రూ.7199 ధరకే 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.88 అంగుళాల డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌..!

By Suravarapu Dileep

మోటోరోలా ఇటీవల కాలంలో పవర్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ లను లాంచ్‌ చేస్తోంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలలో సుమారు రూ.7 వేల ధర రేంజ్‌లో 7000mAh భారీ బ్యాటరీతో మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీతోపాటు భారీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. వేగాన్ లెదర్‌ బ్యాక్ ప్యానల్‌ కూడా ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

రూ.7199 ధరకే స్మార్ట్‌ఫోన్ :
మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ (Moto G06 Power Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర గతంలో రూ.7499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అంటే రూ.7199 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ లెవల్ ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.


Moto G06 Power smartphone with 7000mAh large battery 50MP camera available at Rs7199 price on flipkart

వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ :
మోటో G06 పవర్‌ ఫోన్‌ ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌తో కూడిన వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్‌ టేప్‌స్ట్రీ, పాంటోన్‌ టెండ్రిల్, పాంటోన్‌ లారెల్‌ ఓక్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది. మరియు IP64 రేట్ంగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

భారీ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ (720 x 1640 పిక్సల్స్‌ రిజల్యూషన్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

ఈ మోటో ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్‌ SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI తో పనిచేస్తోది. ప్రస్తుతానికి ఒకే స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తోంది. మైక్రో SD కార్డుతో ఈ ఫోన్‌ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది.

7000mAh భారీ బ్యాటరీ :
మోటో G06 పవర్‌ హ్యాండ్‌సెట్‌ సుమారుగా రూ.7 వేల ధరలో అందుబాటులోకి వచ్చినా.. 18W ఛార్జింగ్ సామర్థ్యంతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 65 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుందని మోటో తెలిపింది.

ఈ ఫోన్‌ మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 4G, వైఫై, బ్లూటూత్ 6.0, USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌ లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. గూగుల్ జెమిని AI అసిస్టెంట్‌ కూడా ఉంది.

Credit: Gizbot

Desktop Bottom Promotion