Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
బంగారం కొనాల్సిన సమయం ఇదే.. భవిష్యత్తులో కొనలేరని హెచ్చరిస్తున్న బులియన్ నిపుణులు
ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మరియు మార్కెట్ నిపుణులు దీన్ని ఒకసువర్ణావకాశంగా (Golden Opportunity) చూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత బంగారానికి ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే మార్కెట్ నిపుణులు దీన్ని తాత్కాలిక సవరణగా (short-term correction) భావిస్తున్నారు.
అక్టోబర్ 20న ఔన్సుకు 4,381.5 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ఇప్పుడు సుమారు 23 శాతం తగ్గి 3,371 డాలర్ల వద్ద ఉంది. ఇది 200-రోజుల చలన సగటు (200-DMA) కంటే కింద ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం ఇది మంచి కొనుగోలు స్థాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. జెఫరీస్ గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ తన Greed & Fear నివేదికలో పేర్కొన్నట్లుగా.. బంగారం మరింత సరిదిద్దుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు డిప్‌లో కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహం అని అన్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుండి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 200 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. పోలాండ్, కజకిస్తాన్, అజర్‌బైజాన్ దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఈ ధోరణి బంగారం ధరలకు దీర్ఘకాల మద్దతుగా ఉంది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 53.3 శాతం పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు.

జూలియస్ బేర్ బ్యాంక్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. వారు భావిస్తున్నట్లుగా బంగారం గరిష్టంగా ఔన్సుకు 3,500 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో దీర్ఘకాల దృష్టితో ఇది సేవ్ హేవెన్ బైయింగ్ కు మంచి సమయం అని చెబుతున్నారు.
డబ్బు విలువ పతనమవుతోంది..ఇప్పుడు మీరు కొనాల్సిన నిజమైన ఆస్తులు ఇవే.. కియోసాకి హెచ్చరిక..
బ్యాంక్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వైవ్స్ బోన్జోన్ పేర్కొన్నట్లుగా.. G7 దేశాల కరెన్సీలు బలహీనపడడం, అలాగే ఆర్థిక పరిమితులు కొనసాగడం వల్ల, Gold మధ్యకాలిక, దీర్ఘకాలంలో బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఆర్థిక విశ్వాస సూచీ (University of Michigan Consumer Sentiment Index) నవంబర్‌లో 50.3కి పడిపోవడంతో బంగారం పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఇది 2022 తర్వాత కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు.
బంగారం ధరలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
ఎంఎకే గ్లోబల్ విశ్లేషకురాలు రియా సింగ్ అభిప్రాయం ప్రకారం.. డాలర్ బలహీనత, ట్రెజరీ రాబడులు తగ్గడం వంటి అంశాలు బంగారానికి సానుకూలంగా మారుతున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ సమస్య త్వరగా పరిష్కారమైతే బంగారంపై తాత్కాలిక ఒత్తిడి రావచ్చని చెబుతున్నారు.
మార్కెట్ టెక్నికల్ విశ్లేషకులు సూచించిన ముఖ్య మద్దతు స్థాయిలు:
ప్రాథమిక మద్దతు (కొనుగోలు స్థాయి): ఔన్సుకు 3,800 డాలర్లు.
దీర్ఘకాలిక మద్దతు (కొనుగోలు స్థాయి): ఔన్సుకు 3,500 డాలర్లు. (గతంలో 2020, 2022లో ఇదే స్థాయిలో బంగారం రీబౌండ్ అయ్యింది)
నిరోధ స్థాయిలు (కొనుగోలు ఆపే స్థాయిలు):
మొదటి నిరోధం: 4,420 డాలర్లు
రెండవ నిరోధం: 4,500 నుంచి 4,520 డాలర్లు
మూడవ నిరోధం: 4,675 డాలర్లు
బంగారం ఇప్పుడు తాత్కాలిక సరిదిద్దుకునే దశలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బలమైన ఆస్తి తరగతిగా నిలుస్తోంది. నిపుణుల సూచన ప్రకారం 3,500 నుంచి 3,800 డాలర్ల మధ్య ధరలకు పడిపోతే డిప్ బైయింగ ఉత్తమ వ్యూహంగా చెబుతున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో బంగారం ధరలు తిరిగి 4,500 డాలర్ల పైకి వెళ్ళే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడం ఒక దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా చూడవచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
