బంగారం ధర కుప్పకూలబోతోంది.. కొనుగోలుకు రెడీగా ఉండాలంటున్న ఆర్థిక నిపుణులు

By Borra Hazarathaiah

2025 పండుగ సీజన్‌లో బంగారం మళ్లీ తన మెరుపును చూపించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం ద్వారా సంవత్సరం ఆరంభం నుండి దాదాపు 50 శాతం పెరిగింది. దీపావళి ముందు వినియోగదారుల కొనుగోళ్ల ఉత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, సురక్షిత ఆస్తులపై పెట్టుబడిదారుల ఆకర్షణ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. అయితే, పండుగల తర్వాత డాలర్ బలపడటం, వాణిజ్య చర్చల్లో సానుకూల సంకేతాలు రావడంతో Gold ధరలు కొద్దిగా వెనక్కి తగ్గాయి.

అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ప్రపంచ మార్కెట్లు బంగారం ధరలపై కొత్త మార్పును ఊహిస్తున్నాయి. VT మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్వెల్ మాట్లాడుతూ.. అమెరికా-చైనా, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలు బంగారం దిశను గణనీయంగా ప్రభావితం చేయగలవు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కరెన్సీ కదలికలు, కేంద్ర బ్యాంకు నిర్ణయాలు అన్నీ కలిపి ఈ మార్కెట్‌కి ఊపును ఇస్తాయని అన్నారు.


India US trade deal gold price forecast 2025 gold demand India gold import duty India India US trade talks gold market analysis bullion outlook 2025 India US tariff reduction gold investment news global gold rates precious metals forecast India US economic relations gold price fall prediction India US free trade agreement impact of trade deal on gold analysts view on gold commodity market trends gold price news today 2025 2025 -

మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చలు, అలాగే భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఏర్పడే అవకాశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఈక్విటీల వైపు మళ్లే అవకాశం ఉంది. దీని వల్ల స్వల్పకాలంలో బంగారం ధరల్లో దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

అయితే, వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగితే లేదా ఒప్పందాలు ఆశించిన స్థాయికి చేరుకోకపోతే బంగారం మళ్లీ లాభదాయక దిశలో కదిలే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాక్స్వెల్ మాట్లాడుతూ, FED వడ్డీ రేట్లపై జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తే, డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ఇది బంగారానికి మద్దతు ఇస్తుంది. పెట్టుబడిదారులు అనిశ్చితి మధ్య భద్రత కోరుకున్నప్పుడు బంగారం డిమాండ్ మళ్లీ పెరుగుతుందని పేర్కొన్నారు.

బంగారం ధర భారీగా తగ్గింది.. ఇంకా తగ్గుతుంది తొందరపడి కొనకండి.. నవంబర్ 5, బుధవారం ధరలు ఇవే..

ఇక వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసి అమెరికా-చైనా, భారత్-అమెరికా మధ్య స్థిరమైన ఒప్పందాలు కుదిరితే, డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది. దీని ఫలితంగా బంగారం ఆకర్షణ తగ్గుతుందని మాక్స్వెల్ హెచ్చరిస్తున్నారు. స్వల్పకాలంలో బంగారం అధికంగా కొనుగోలు చేయబడింది. కొత్త ప్రేరణలు లేకుండా దీని పెరుగుదల పరిమితంగా ఉంటుందని ఆయన అన్నారు.దీర్ఘకాల దృష్టిలో మాత్రం బంగారం పట్ల విశ్లేషకులు ఇంకా ఆశావహంగానే ఉన్నారని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో డాలర్‌పై ఆధారాన్ని తగ్గించి, బంగారాన్ని విస్తృతంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది బంగారం విలువను కాపాడడమే కాకుండా దీర్ఘకాలిక పెరుగుదలకు మార్గం సుగమం చేస్తుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. ఏదేమైనా తదుపరి కొన్ని వారాలు బంగారం భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. వాణిజ్య చర్చలు స్థిరంగా సాగితే బంగారం ధరలు స్థిరపడే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే, బంగారం మళ్లీ సురక్షిత ఆశ్రయం కావచ్చు. ధరలు విపరీతంగా పెరగవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Desktop Bottom Promotion