Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.!
బంగారం కొనుగోలుపై బ్యాంక్ ఆఫ్ అమెరికా సంచలన నివేదిక.. ధరల పెరుగుదలపై కీలక సూచన
బంగారం ధరలు 2025లో అత్యంత చారిత్రాత్మక స్థాయిలను తాకాయి. నవంబర్ 25 2025 నాడు దేశంలో రూ. 1, 25 వేలకు పైగానే ట్రేడ్ అయింది. ఈ సంవత్సరం మొదటిసారిగా బంగారం చరిత్రలో రికార్డుగా ఔన్సుకు4,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. అక్టోబర్ 7, 2025న ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధర 4,014.60 డాలర్ల ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకోవడం, అంతకుముందు ఎప్పుడూ కనిపించని రికార్డు. దాన్ని తాజాగా అధిగమించింది.
ఈ భారీ పెరుగుదలకు పలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడులు, అలాగే బలహీనబడుతున్న అమెరికన్ డాలర్ ఇవన్నీ సురక్షిత ఆస్తి అయిన బంగారం వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి. ప్రపంచంలోని చాలా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో బంగారం ప్రధాన ఆశ్రయంగా నిలిచింది.

2026లో బంగారం ధర ఎటు దిశగా కదులుతుందనే విషయంలో నిపుణుల అభిప్రాయాలు బాగా విభిన్నంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) తన గ్లోబల్ ఫండ్ మేనేజర్ల సర్వేలో వచ్చిన గణాంకాలను ది కోబెయిస్సీ లెటర్ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. బంగారం ధరలు భవిష్యత్తులో మళ్లీ భారీగా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అన్నది పెట్టుబడిదారుల మధ్య పూర్తిగా విభజన అయింది.
బంగారం ఈ ధర వద్దకు వచ్చేదాకా ఆగండి.. లాభాల కోసం కొనుగోలు రేటును సూచిస్తున్న బులియన్ నిపుణులు
సర్వేలో పాల్గొన్న ఫండ్ మేనేజర్లలో..
కేవలం 5 శాతం మంది మాత్రమే 2026 చివరినాటికి Gold ఔన్సుకు 5,000 డాలర్లకు దాటుతుందని నమ్ముతున్నారు.
34 శాతం మంది బంగారం ధరలు 4,000 నుంచి 4,500 డాలర్ల మధ్య రేంజ్‌లో స్థిరపడతాయని భావిస్తున్నారు.
27శాతం మంది ధరలు 4,500 నుంచి 5 వేల డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మరో 34 శాతం మంది మాత్రం Gold మళ్లీ 4 వేల డాలర్ల కంటే దిగువకు పడిపోవచ్చని చెబుతున్నారు. అందులో 26 శాతం మంది 3,500 నుంచి 4 వేల డాలర్ల రేంజ్‌లోకి దిగిపోతుందని అంచనా వేయడం ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు.
వీరితో పాటుగా సర్వేలో పాల్గొన్న ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లలో 39 శాతం మంది తమ పోర్ట్‌ఫోలియోలలో బంగారాన్ని అసలు కలిగి లేరు. అంటే, ప్రస్తుత రికార్డు స్థాయిల వద్ద బంగారాన్ని కొనాలా? వద్దా? అన్న దానిపై పెద్ద స్థాయిలో సందిగ్ధత ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవే..
అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. మొత్తం 8,133.46 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 261.5 మిలియన్ ట్రాయ్ ఔన్సుల పసిడిని కలిగి ఉంది. ఇవి ప్రధానంగా ఫోర్ట్ నాక్స్ (కెంటుకీ), వెస్ట్ పాయింట్ (న్యూయార్క్), డెన్వర్ మింట్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వంటి అత్యంత సురక్షిత ప్రదేశాల్లో నిల్వచేయబడ్డాయి. 2025 నాటికి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, అమెరికా బంగారం నిల్వల మొత్తం మార్కెట్ విలువ 1 ట్రిలియన్‌ను దాటింది. ఇది ఆర్థిక శక్తి, భౌగోళిక రాజకీయ ప్రభావం, కరెన్సీ స్థిరత్వానికి దేశానికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే..బంగారం ధరలు 2025లో భారీగా పెరిగినప్పటికీ, 2026లో అది కొనసాగుతుందా? లేదా పతనం అవుతుందా? అనేది ఇంకా స్పష్టత లేని అంశం. కొంతమంది విశ్లేషకులు బంగారం డిమాండ్ కొనసాగుతుందని నమ్ముతుండగా, మరికొందరు ధరల్లో భారీ సవరణ వచ్చే అవకాశాన్ని ఎక్కువగా చూడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
