


Divvela Madhuri Elimination and Remuneration Bigg Boss Telugu 9 Firebrand s Shocking Exit

బాండింగ్స్ నాకు నచ్చవని స్టేట్మెంట్ ఇచ్చిన దివ్వెల మాధురి తరువాత టాప్ కంటెస్టెంట్ అయిన తనుజ గౌడ్ (Thanuja Gowda)తో స్నేహం పెంచుకోవడం హౌస్‌లోనే కాదు సోషల్ మీడియలోనూ చర్చనీయాంశమైంది. మొదట తానూజ "నాకు బాండింగ్ అవసరం లేదు" అని చెప్పినా, మాధురి ఆమెకు మరింత దగ్గరవుతూ వ్యూహాత్మకంగా ఆడింది. ప్రేక్షకుల దృష్టిలో ఇది ఒక క్లియర్ గేమ్ ప్లాన్‌గా కనిపించింది. తనూజ ప్రజాదరణను ఉపయోగించుకుని నామినేషన్‌లలో నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుందని అందరీ అర్థమైంది.

ఈ వారం ఎలిమినేషన్‌లో మాధురి, గౌరవ్ మధ్య ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది. 'నీ సేవింగ్ పవర్‌ను మాధురిపై వాడాలనుకుంటున్నావా?" అని తనూజను నాగార్జున అడిగినప్పుడు.. "లేదు సార్" అని ఒక్క మాటలో చెప్పింది. ఈ సమాధానం హౌస్‌లోని అందరినీ షాక్‌కు గురి చేసింది. మాధురి, తనూజపై నమ్మకం ఉంచి ఆఖరి వరకూ తనను సేవ్ చేస్తుందనే ఆశ పెట్టుకుంది మధూరి. కానీ, తనూజ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె మాస్టర్ మైండ్ గేమ్ అని నిరూపించింది. తనూజ వ్యూహాత్మకంగా మాధురిని నామినేట్ చేయడం, ఆ తర్వాత సేవింగ్ పవర్ ఉపయోగించకపోవడం ప్రేక్షకులకు మరో పెద్ద ట్విస్ట్‌ను అందించింది. మాధురి ఆశించిన గేమ్ టర్న్ ఇక్కడే విఫలమైంది.

Bigg Boss 9: డిమోన్ పవన్ కి బిగ్ షాక్.. హౌజ్ నుంచి గెంటేసిన నాగార్జున.. రీతూ మాత్రం..

అలాగే.. మొదటి నుంచీ మాధురి తన కామెంట్స్ తో హౌస్ లో హాట్ టాపిక్ అయింది. ప్రధానంగా సంజనా గల్రానీ, రీతూ చౌదరి, రాము, శ్రీజ వంటి కంటెస్టెంట్స్‌తో ఆమె పలు సార్లు వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. తన కఠినమైన మాటలు కంటెస్టెంట్లను బాధపెట్టింది. అయినా, ఆమె తన గేమ్‌ను కచ్చితంగా ఆడింది. "నిజాయితీతో ఆడితేనే గెలవాలి" అనే సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తెచ్చారు. కానీ, తనూజతో ఏర్పడిన భావోద్వేగ బంధం ఆమె గేమ్‌పై ప్రభావం చూపిందని అనిపిస్తోంది.

ఇక మాధురి ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె నిజాయితీకి, ధైర్యానికి మద్దతు ఇస్తుంటే, మరికొందరు ఆమె అగ్రెసివ్ నేచర్ వల్లే ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. కానీ, ఒక విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి బిగ్ బాస్ 9 సీజన్‌లో అత్యంత గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. దివ్వెల మాధురి బిగ్ బాస్ 9లో ఎక్కువ కాలం నిలవకపోయినా, ఆమె ఆటతీరుతో, స్ట్రాటజీ, భావోద్వేగం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. తానూజతో ఏర్పడిన బంధం, చివరికి అదే చేతిలో ఓడిపోవడం ఈ సీజన్‌లోనే కాకుండా మొత్తం బిగ్ బాస్ తెలుగుచరిత్రలో చిరస్మరనీయమైన మలుపు అని చెప్పాలి.

రాజమౌళిపై మహేష్ బాబు ఫైర్..ఆ స్టోరీ లీక్ చేస్తానంటున్న ప్రియాంక..

దిమ్మతిరిగే రెమ్యూనరేషన్!
మాధురి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి రూ. 3 లక్షలు వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం. మొత్తం మీద ఆమె రూ. 9 లక్షలు వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అధికారిక నిర్ధారణ లేకపోయినా, ఇది ఆమెను ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలబెట్టింది. అయితే, ఈ మొత్తాన్ని స్వయంగా తన సేవా కార్యక్రమాలకు వెచ్చించబోతున్నట్టు దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. "ఈ డబ్బులు వికలాంగులు, క్యాన్సర్ రోగులు, పేద ప్రజలకు ఉపయోగపడాలి. మాకు దైవం ఇచ్చినదే చాలింది, ఈ మొత్తాన్ని సర్వీస్‌లో కలుపుతాం" అని మాధురి స్పష్టంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిత్వాన్ని చూపించడమే కాకుండా ప్రేక్షకుల మనసులను కూడా తాకాయి.

Credit: Filmibeat

Desktop Bottom Promotion